దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 173: పంక్తి 173:
జోర్డానుతో న్యూక్లియర్ రియాక్టర్ పరిశోధన ఒపాందం చేసుకున్నది. అర్జెంటీనాతో హెవీ వాటర్ న్యుక్లియర్ నిర్మాణం బాగుచేయడం ఒప్పందం చేసుకున్నది. 2010 లో దక్షిణకొరియా మరియు టర్కీ రెండు న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి చర్చలు జరుపుతున్నది. దక్షిణకొరియా అర్జెంటీనా కొరకు లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
జోర్డానుతో న్యూక్లియర్ రియాక్టర్ పరిశోధన ఒపాందం చేసుకున్నది. అర్జెంటీనాతో హెవీ వాటర్ న్యుక్లియర్ నిర్మాణం బాగుచేయడం ఒప్పందం చేసుకున్నది. 2010 లో దక్షిణకొరియా మరియు టర్కీ రెండు న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి చర్చలు జరుపుతున్నది. దక్షిణకొరియా అర్జెంటీనా కొరకు లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది.


తనతానుగా యురేనియం నిల్వచేసుకోవడానికి లేక సాంప్రదాయకంగా యురేనియం ఉత్పత్తి చేయగల సాంకేతికాభివృద్ధి చేసుకోవడానికి దక్షిణకొరియా అనుమతించబడలేదు. యు.ఎస్ రాజకీయ వాత్తిడే ఇందుకు కారణం. న్యూక్లియర్ జనరేటిన్ టెక్నాలజీ మరియు రియాక్టర్ల ఉత్పత్తిలో దక్షిణకొరియా విజయం సాధించింది.
South Korea is not allowed to enrich uranium or develop traditional uranium enrichment technology on its own, because of US political pressure,[106] unlike most major nuclear powers such as Japan, Germany, and France, competitors of South Korea in the international nuclear market. This impediment to South Korea's indigenous nuclear industrial undertaking has sparked occasional diplomatic rows between the two allies. While South Korea is successful in exporting its electricity-generating nuclear technology and nuclear reactors, it cannot capitalize on the market for nuclear enrichment facilities and refineries, preventing it from further expanding its export niche. South Korea has sought unique technologies such as pyroprocessing to circumvent these obstacles and seek a more advantageous competition.[107] The US has recently been wary of South Korea's burgeoning nuclear program, which South Korea insists will be for civilian use only.[98]


== సైన్యం ==
== సైన్యం ==

17:55, 30 జూన్ 2013 నాటి కూర్పు

대한민국
大韓民國
Daehan Minguk
Republic of Korea
Flag of South Korea South Korea యొక్క Coat of arms
జాతీయగీతం
Aegukga (애국가; 愛國歌)
Patriotic Hymn
South Korea యొక్క స్థానం
South Korea యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Seoul
37°35′N 127°0′E / 37.583°N 127.000°E / 37.583; 127.000
అధికార భాషలు Korean
ప్రభుత్వం Presidential republic
 -  President Park Geun-hye
 -  Prime Minister Jung Hong-won
Establishment
 -  Liberation declared March 1 1919 (de jure
 -  Liberation August 15 1945 
 -  First Republic August 131948 
 -  United Nations Recognition December 12 1948 
విస్తీర్ణం
 -  మొత్తం 99,646 కి.మీ² (108th)
38,492 చ.మై 
 -  జలాలు (%) 0.3
జనాభా
 -  February 2007 అంచనా 49,024,737 (25th)
 -  జన సాంద్రత 480 /కి.మీ² (19th)
1,274 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $1.196 trillion[1] (11th)
 -  తలసరి $24,500 (34th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.912 (high) (26th)
కరెన్సీ South Korean won (KRW)
కాలాంశం Korea Standard Time (UTC+9)
 -  వేసవి (DST) not observed (UTC+9)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .kr
కాలింగ్ కోడ్ +82
1 Cell phone system CDMA
2 Domestic power supply 220V/60 Hz, CEE 7/7 sockets

సౌత్ కొరియాను అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. కొరియన్ ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియా సార్వభౌమాధికారం కలిగిన దేశం. కొరియా అనే పేరు గొరియో అనే పదము నుండి వచ్చింది. గొరియా మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం. దక్షిణ కొరియా పడమర భాగంలో చైనా, తూర్పున జపాన్, ఉత్తరంలో ఉత్తర కొరియా ఉన్నాయి. దక్షిణ కొరియా ఉత్తర సమశీతోష్ణ మండలంలో ప్రధానంగా పర్వతాలతో నిండి ఉంది. దక్షిణ కొరియా వైశాల్యం 99,392 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 5 కోట్లు, రాజధాని మరియు అతి పెద్ద నగరం సియోల్. సియోల్ నగర జనాభా 98 లక్షలు.

