Coordinates: 18°00′N 79°35′E / 18.0°N 79.58°E / 18.0; 79.58

హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91: పంక్తి 91:
|16 ||[[కొడకండ్ల]] ||33 ||[[సంగెం,వరంగల్ జిల్లా|సంగెం]] ||50 ||[[మంగపేట]]
|16 ||[[కొడకండ్ల]] ||33 ||[[సంగెం,వరంగల్ జిల్లా|సంగెం]] ||50 ||[[మంగపేట]]
|-
|-
|17 ||[[రాయిపర్తి]] ||34 ||[[నల్లబెల్లి]] ||51 ||[[వరంగల్ మండలము|వరంగల్]]
|17 ||[[రాయపర్తి]] ||34 ||[[నల్లబెల్లి]] ||51 ||[[వరంగల్ మండలము|వరంగల్]]
|-
|-
|}
|}
పంక్తి 130: పంక్తి 130:
* [[పాకాల సరస్సు|పాకాల చెఱువు]]: 1213 సంవత్సరంలో [[కాకతీయ|కాకతీయ]] రాజు [[గణపతి దేవుడు]] 30 చదరపు కి.మీ విస్తీర్ణములో త్రవ్వించాడు. ఈ ప్రదేశము ఇప్పుడు పర్యాటకులకు చాలా నేత్రానందం కలిగిస్తున్నది. ఈ చెఱువు ఒడ్డున పాకాల వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం 839 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నది. ఈ వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి ఏతునగరం సంరక్షణా కేంద్రం అని కూడా పేరు కూడా ఉన్నది. ఇక్కడ దట్టమైన అడవులు మరియు జంతు సంపద ఉన్నది. స్వేఛ్ఛగా తిరుగాడే జింకలు, చిరుతపులులు, హైనాలు, తోడేళ్ళు, గుంట నక్కలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, నీలగాయి, ముళ్ళపందులు, లంగూర్లు వంటి క్షీరదాలకూ, కొండ చిలువలు, నాగుపాములు, కట్లపాములు, ఉడుములు మరియు మొసళ్ళవంటి సరీసృపాలకు ఈ సంరక్షణా కేంద్రము ఆవాసాన్నిస్తున్నది.
* [[పాకాల సరస్సు|పాకాల చెఱువు]]: 1213 సంవత్సరంలో [[కాకతీయ|కాకతీయ]] రాజు [[గణపతి దేవుడు]] 30 చదరపు కి.మీ విస్తీర్ణములో త్రవ్వించాడు. ఈ ప్రదేశము ఇప్పుడు పర్యాటకులకు చాలా నేత్రానందం కలిగిస్తున్నది. ఈ చెఱువు ఒడ్డున పాకాల వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం 839 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నది. ఈ వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి ఏతునగరం సంరక్షణా కేంద్రం అని కూడా పేరు కూడా ఉన్నది. ఇక్కడ దట్టమైన అడవులు మరియు జంతు సంపద ఉన్నది. స్వేఛ్ఛగా తిరుగాడే జింకలు, చిరుతపులులు, హైనాలు, తోడేళ్ళు, గుంట నక్కలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, నీలగాయి, ముళ్ళపందులు, లంగూర్లు వంటి క్షీరదాలకూ, కొండ చిలువలు, నాగుపాములు, కట్లపాములు, ఉడుములు మరియు మొసళ్ళవంటి సరీసృపాలకు ఈ సంరక్షణా కేంద్రము ఆవాసాన్నిస్తున్నది.
* '''వన విజ్ఞాన కేంద్రం''' : వన విజ్ఞాన కేంద్రం అంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడినది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్లు హంటర్ రోడ్డు మీద ఉన్నది.
* '''వన విజ్ఞాన కేంద్రం''' : వన విజ్ఞాన కేంద్రం అంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడినది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్లు హంటర్ రోడ్డు మీద ఉన్నది.
* [[కొమురవెల్లి]] : [[సిద్ధిపేట]] నుండి [[హైదరాబాదు|సికిందరాబాదు]] వెళ్ళే మార్గంలో [[సిద్ధిపేట]]కు 10 కి.మీ దూరంలో ఉన్న [[కొమురవల్లి మల్లన్న(మల్లికార్జున) స్వామి దేవాలయం]] చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి రైలు సౌకర్యం లేదు. ఇక్కడ జాతర జనవరి నెలలో [[మకర సంక్రాంతి]] రోజున ప్రారంభమై [[ఉగాది]] వరకు,ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాలనుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు.వీటిని లష్కర్ బోనాలు గా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో [[బోనం]] , [[పట్నం]] అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే,అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం ( అన్నం ) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశం లో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే.ఢమరుకం(జగ్గు) వాయిస్తూ ,జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు.వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి,చేతిలో ముగ్గుపలక,ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణం లో కనువిందు చేస్తారు.జాతర చివరలో కామ దహనం( హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు,విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికం గా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీర శైవ(బలిజ) పూజారులు , వీరభద్రుణ్ణి , భద్రకాళిని పూజించి,సాంప్రదాయ బద్ధమైన పూజలు జరిపి,రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలం లో టన్నులకొద్దీ కర్రలను పేర్చి , మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ట చేస్తారు.తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి.వాటిని విశాలంగా నేర్పి , కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు.వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని [[అగ్ని గుండాలు]] అని పిలుస్తారు. [[ఫైలు:Bhadrakaliamma_m.jpg|thumb|240px|శ్రీ భద్రకాళి అమ్మవారు]]
* [[కొమురవెల్లి]] : [[సిద్ధిపేట]] నుండి [[హైదరాబాదు|సికిందరాబాదు]] వెళ్ళే మార్గంలో [[సిద్ధిపేట]]కు 10 కి.మీ దూరంలో ఉన్న కమురవల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి రైలు సౌకర్యం లేదు. ఇక్కడ జాతర జనవరి నెలలో ప్రారంభమై [[ఉగాది]] వరకు జరుగుతుంది. జాతర చివరి వారంలో ఇక్కడ బాణా సంచా కాలుస్తారు దీనిని అగ్ని గుండాలు అని పిలుస్తారు. [[ఫైలు:Bhadrakaliamma_m.jpg|thumb|240px|శ్రీ భద్రకాళి అమ్మవారు]]
* [[భద్రకాళి దేవాలయము]]: వరంగల్ నగరం నడిబొడ్డున శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువైవున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం. దసరా పండుగ నాడు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు జరుగును . దసరా పండుగనాడు లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు . వరంగల్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుండి కూడా భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
* [[భద్రకాళి దేవాలయము]]: వరంగల్ నగరం నడిబొడ్డున శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువైవున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం. దసరా పండుగ నాడు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు జరుగును .ఆషాఢ మాసం లో జరిగే శాకంబరి ఉత్సవాలలో అమ్మవారిని కూరగాయలు,పళ్ళతో అలంకరిస్తారు.వైశాఖ మాసం లో కళ్యాణోత్సవం జరుగుతుంది. దసరా పండుగనాడు లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు . వరంగల్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుండి కూడా భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.


