చిరునామా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q319608 (translate me)
చి Wikipedia python library
పంక్తి 11: పంక్తి 11:


==చిరునామా ఉపయోగాలు==
==చిరునామా ఉపయోగాలు==
* ఒక నివాసాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక జనావాసాలు ఉండే పెద్ద పట్టణాలు, నగరాలలో ఇది చాలా అవుసరం.
* ఒక నివాసాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక జనావాసాలు ఉండే పెద్ద పట్టణాలు, నగరాలలో ఇది చాలా అవసరం.
* తపాలా వ్యవస్థలో ఇది చిట్టచివరి మజిలీగా ఉంటుంది.
* తపాలా వ్యవస్థలో ఇది చిట్టచివరి మజిలీగా ఉంటుంది.
* కొన్ని సందర్భాలలో సమాజంలో ఒకరి స్థాయిని తెలుపడానికి చిరునామా సంకేతంగా ఉంటుంది. (ఉదాహరణకు ఫలాని గల్లీలో ఉంటాడు. ఫలాని సెంటర్‌లోని భవనంలో ఉంటాడు. అడ్రస్ లేకుండా పోతాడు)
* కొన్ని సందర్భాలలో సమాజంలో ఒకరి స్థాయిని తెలుపడానికి చిరునామా సంకేతంగా ఉంటుంది. (ఉదాహరణకు ఫలాని గల్లీలో ఉంటాడు. ఫలాని సెంటర్‌లోని భవనంలో ఉంటాడు. అడ్రస్ లేకుండా పోతాడు)

11:34, 21 జూన్ 2013 నాటి కూర్పు

చిరునామా లేదా అడ్రస్ (Address) అనగా భూమి మీద ఒక వ్యక్తి యొక్క నివాస సంబంధమైన వివరములు. తెలుగులో కూడా "చిరునామా" కంటే "అడ్రస్" అనే ఆంగ్లపదమే అధికంగా వినియోగంలో ఉంది. అధికంగా తపాలా వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి, లేదా ఇంటికి వెళ్ళడానికి అవుసరమైన వివరాలను సూచిస్తూ ఈ పదం వాడుతారు.


"Address" అనే ఆంగ్ల పదం నివాస స్థలం తెలిపే వివరాలకు మాత్రమే కాకుండా అనేక సాంకేతిక విషయాలలో కూడా వాడబడుతున్నది.

  • "మెమరీ అడ్రస్" (memory address) - కంప్యూటర్‌లోని మెమరీలో డేటాను స్టోర్ చేసిన స్థలానికి సంకేతంగా వాడుతారు.
  • "నెట్‌వర్క్ అడ్రస్" (network address) - కంప్యూటర్ నెట్‌వర్క్‌లో ఒక మెసేజి వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్ లేదా సంబంధిత పరికరం)ను సూచిస్తుంది.
  • ఈ-మెయిల్ అడ్రస్ (E-mail address) - ఇంటర్నెట్‌లో మెయిల్ వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్)ను సూచిస్తుంది.
  • "టెలికమ్యూనికేషన్ సిగ్నల్" (signal) - చేరవలసిన స్థలాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది.


చిరునామా ఉపయోగాలు

  • ఒక నివాసాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక జనావాసాలు ఉండే పెద్ద పట్టణాలు, నగరాలలో ఇది చాలా అవసరం.
  • తపాలా వ్యవస్థలో ఇది చిట్టచివరి మజిలీగా ఉంటుంది.
  • కొన్ని సందర్భాలలో సమాజంలో ఒకరి స్థాయిని తెలుపడానికి చిరునామా సంకేతంగా ఉంటుంది. (ఉదాహరణకు ఫలాని గల్లీలో ఉంటాడు. ఫలాని సెంటర్‌లోని భవనంలో ఉంటాడు. అడ్రస్ లేకుండా పోతాడు)
  • గణాంకాల వ్యవస్థలో - ముఖ్యంగా జనగణన, ఇన్షూరెన్సు వంటి విషయాలలో - సమాచారాన్ని సేకరించడానికి, అమర్చుకోవడానికి ఒక కీలకమైన పరామితిగా అడ్రస్ ఉపయోగపడుతుంది.

చిరునామా ధ్రువీకరణ కార్డు

చిరునామా ధ్రువీకరణ కార్డు (పీవోఏ ) (ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ ) కోసం బట్వాడా ఉన్న అన్ని తపాలా కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుధర రూ.10. ప్రస్తుతం ఉంటున్న చిరునామా వివరాలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోతో కొత్త కార్డు కోసం రూ.240 చెల్లించాలి. ఈ కార్డు ఏడాది కాలం చెల్లుబాటులో ఉంటుంది. తర్వాత రూ.140 చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ కార్డు పోతే రూ.90 చెల్లించి నకలు కార్డు పొందవచ్చు.దరఖాస్తులో పేర్కొన్న చిరునామాను పోస్టుమ్యాన్‌ తనిఖీ చేస్తారు. తర్వాత పోస్టుమాస్టర్‌ మరోసారి ధ్రువీకరించుకుని దరఖాస్తులను డివిజనల్‌ కార్యాలయాలకు పంపుతారు. ప్రధాన తపాలా కార్యాలయాల్లో పౌర సంబంధాల ఇన్‌స్పెక్టర్లు (పీఆర్‌ఐ) ఈ బాధ్యతలు చూస్తారు. అక్కడి నుంచి దరఖాస్తులను హైదరాబాద్‌లోని కార్యాలయానికి పంపిస్తారు. తపాలా ముద్ర, హోలోగ్రామ్‌తో చిరునామా ధ్రువీకరణ కార్డులను తయారుచేస్తారు. ఇందులో చిరునామా, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ నంబర్లు, బ్లడ్‌ గ్రూప్‌, సంతకం, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. దరఖాస్తు చేసుకున్న పది పని దినాల్లో ఆ చిరునామాకు కార్డు బట్వాడా అవుతుంది. కార్డులో ఏమైనా తప్పులుంటే సంబంధిత పోస్టుమాస్టర్‌ దృష్టికి తీసుకెళితే తిరిగి కొత్త కార్డు జారీ చేస్తారు. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. తనిఖీ చేయకుండా తప్పుడు చిరునామాలతో కార్డులు జారీ అయితే పోస్టుమాస్టర్లు, పీఆర్‌ఐలనే బాధ్యలను చేస్తారు. చిరునామా తప్పని తేలితే దరఖాస్తులు తిరస్కరిస్తారు. రుసుములు తిరిగి వెనక్కి చెల్లించరు.చిరునామా ఆధార ధ్రువీకరణ కార్డు ఏడాది మాత్రమే పని చేస్తుంది. తర్వాత మళ్లీ సదరు కార్డుదారుడు కార్డును రెన్యూవల్‌ చేయించుకోవాలి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=చిరునామా&oldid=862612" నుండి వెలికితీశారు