పురాతత్వ పరిశోధకులు కొరియన్ ద్వీపపకల్పంలో దిగువ రాతియుగ కాలం నుండి మానవులు నివసించడం ఆరంభమైనదని భావిస్తున్నారు. క్రీ.ఫూ 2333 లో కొరియా ద్వీపకల్పాన్ని దన్-గన్ల చేత కనిపెట్టబడడంతో కొరియా చరిత్ర ఆరంభం అయింది. క్రీ.శ 668 లో కొరియాలోని 3 రాజ్యాలను సమైక్య సిల్లా సామ్రాజ్యంగా మార్చబడిన తరువాత గొరియో సామ్రాజ్యంగా (918-1392) వరకు పాలించబడింది. తరువాత జోసియన్ సామ్రాజ్యంగా (1392-1910) పరిపాలించబడింది. 1910లో ఇది జపాన్ సామ్రాజ్యంతో చేర్చబడింది. రెండవప్రపంచ యుద్ధానంతరం 1948లో కొరియా సోవియట్ భూభాగం మరియు యు.ఎస్ భూభాగంగా విభజించబడింది. ఐక్యరాజ్యసమితి కొరియా రిపబ్లిక్‌ మాత్రమే చట్టబద్ధమైన దేశం అని ప్రకటించినప్పటికీ సోవియట్ రష్యా ప్రతీకారంగా ఉత్తరకొరియాలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది.

1950లో ఉత్తర కొరియా సేనలు దక్షిణ కొరియాలో ప్రవేశించడంతో కొరియన్ యుద్ధం ఆరంభం అయింది. యు.ఎస్, చైనా, సోవియట్ మరియు ఇతరదేశాల జోక్యంతో మూడు సంవత్సరాల కాలం సాగిన యుద్ధం ముగింపుకు వచ్చింది. ఇరు కొరియా దేశాల నడుమ నిర్మించబడిన కోటలు ప్రపంచంలోనే అత్యధిక బలమైనవని భావించబడుతున్నాయి. తరువాత దశాబ్దాలలో దక్షిణ కొరియా ఆర్ధికంగా గుర్తించతగినంతగా అభివృద్ధి చెందింది. తరువాత దక్షిణ కొరియా ఆర్ధికవ్యవస్థ ప్రపంచలో ప్రధానమైనదిగా మారింది. 1987లో ప్రజాప్రభుత్వం స్థానంలో సైనికపాలన చోటుచేసుకుంది. ప్రస్తుతం దక్షిణ కొరియా తుపాకి నియంత్రిత చట్టాలను అమలు చేస్తుంది. అందువలన దక్షిణ కొరియాలో ప్రజలు అతితక్కువ తుపాకీ అనుమతులను కలిగి ఉన్నారు.

దక్షిణ కొరయాలో అధ్యక్షపాలనా విధానం అనుసరించబడుతుంది. దక్షిణ కొరియా ప్రజల జీవనప్రమాణం అత్యున్నత స్థాయిలో ఉంది. తైవాన్ఆసియాలో ఆసియాలో నాగవస్థానంలో ఉంది. ఆర్ధికంగా తైవాన్ ఆసియాలో నాలుగవ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచన్లో 15 వ స్థానంలో ఉంది. తైవాన్ కొనుగోలుశక్తి ప్రపంచంలో 12 వ స్థానంలో ఉంది. ఎగుమతులు, ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, నౌకలు, యంత్రాలు, పెట్రోలియం రసాయనాలు మరియు రోబోటిక్ ఉత్పత్తులు మరియు ఎగుమతులు ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉన్నాయి.

చరిత్ర

విభజనకు ముందు

కొరియా పురాణాలను అనుసరించి క్రీ.పూ 2333 లో దన్‌గన్‌లు కోసియన్ సామ్రాజ్య స్థపించడంతో కొరియా చరిత్ర ఆరంభం అయిందని తెలుస్తుంది. అయితే కోసియన్‌కు బదులు గోజోసియన్ అనే పదాన్ని వాడుతుంటారు. క్రీ.శ 14 వ శతాబ్ధంలో మరొక సాంరాజ్యం స్థాపించబడడమే ఇందుకు కారణం. వారి భాషలో గో - అంటే పూర్వము, ముందు మరియు పాత అని అర్ధం. గొజోసియన్ సాంరాజ్యం విస్తరిస్తూ ఉత్తర కొరియా ద్వీపకల్పం మరియు మంగోలియన్ సాంరాజ్యంలో కొంత భాగం తనలో కలుపుకున్నది. చైనా హాన్ సాంరాజ్యంతో అనేక పోరాటాలు జరిగిన తరువాత పతనమై వాటి స్థానంలో 3 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించడంతో కొరియా చరిత్ర మొదలైంది.