== క్రీడలు==
== క్రీడలు==

02:43, 16 జూన్ 2013 నాటి కూర్పు

  ?వరంగల్
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of వరంగల్, India
View of వరంగల్, India
అక్షాంశరేఖాంశాలు: 18°00′N 79°35′E / 18.0°N 79.58°E / 18.0; 79.58
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 12,846 కి.మీ² (4,960 చ.మై)
ముఖ్య పట్టణం వరంగల్
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
35,22,644 (2011 నాటికి)
• 274/కి.మీ² (710/చ.మై)
• 1766257
• 1756387
• 58.41(2001)
• 70.01
• 46.54
హనుమకొండ పద్మాక్షి అమ్మవారి చిత్రము

వరంగల్ జిల్లా దక్షిణ భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో ఒక జిల్లా. ఇది రాష్ట్ర రాజధాని అగు హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. వరంగల్ జిల్లా కు ముఖ్య పట్టణం - వరంగల్. కాకతీయ విశ్వవిద్యాలయము కాకతీయ మెడికల్‌ కాలేజి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి. పీపుల్స్‌వార్‌ గ్రూపు, (ప్రస్తుత మావోయిస్టుల)కు వరంగల్లు జిల్లా ఒకప్పుడు గట్టి స్థావరం. వరంగల్లు ఆంధ్ర ప్రదేశ్ లోకెల్లా నాలుగవ అతి పెద్ద నగరము. అతి త్వరలో గ్రేటర్ (మహా నగరం ) గా మారబోతోంది.

జిల్లా చరిత్ర

11వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాధుని విగ్రహం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం)

క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాలుగు వైపులా శిలా ద్వారాలు కలిగిన పెద్ద కోట (వరంగల్ కోట), స్వయంభూ దేవాలయము, రామప్ప దేవాలయము మొదలైనవి వీటిలో కొన్ని. కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయులలో ప్రముఖ పాలకులు గణపతిదేవ చక్రవర్తి, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు.