సామాన్య శకంలో బైయో, డాంగీ మరియు సంహాన్ సమాఖ్య ఈ ద్వీపకల్పం మరియు దక్షిణ మంచూరియాలను ఆక్రమించింది. గోగురియో, బేక్‌జె , మరియు సిల్లా వంటి నినిధ భూభాగాలు ద్వీపకలల్పాన్ని స్వాధీనం చేసుకొని మూడు కొరియన్ రాజ్యాలుగా అభివృద్ధి అయ్యాయి. మూడు రాజ్యాలను సిల్లా సమైఖ్యత తరువాత ద్వీపకల్పం ఉత్తర దక్షిణ భూభాగాల గుర్తించబడింది. కొరియా ద్వీపకల్పం లోని అత్యధిక భాగం సిల్లా ఆధిపత్యంలో ఉండగా బాల్హీ గోగురియో యత్తరభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

సమైఖ్య సిల్లా సాంరాజ్యంలో కవిత్వం మరియు లలితకళలు ప్రోత్సహించబడ్డాయి. ఈ కాలంలో కొరియా మరియు చైనాల మధ్య ప్రశాంతవాతావరణం నెలకొన్నది. అయినప్పటికీ అంతర్గత ఘర్షణ కారణంగా సిల్లా సాంరాజ్యం బలహీనపడింది. సిల్లా సాంరాజ్యం క్రీ.పూ 935 లో గొరియో ఆక్రమణకు గురైంది. ఉతారదిశలో పొరుగున ఉన్న బాల్హే గొగరియో పాలకుడిగా వచ్చాడు.ఆయన పాలనా కాలంలో మంచూరియాలోని అత్యధిక భాగం మరియు సుదూర రష్యా తూపు భూభాగం ఆయన నియంత్రణలో ఉండేది. క్రీ.పూ 926 నాటికి గొగరియా సాంరాజ్యం కైతాన్ దాడొతో పతనం అయింది. 926 లో గొరియో సాంరాజ్యానికి చెందిన చక్రవర్తి టాయిజో ద్వీపకల్పానిని సమైఖ్యపరిచాడు. గొరియోలో ఉన్నత సంస్కృతి వర్ధిల్లింది. క్రీ.శ 1377 నాటికి ప్రపచంలో మొదటి అచ్చుయంత్రం తయారు చేయబడింది. లోహంతో తయారు చేయబడిన ఈ అచ్చుయంత్రం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించగలిగినది. 13వ శతాబ్ధంలో మంగోలియన్లు గొరియో సాంరాజ్యానిని బలహీనపరిచారు. తరువాత 13 సంవత్సరాల నిరంతర వరుస యుద్ధాల తరువాత గొరియా మంగోలియన్ల సామాంతరాజ్యంగా కొరియాద్వీపకల్పంలో పాలన కొనసాగించింది. మంగోలియన్ సాంరాజ్యపతనం తరువాత పలు అంతర్ఘత ఘర్షణల తరువాత జరరల్ యీ సియాంగై తిరుగుబాటు అనంతరం 1392లో జోసియన్ సాంరాజ్యం ఆవిర్భవించింది.

టాయిజో కొరియా ద్వీపకల్పానికి జోసియన్ అని నామకరణం చేసి రాజద్ధానిని హాన్‌సెంగ్ నగరానికి మార్చాడు. తరువాత 200 సంవత్సరాల కాలం జోసియన్ సాంరాజ్యం ప్రశాంతంగా కొనసాగింది. సెజోంగ్ చక్రవర్తి 15వ శతాబ్ధంలో హాంగుల్ లిపిని రూపొందుంచాడు.దేశంలో కంఫ్యూజియనిజం ప్రభావవంతం అయింది. 1592-1598 మధ్య కాలంలో జపాన్ కొరియా మీద దజ్ండయాత్ర చేసింది. టయోటోమీ హైడియోషి నాయకత్వంలో దాడిచేసిన జపాన్ సైన్యాలను చైనాకు చెందిన మింగ్‌శాంగ్ సాంరాజ్య సైనిక దళాల మద్దతుతో కొరియా సైన్యాలు అడ్డగించాయి. జాపాన్ సాగించిన వరుస దాడులు విజయవంతంగా సాగినా చివరకు యుద్ధం నిలిపి శాంతి ఒప్పందం మీద సంతకం చేయవలసిన నిర్బందానికి లోంనైంది. చివరకు చైనాకు చెందిన మింగ్‌శాంగ్ సాంరాజ్యంతో శాతి ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. ఈ యుద్ధంలో అడ్మిరల్ యీ సన్-సిన్ మరియు ప్రఖ్యాత టర్టిల్ షిప్ ఖ్యాతిని వెలిగులోకి తీసుకు వచ్చింది. 1620-1630 జోసియన్ మంచూ దాడులతో బాధపడింది. మంచూరియా వరుస దాడుల అనంతరం జోదియన్ సాంరాజ్యంలో 200 సంవత్సరాలకాల శాంతి కొనసాగింది. యాంగ్జియో మరియు జియాంగ్జో జోసియన్ సాంరాజ్యంలో కొరియన్ శిల్పకళా వైభవం విల్లసిల్లడానికి కృషిచేసారు.


ఏమైనప్పటికీ జోసియన్ సంరాజ్యపు తరువాత కాలం విదేశీవ్యవహారాలు చైనవరకే పరిమితమై మిగిలిన ప్రపంచంతో ఒంటరిగా మిగిలి పోయింది. జోసియన్ సాంరాపు ఈ ఒంటరి తనం జోసొయన్ సాంరాజ్యానికి " హెర్మిట్ కింగ్డం " అనే పేరు తీసుకువచ్చింది. జోసియన్ సాంరాజ్యం చేసిన ప్రయత్నాల కారణంగా పాశ్చాత్యదేశాల సాంరాజ్యవిధానం నుండి జోసియన్‌ను రక్షించినా స్వేచ్చా విఫణి విధానం అవలభించవలసిన వత్తిడి నుండి మాత్రం జోసియన్ సంరాజ్యం తప్పించుకోలేక పోయింది. సినో జపాన్ యుద్ధం, రుస్సో జపాన్ యుద్ధానంతరం జోసియన్ సాంరాజ్యం జపను వశమైది. (1910-1945). రెండవప్రపంచ యుద్ధానంతరం లొంగుబాటు తరువాత జపాన్ జోసియన్ సంరాజ్యాన్ని అమెరికా సోవియట్ లకు స్వాధీనం చేసింది. అప్పటికే ఉత్తర కొరియా సోవియట్ ఆధీనంలోను దక్షిణ కొరియా అమెరికా స్వాధీనంలోను ఉన్నది.

విభజన తరువాత.

1943 లో క్లైరో డిక్లరేషన్ ద్వారా సమైఖ్య కొరియా ఆరంభ ప్రణాళికను వెలుపరచినప్పటికీ సన్యుక్తరాష్ట్రాలు మరియు సోవివియట్ యూనియన్ మధ్య ప్రచ్చన్న యుద్ధం అధికమౌతున్న కారణంగా చివరకు రెండు దేశాల ప్రభుత్వాల స్థాపన చేయవలసిన పరిస్థితి ఎదురైంది. 1948 నాటికి రెండు దేశాలకు వారి వారి ప్రత్యేకగుర్తింపుతో కొరియాలో రెండు రాజకీయ శక్తులు ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాగా ఆవిర్భవించాయి. ఉత్తర కొరియాలో సోవియట్ యూనియన్ మద్దతుతో గత జపానీ వ్యతిరేక గొరిల్లా ఉద్యమకారుడైన కిమ్-ఇల్‌సంగ్ అధికారానికి వచ్చాడు. దక్షిణ కొరియాలో సంయుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఎన్నికలలో కొరియా రిపబ్లిక్ ప్రకటినబడింది. అలాగే దక్షుణ కొరియాలో సింగ్‌మన్ రీ ప్రధమ అధ్యక్షుడిగా ఎన్నికచేయబడ్డాడు. తరువాత డిసెంబర్ మాసంలో ఐఖ్యరాజ్యసమితి సభలో దక్షిణ కొరియా కొరియాలోని ఏకైక చట్టబద్ఫ్హమైన రాజ్యంగా ప్రకటించబడింది. 1950 జూన్ 25 ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద దండయాత్రతో మొదటి ప్రవ్చన్న యుద్ధం అయిన కొరియన్ యుద్ధం ఆరంభం అయింది. ఆసమయంలో సోవియట్ యూనియన్‌ ఐఖ్యరాజ్యసమితిని భహిష్కరించింది. సోవియట్ యూనియన్ ఉత్తరకొరియా సైన్యాలతో కలిసి సమైఖ్య ఉత్తర కొరియా సైన్యం రూపుదిద్దుకున్నది. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ మరియు చైనా మద్దతు ఇచ్చింది. తరువాత ఉత్తర కొరియా సైన్యాలతో మిలియన్ల చైనా సైన్యం ఐఖ్యం అయింది. రెండు వైపులా బ్రహ్మాండ మైన సైనిక బలం చేరిన కారణంగా ఉత్తర మరియు దక్షిణ కొరియాలలోని పౌరులకు యుద్ధంలో తారస్థాయిలో నష్టం వాటిల్లింది. చివరకు యుద్ధం స్థభించి పోయింది. 1953లో రెండు వైపులా సంతకాలు లేకుండా తాత్కాలిక సంధి ఏర్పడింది. ఇరుదేశాల సరిహద్దులలో సైన్యం వెనుకకు తీసుకొనబడినా రెండు దేశాలమధ్య ఉద్రిక్తత మాత్రం అలాగే ఉంది. ఈ యుద్ధంలో దాదాపు 12 లక్షల ప్రాణాలు కోల్పోయారు.