14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687 లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారత దేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడింది.

పురావస్తు శాఖవారు ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక కట్టడం అయిన వేయి స్తంభముల దేవాలయాన్ని మరమత్తు చేయడానికి పూనుకొన్నారు. అయితే వారు జరిపిన త్రవ్వకాలలో ఒక విస్మయం చెందే విషయం బయటపడినది. ఉత్తరం దిక్కుగా ఉన్న ఆలయం క్రింద ఒక నీటితొ నిండిన బావి బయటపడినది. ఉపరితలం నుండి సుమారు 3-4 మీటర్ల లోతున ఈ బావి ఉంది. అంతేకాకుండా కట్టడం క్రింద అనగా పునాది క్రింద మొత్తం ఇసుకతో ఉండడం మరొక విషయం. ఆకాలం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇలా పునాది క్రింద మొత్తం ఇసుకతో కట్టడానికి భూకంపాలనుండి రక్షించడానికి అని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ విషయం మీద పురావస్తు శాఖ ఇంకా తన పరిశోధన కొనసాగిస్తుంది.

1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. విద్యార్దులు, ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయదారులు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్ధులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్ధులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.


భౌగోళిక స్వరూపం

వరంగల్ జిల్లా 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగి ఉంది. బొగ్గు మరియు గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి మరియు పొగాకు పంటలు విరివిగా పండుతాయి.

వాతావరణం

గాలిలోని తేమశాతం సగం మాత్రమే ఉండే తెలంగాణా భూభాగంలో ఉన్న కారణంగా వరంగల్ వాతావరణం వేడివాతావరణం కలిగి ఉంటుంది. మార్చ్ మాసంలో ఆరంభం అయ్యే వేసవి కాలం మే మాసానికి 42 °(108 ° ఫారెన్ హీట్ ) సెంటీగ్రేడుల శిఖరాగ్రం చేరుకుంటుంది. జూన్ మాసానికంతా ఆరంభం అయ్యే వర్షాలు సెప్టేంబర్ వరకు కురుస్తుంటాయి. వర్షపాతం 22 మిల్లీమీటర్ల (22 అంగుళాలు)వరకు కురుస్తుంది. నవంబర్ మాసం నుండి మంచుకురవని తేమలేని స్వల్పమైన శీతాకాలం ఆరంభం అయి ఫిబ్రవరి మాసం ఆరంభం వరకు ఉంటుంది. శీతాకాలం సరసరి ఉష్ణోగ్రత 22-23 ° సెంటీగ్రేడులు (72-73 ఫారెన్ హీట్ )వరకు ఉంటుంది. వరంగల్ జిల్లా సందర్శనానికి ఇది తగిన సమయం. వరంగల్ జిల్లా సముద్రమట్టానికి 302 మీటర్ల (990 అడుగులు)ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని భూపర్యవేష్టిత జిల్లాలలో ఇది ఒకటి. అలాగే అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలలో కూడా ఇది ఒకటి.

ఆర్ధిక స్థితి గతులు

వరంగల్ ఆర్ధికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు మరియు వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మద్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్థుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ)వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ మరియు హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉన్నది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

భౌగోళికంగా వరంగల్ జిల్లాను 51 రెవిన్యూ మండలములుగా విభజించినారు. [2]

వరంగల్ జిల్లా మండలాలు
సంఖ్య పేరు సంఖ్య పేరు సంఖ్య పేరు
1 చేర్యాల 18 తొర్రూర్ 35 దుగ్గొండి
2 మద్దూర్ 19 నెల్లికుదురు 36 గీసుకొండ
3 నర్మెట్ట 20 నర్సింహులపేట 37 ఆత్మకూరు
4 బచ్చన్నపేట 21 మరిపెడ 38 శాయంపేట
5 జనగాం 22 డోర్నకల్లు 39 పరకాల
6 లింగాల ఘనా‌‌పూర్‌ 23 కురవి 40 రేగొండ
7 రఘునాథపల్లి 24 మహబూబాబాద్‌ 41 మొగుళ్ళపల్లి
8 స్టేషన్‌ ఘనా‌పూర్‌ 25 కేసముద్రం 42 చిట్యాల
9 ధర్మసాగర్‌ 26 నెక్కొండ 43 భూపాలపల్లి
10 హసన్‌పర్తి 27 గూడూరు 44 ఘనపూర్‌
11 హనుమకొండ 28 కొత్తగూడెం 45 ములుగు
12 వర్ధన్నపేట 29 ఖానాపూర్‌ 46 వెంకటాపూర్‌
13 జాఫర్‌గఢ్‌ 30 నర్సంపేట 47 గోవిందరావుపేట
14 పాలకుర్తి 31 చెన్నారావుపేట 48 తాడ్వాయి
15 దేవరుప్పుల 32 పర్వతగిరి 49 ఏటూరునాగారం
16 కొడకండ్ల 33 సంగెం 50 మంగపేట
17 రాయపర్తి 34 నల్లబెల్లి 51 వరంగల్