1960 లో విద్యార్ధి ఉద్యమం అధ్యక్షుడు సింగ్‌మన్ రాజీనామాకు దారితీసింది. దేశంలో కొంత కాలం రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. ఈ అస్థిరతతో బలహీనపడిన ప్రభుత్వం అశక్తతను ఆసరాగా తీసుకుని జనరల్ పార్క్ జంగ్- హీ సైనికచర్య తీసుకున్నాడు. తరువాత అధ్యక్షస్థానాన్ని అలంకరించిన పార్క్ 1979 లో హత్యచేబడే వరకు పాలన సాగించాడు. రాజకీయ అణిచివేతలు ఒకవైపు సాగుతున్నా ఎగుమతుల అవకాశాలు దేశం ఆర్ధికరంగాన్ని అభివృద్ధి పధంలో నడిపించింది. జాలిలేని సైనిక్ డైరెక్టరుగా పార్క్ ఈ ఆర్ధిక పరిణామాలను విమర్శింవినా ఆయన పాలనా కాలంలో ఆర్ధికాభివృద్ధి మాత్రం గుర్తించతగినంతగా జరిగింది. ఆయన పాలనా కాలంలో ప్రభుత్వం దేశీయరహదారి ప్రణాళిక, సియోల్ భూగర్భ మార్గం మరియు ఆర్ధికాఅభివృద్ధికి తెరతీయబడింది.

పార్క్ హత్య కారణంగా కొరియాలో తిరిగి రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. రాజకీయ అస్థిరతను తప్పించడానికి ముందుగా అణిచివేతకు గురైన ప్రతిపక్ష నాయకులు అధ్యక్షస్థానాన్ని భర్తీచేయాలని కోరుకున్నారు. 1979 డిసెంబర్ 20న జనరల్ చున్ డూ-హాన్ నాయకత్వంలో ఆక్రమణ జరిగింది. ఆక్రమణ తరువాత చున్ డూ-హాన్ అధికారం స్వాధీనం చేసుకున్నాడు. మే 17 న చున్ డూ-హాన్ దేశమంతా దేశంలో అప్పటివరకు అమలులోలేని మార్షల్ లా అమలుచేయమని మంత్రివర్గం మీద వత్తిడి చేసాడు. మార్షల్ లా సాయంతో విశ్వవిద్యాలయాలను మూసి వేయబడ్డాయి, రాజకీయ కాత్యక్రమాలు నిషేధించబడ్డాయి అలాగే ప్రచారమాధ్యమం నియంత్రించబడింది. చున్ డూ-హాన్ ఆధిపత్యం ఎదిరిస్తూ స్వాతంత్రం కోరుతూ దేశమంతా తిరుగుబాటు చెలరేగింది. ప్రత్యేకంగా గ్వాంగ్‌జూలో ఉద్రికత తీవ్రమైనది. గ్వాంగ్‌జూలో తిరుగుబాటు అణిచివేయడానికి చున్ ప్రత్యేక సైనిక బృందాలను పంపాడు.

చున్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టి 1987 వరకు అధ్యక్షపాలన సాగించాడు. జూన్ 10 న స్వాతంత్రోద్యమంలో సియోల్ విశ్వవిద్యాలయ విద్యార్ధి పార్క్ జంగ్-చుల్ మరణంతో దేశమంతటా స్వాతంత్రోద్యమ మంటలు ఉవ్వేత్తున పైకి లేచాయి. తుదకు ది డెమొక్రటిక్ జస్టిస్ పార్టీ నాయకుడు రో టీ ఊ చేసిన ప్రకటనలో అధ్యక్ష ఎన్నికల ప్రతిపాదన చోటుచేకున్నది. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల ( కిం డీ -జంగ్ మరియు కిం యంగ్ శాం )నడుమ స్వల్ప ఆధిక్యంతో రో విజయం సాధించాడు.

1988 లో సియోల్ వేసవి ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. తరువాత 1996లో దక్షిణ కొరియా ఆ సంస్థ ఎకనమిక్ కో -అపరేషన్ డెవలెప్మెంట్‌ సభ్యదేశంగా మారింది. ఆసియన్ ఆర్ధిక మాంద్యం దక్షిణ కొరియా ఆర్ధికరంగం మీద కొంత ప్రతికూల ఫలితాలను చూపినప్పటికీ దేశం ఆర్ధికాభివృద్ధి నిరంతరంగా కొనసాగింది. 2000 నాటికి అధ్యక్షుడు కిం డీఈ -జంగ్ " సన్ సైన్ పాలసీ " విధానం కారణంగా ఉత్తరకొరియా రాజధాని నగరమైన పియాంగ్‌యంగ్ లో నార్త్- సౌత్ సమ్మిట్ జరిగింది. తరువాత అదే సంవత్సరం కొరియాలో శాంతి స్థాపన మరియు స్వాతంత్ర స్థాపన జరగడానికి కృషిచేసినందుకు నోబుల్ పీస్ ప్రైజ్ (నోబుల్ శాంతి బహుమతి ) అందుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేని ఈ శాంతి ప్రయత్నాలు ప్రజల అంగీకారాన్ని పొందని కారణంగా 2012 అధ్యక్ష ఎన్నికలలో మునుపటి సియోల్ మేయర్ కంసర్వేటివ్ పార్టీ సభ్యుడు పార్క్ గియన్-హే అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

2002 లో దక్షిణ కొరియా మరియు జపాన్ సన్యుక్తంగా ఎఫ్.ఐ.ఎఫ్.ఎ వరల్డ్ కప్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చారు. అయినప్పటికీ లియాన్ కూర్ట్ మీద అధికారం విషయంలో దక్షిణ కొరియా మరియు జపాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. .

విదీశీసంబంధాలు

దక్షిణాసియా 188 దేశాలతో దౌత్యసంబంధాలను కలిగి ఉన్నది. ఉత్తర కొరియాతో సహా 1991 నుండి దక్షిణ కొరియాకు ఐఖ్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్నది. 2007 జనవరి 1 దక్షిణ కొరియా విదేశాంగ మంత్రికి ఐఖ్యరాజ్యసమితి సెక్రటరీ- జనరల్ పదవి లభించవచ్చని విశ్వసించారు. దక్షిణ కొరియా ఆసియన్ దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకొన్నది. ఆసియన్ సమ్మిటులో పాల్గొనడం మరియు ఆసియన్ ప్లస్ త్రీ కి పరిశీలనకు పంపడం వంటి కార్యక్రమాలు ద్వారా సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగమే. 2010లో దక్షిణ కొరియా మరియు యురోపియన్ యూనియన్ స్వేచ్చా విఫణి ఒప్పందం మీద సంతకం చేసాయి. వాణిజ్య సరిహద్దులను తగ్గించడానికి దక్షిణ కొరియా కెనడా మరియు న్యూజిలాండ్‌లతో ఒప్పందం చేసుకున్నది. 2009 లో ఒ.ఇ.సి.డి డెవలెప్మెంట్ అసిస్టెంస్ కమిటీ (ఆపత్సమయ సహాయక దేశాలు) తో చేతులు కలిపింది. దక్షిణ కొరియా జి-20 సమ్మిటుకు ఆతిథ్యం ఇచ్చింది.

యురోపియన్ యూనియన్

చారిత్రకంగా కొరియా చైనాతో సబంధాలను నిలిపివేసింది. దక్షిణ కొరియా రూపుద్దికొనడానికి ముందు జపాన్ ఆక్రమణ సమయంలో కొరియన్ స్వాతంత్ర పోరాటవీరులు చైనా సైనికులతో కలిసి పనిచేసారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా మావోఇజాన్ని ఆదరించిన తరువాత దక్షిణ కొరియా అమెరికాతో సంబంధాలను కోరుతూ చైనాతో సంబంధాలకు ముగింపు పలికింది. పి.ఆర్.సి కొరియన్ యుద్ధసమయంలో ఉత్తరకొరియాకు యుద్ధసామాగ్రి సరఫరా మరియు మానవశక్తి సరఫరా ద్వారా సహకరించింది. తరువాత దక్షిణ కొరియా పి.ఆర్.సి ల మధ్య సబంధాలు పూర్తిగా మూసుకు పోయాయి. 1992 ఆగస్ట్ 24 న దక్షిణ కొరియా మైరియు చైనా దేశాలు తమ మధ్య ఉన్న నౌకా నిషేధం తొలగిస్తూ ఒప్పందం మీద సంతకం చేసాయి. రిపబ్లిక్ ఆఫ్ కొరియా పి.ఆర్.సి సంబంధాలను అభివృద్ధిచేసుకోవడానికి రిపబబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) తో ఉన్న అధికారిక సబంధాలను నిలిపివేసింది. పి.ఆర్.సి తైవాన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.

జపాన్

రెండవప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చే వరకు దక్షిణ కొరియా మరియు జపాన్ మధ్య ఎటువంటి అధికారిక దౌత్యసంబంధాలు లేవు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత 1965లో దక్షిణ కొరియా జపాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) మధ్య దౌత్య సంబంధాలను స్థాపించడానికి జరిగిన ఒప్పందం మీద సంతకం చేసింది. పలు కొరియన్ మరియు జపాన్ వివాదాలు పరిష్కరించకుండా ఉన్నందున కొరియన్ ప్రజలలో జపాన్ వ్యతిరేకత అత్యధికంగా ఉంటూవచ్చాయి. వాటిలో అత్యధికం జపాన్ దురాక్రమణ మరియు పాలనా సమయంలో ఆవిర్భవించాయి. రెండవప్రపంచ యుద్ధం సమయంలో 1,00,000 మంది కొరియన్లు జపాన్ వత్తిడితో బలవంతంగా జపాన్ సాంరాజ్య సైన్యంలో పనిచేయవలసి వచ్చింది. కంఫర్ట్ వుమన్ పేరుతో కొరియన్ స్త్రీలు జపాన్ సైన్యానికి బానిసలుగా సేవలు చేయవలసిన పరిస్థితి ఎదురైంది.