పడమర వరంగల్

  • 2010 అసెంబ్లీ ఉప ఎన్నికలలో దాస్యం వినయ భాస్కర్ 74.85% శాతం ఓట్లతో విజయం సాధించారు.
  • 2009 అసెంబ్లీ ఎన్నికలలో దాస్యం వినయభాస్కర్ 39.64% శాతం ఓట్లతో విజయం సాధించారు.

తూర్పు వరంగల్

  • 2009 అసెంబ్లీ ఎన్నికలలో బసవరాజు సారయ్య 32.66% శాతం ఓట్లతో విజయం సాధించారు.

రవాణా వ్వవస్థ

వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మామ్నూరు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మమ్ రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు మరియు అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం.

రైలు

వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మద్య రైల్వే విభాగానికి చెందినది. వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది హైదరాబాదు, న్యూ డిల్లీ, విజయవాడ, చెన్నై మరియు కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్)ఖాజీపేట రైల్వే జంక్షనే. వరంగల్ రైలు స్టేషన్ హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషన్ ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషన్లలో పెద్ద రైలు స్టేషన్లలో వరంగల్ రైలు స్టేషన్ ఒకటి.

రోడ్డు

హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్ మరియు హనుమకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి. వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి మరియు బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్ష్ప్రెస్స్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియల్ మార్గంలో వరంగల్6ను చేరుకుంటాయి.

జనాభా లెక్కలు

1981 నాటి జనాబ లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాబ
22,99,61,స్త్రీ,పురుషుల నిష్పత్తి... 987:1000, అక్షరాశ్యత...23.84 శాతం (మూలం: ఆంధ్రాప్రదేశ్ దర్శిని. 1985)

2011 భారతీయ జనాభా గణాంకాలను అనుసరించి వరంగల్ జిల్లా జనాభా 759,594. వీరిలో పురుషుల శాతం 51%. స్త్రీల శాతం 49%. 2001 గణాంకాల ప్రకారం వరంగల్ జిల్లాఅక్షరాస్యత 84.16%. ఇది జాతీయక్షరాస్యత 69.5% కంటే అధికం. వీరిలో పురుషుల అక్షరాస్యత శాతం 91.54%. స్త్రీల అక్షరాస్యత 76.79%. వరంగల్ జిల్లాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారి శాతం 11%.

సంస్కృతి

వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు. వరంగల్ ప్రజలు సంప్రదాయమైన చీరె మరియు ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు. జిల్లాలో ప్రతీ రెండేళ్ళ కొకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరకు 90 లక్షల మందికి పైగా యాత్రికులు వస్తారు. వరంగల్లుకు 90 కి.మీ ల దూరంలో గల మేడారం గ్రామం వద్ద జరిగే ఈ జాతర అధర్మ చట్టాన్ని ఎదిరించి పోరాడిన ఒక తల్లీ, కూతురుల ప్రతిఘటనకు స్మృత్యర్ధం జరుగుతుంది.చిన్న గ్రామమైన మేడారం వద్ద తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుని భక్తులు జంపన వాగు వద్ద కూడి ఈ జాతర జరుపుకుంటారు. వరంగల్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో జరిగే ఈ జాతర గిరిజన తెగలలో జరిగే అతి పెద్ద పండుగగా భావించబడుతుంది. ఈ జాతర కుంభమేళా తరువాత ఆసియాలో జరిగే అతి పెద్ద ప్రజాకూడికగా భావించబడుతుంది.

వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా యువత విదేశాలలో పని చేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పని చేస్తున్నారు. అత్యధికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న వారే. అనేకంగా ప్రతి ఇంట్లో విదేశాలలో నివసిస్తున్న సభ్యులు ఉన్నారు. యువతలో అధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న కారణంగా ఐ టి సంస్థలు ఇక్కడ తమ శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపుతున్నారు.

పశుపక్ష్యాదులు

విద్యాసంస్థలు

వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగల్ ఆంద్రప్రదేశ్ జిల్లాలలో విస్త్రీర్ణంలో నాల్గవస్థానంలో ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్)మరియు కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్ధులు అనేకులు దేశ విదేశాలలో వున్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.