జపానీయుల యుద్ధనేరాల వలన బాధించబడిన కొరియన్లు యుద్ధంలో మరణించిన యుద్ధవీరులను గౌరవించడానికి జపాన్ రాజకీయ నాయకులు కొరియాకు వచ్చిపోవడం అసహనానికి గురిచేసింది. రెండవప్రపంచ యుద్ధంలో జపానీయుల చర్యలను గురించిన విషయాలను అదనంగా చేర్చి జపానీ పాఠ్యపుస్తకాలు తిరగ వ్రాయబడడం మరియు లియాన్ కోర్ట్ రాక్స్ భూవివాదాలు (జపాన్ అధికారిక నామం టకేషిమా మరియు కొరియన్ అధికారిక నామం డొకోటో ) కొరియన్ మరియు జపాన్ సంబంధాలను సమస్యాత్మకం చేసాయి. చివరికి టకేషిమా/డొకోటో భూభాగం మీద హక్కులు రెండుదేశాలకు ఇవ్వబడ్డాయి. చిన్న ద్వీపలు కొరియా స్వాధీనంలోకి వచ్చాయి. కొరియా వాటిని సరిహద్దు రక్షణకు వినియోగించింది. ఫలితంగ జపాన్ ప్రధానమంత్రి జునిచిరో కియోజుమీ యాసుకునీకి పలుమార్లు విజయం చేసాడు. గత అధ్యక్షుడైన రాహ్ మూ-హైన్ దక్షిణ కొరియా మరియు జపాన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసాడు.

ఉత్తర కొరియా

ఉత్తర మరియు దక్షిణ కొరియాలు రెండు మొత్తం ద్వీపకల్పం మరియు పరిసర ద్వీపాలమీద అధికారికంగా సార్వభౌమాధికారం సాధించాయి. ఇరు దేశాలమధ్య రగులుకున్న విద్వేషాలు చివరకు 1950-1953 వరకు సాగిన కొరియన్ యుద్ధానికి దారితీసింది. తరువాత దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాలు యుద్ధవిరమణ ఒప్పందం మీద సంతకం చేసాయి. 207 అక్టోబర్ 4న రోహ్ మూ-హుయన్ మరియు ఉత్తర కొరియన్ నాయకుడు జాంగ్-ఇల్ ఎనిమిది ముఖ్యాంశాలు కలిగిన శాశ్వత శాంతి ఒప్పందం, ఉన్నత స్థాయి చర్చలు, పరస్పర ఆర్ధిక సహకారం వాయు, రహదారి మార్గాల పునరుద్ధరణ మరియు సమైఖ్య ఒలింపిక్ చీరింగ్ స్క్వాడ్ రూపొందించడం మీద సంతకం చేసారు.

1993,1998, 2006 మరియు 2009 లలో ఉత్తర కొరియన్ ప్రభుత్వం చేసిన మిస్సైల్ పరిశోధన కారణంగా రాజీ ప్రయత్నాలు సందిగ్ధంలో పడ్డాయి. 2009లో దక్షిణ మరియు ఉత్తర కొరియాల మధ్య సంబంధాలలో ఘర్షణలు తలెత్తాయి. మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేయమని ఉత్తర కొరియాను కోరారు. ఈ సంఘర్షణలు చివరికి మునుపటి ఒప్పందాలు ఉత్తరకొరియాను దక్షిణకొరియాతో చేసిన ఒప్పందాలకు ముగింపు పలికి తమ ఉపగ్రహ స్థాపనలో దక్షిణ కొరియా మరియు అమెరికాలు జోక్యం చేసుకోకుండా బెదిరించింది. . ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా ఇప్పటికీ సాంకేతిక యుద్ధం కొనసాగిస్తున్నది. కొరియన్ యుద్ధం తరువాత ఇరు దేశాల మీద తిరిగి శాంతి ఒప్పందాలు జరగనే లేదు. ఇరుదేశాలు తమ మధ్య ఉన్న ప్రపంచంలో అత్యంత బలమైన సరిహద్దులలు సంరక్షిస్తూ ఉన్నాయి. 2009 మే 27న ఉత్తర కొరియా ప్రచార మాద్యమం ద్వారా ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధవిరమణ ఒప్పందానికి కాలం చెల్లినదని దేశరక్షణ కొరకు అణుఆధాల సేకరణ తప్పనిసరి అని ప్రకటించింది. 2010 మార్చి మాసంలో దక్షిణ కొరియా యుద్ధనౌక చియోనాన్ మునిగిపోవడం ఇరు దేశాల మధ్య ఘర్షణను మరింత క్లిష్టతరం చేసింది. ఈ సంఘటనకు కారణం ఉత్తరకొరియా అని ఖచ్చితంగా చెప్పింది ఉత్తర కొరియా దానిని నిరాకరించింది. 2010 మే మాసంలో దక్షిణ కొరియా ఆధ్యక్షుడు మియాంగ్-బ్యాక్ ఉత్తరకొరియాతో ఉన్న వాణిజ్య సంబంధాలను సియోల్ రద్దుచేస్తుందని ప్రకటించాడు. సమిష్ఠి కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళిక మరియు మానవీయ సహాయం విడిచి మిగిలిన ఆర్ధిక మరియు దౌత్య సంబంధాలు వెనుకకు తీసుకొనబడ్డాయి. ఉత్తర కొరియా కూడా ముందుగానే దక్షిణ కొరియాతో ముందున్న అన్ని ఒడంబడికలను రద్దుచేస్తామని అలాగే కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళికలో పని చేస్తున్న దక్షిణ కొరియన్లని తరిమివేస్తామన్న బెదిరింపులను వెనుకకు తీసుకుని దక్షిణ కొరియాతో ముందున్న ఒప్పందాలను కొనసాగించింది. అయినప్పటికీ ఇరుదేశాల నడుమ నెలకొన్న సైనిక చర్యల ఫలితంగా కియోసాంగ్ పారిశ్రామిక ప్రణాళిక భూభాగంలో పెట్టుబడులు మరియు శ్రామికశక్తి క్షీణిస్తూ వచ్చింది. ఇజ్రాయేలు దేశంలోలా దక్షిణ కొరియన్లు పొరుగు దేశాల దాడి నుండి రక్షించుకోవడానికి గ్యాసుమాస్కులను మాత్రం ఏర్పాటు చేసుకో లేదు.