ఆకర్షణలు

దోమకొండ ఆలయము, నిజామాబాదు జిల్లా
  • ఓరుగల్లు కోట: ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్ధము నుండి ఉన్నది. ఓరుగల్లు కోట 13 వరంగల్లు పట్టణానికి 2 కి.మి దూరములో ఉన్నది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్నది రాతి కోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి (పూర్ణ కుంభం వంటివి). ఈ కీర్తి తోరణాలు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆధికారిక చిహ్నంగా ఉపయోగిస్తున్నది.
  • వెయ్యి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు.
  • రామప్ప దేవాలయము : దీనిని రామ లింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
  • పాకాల చెఱువు: 1213 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు 30 చదరపు కి.మీ విస్తీర్ణములో త్రవ్వించాడు. ఈ ప్రదేశము ఇప్పుడు పర్యాటకులకు చాలా నేత్రానందం కలిగిస్తున్నది. ఈ చెఱువు ఒడ్డున పాకాల వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం 839 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నది. ఈ వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి ఏతునగరం సంరక్షణా కేంద్రం అని కూడా పేరు కూడా ఉన్నది. ఇక్కడ దట్టమైన అడవులు మరియు జంతు సంపద ఉన్నది. స్వేఛ్ఛగా తిరుగాడే జింకలు, చిరుతపులులు, హైనాలు, తోడేళ్ళు, గుంట నక్కలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, నీలగాయి, ముళ్ళపందులు, లంగూర్లు వంటి క్షీరదాలకూ, కొండ చిలువలు, నాగుపాములు, కట్లపాములు, ఉడుములు మరియు మొసళ్ళవంటి సరీసృపాలకు ఈ సంరక్షణా కేంద్రము ఆవాసాన్నిస్తున్నది.
  • వన విజ్ఞాన కేంద్రం : వన విజ్ఞాన కేంద్రం అంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడినది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్లు హంటర్ రోడ్డు మీద ఉన్నది.
  • కొమురవెల్లి : సిద్ధిపేట నుండి సికిందరాబాదు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 10 కి.మీ దూరంలో ఉన్న కొమురవల్లి మల్లన్న(మల్లికార్జున) స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి రైలు సౌకర్యం లేదు. ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు,ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాలనుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు.వీటిని లష్కర్ బోనాలు గా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం , పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే,అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం ( అన్నం ) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశం లో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే.ఢమరుకం(జగ్గు) వాయిస్తూ ,జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు.వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి,చేతిలో ముగ్గుపలక,ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణం లో కనువిందు చేస్తారు.జాతర చివరలో కామ దహనం( హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు,విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికం గా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీర శైవ(బలిజ) పూజారులు , వీరభద్రుణ్ణి , భద్రకాళిని పూజించి,సాంప్రదాయ బద్ధమైన పూజలు జరిపి,రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలం లో టన్నులకొద్దీ కర్రలను పేర్చి , మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ట చేస్తారు.తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి.వాటిని విశాలంగా నేర్పి , కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు.వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్ని గుండాలు అని పిలుస్తారు.
    దస్త్రం:Bhadrakaliamma m.jpg
    శ్రీ భద్రకాళి అమ్మవారు
  • భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువైవున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం. దసరా పండుగ నాడు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు జరుగును .ఆషాఢ మాసం లో జరిగే శాకంబరి ఉత్సవాలలో అమ్మవారిని కూరగాయలు,పళ్ళతో అలంకరిస్తారు.వైశాఖ మాసం లో కళ్యాణోత్సవం జరుగుతుంది. దసరా పండుగనాడు లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు . వరంగల్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుండి కూడా భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

క్రీడలు

ప్రముఖవ్యక్తులు

వరంగల్, భాగవతమును సంస్కృతం నుండి తెనిగించిన బమ్మెర పోతన వంటి కవులకు ప్రసిద్ధి చెందింది. అలాగే పాల్కూరి సోమన్న మరియు ఆధునిక కవి అయిన కాళోజీ నారాయణ రావు వంటి కవులు వరంగల్ వాసులే. భారత ప్రధానమంత్రి గా పనిచేసిన పి.వి.నరసింహారావుఈ జిల్లా వారే.

బయటి లింకులు

మూలాలు

  1. 2009 నియోజకవర్గాల పునర్విబజన ద్వారా ఏర్పడినవి [1].
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో వరంగల్ జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.