  • 2009 నవంబర్‌లో దక్షిణ కొరియా జరిపిన కాల్పుల కారణంగా గస్తీ చేస్తున్న ఉత్తరకొరియా యుద్ధనౌక అగ్నికి ఆహుతి అయింది.
  • 2010 మార్చ్ 26 న దక్షిణకొరియా యుద్ధనౌక చియోనాన్ సముద్రంలో మునిగిన సమయంలో 40 మంది నావికులు మరణించారు.
  • 2010 మే 20 న ఉత్తరకొరియా తమ యుద్ధనౌకను ముంచిందని ప్యానెల్ నిందించింది. పియాంగ్‌యాంగ్ వాటిని నిరాకరించింది.
  • 2010 జూలై-సెప్టెంబర్ దక్షిణ కొరియా మరియు యు.ఎస్ సన్యుక్తంగా సైనికవున్యాసం వంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాయి. యు.ఎస్ దక్షిణ కొరియాకు సహాయం అధికం చేసింది.
  • 2010 సెప్టెంబర్ 29న ఉత్తరకొరియా తండ్రిని అనుసరించి కుమారుడు అధికారం చేపట్టిన సంఘటనను ఘనంగా నిర్వహించింది.
  • 2010 అక్టోబర్ ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దుల వద్ద దక్షిణ కొరియా మరియు ఉత్తరకొరియాల మధ్య కాల్పులు జరిగాయి.

సంయుక్త రాష్ట్రాలు

రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ వలసరాజ్యం నుండి విడుదల కావడానికి దక్షిణకొరియాకు అమెరికా అలాగే ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ప్రోత్సాహమిచ్చాయి. మూడు సంవత్సరాల అమెరికా పాలన తరువాత దక్షిణకొరియా ప్రభుత్వస్థాపన జరిగింది. కొరియన్ యుద్ధం ఆరంభం కాగానే అమెరికన్ సైన్యాలు దక్షిణ కొరియాకు మద్దతుగా సైన్యాలను పంపింది. అమెరికా దక్షిణకొరియాకు ఉత్తర కొరియా దండెత్తిన సమయంలోనూ మరియు తరువాత చైనా దండయాత్రలోనూ సైన్యాల మద్దతు ఇచ్చింది. తరువాత అమెరికా దక్షిణ కొరియాలు పరస్పర సైనికమద్దతు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అనుసరించి యుద్ఫ్హవాతావరణం ఏర్పడితే రెండుదేశాలు ఒకటిగా స్పందించాలన్న నిబంధన చోటుచేసుకున్నది. ఈ ఒప్పందానికి కట్టుబడి 1967లో వియత్నాం యుద్ధసమయంలో అమెరికాకు మద్దతుగా దక్షిణకొరియా సైన్యం పంపింది. ది యు.ఎస్ ఎయిత్ ఆర్మీ, యు.ఎస్ ఎయిర్ ఫోర్స్ మరియు యు.ఎస్ నావల్ ట్రీటీ ఆఫ్ కొరియా దక్షిణ కొరియాలో నిలుపబడ్డాయి. ఉత్తరకొరియా పట్ల అనుసరిస్తున్న విధానాల విషయంలోనూ మరియు న్యూక్లియర్, రాకెట్ తయారీ పరిశ్రమల స్థాపన విషయంలోనూ ఇరు దేశాల విబేధాలు ఉన్నప్పటికీ రెండుదేశాల నడుమ ఆర్ధిక, దౌత్య మరియు సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయి. గతంలో దేశంలో అమెరికన్ వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రస్థుతకాలంలో అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2007 లో రిపబ్లిక్ కొరియా-యునైటెడ్ స్టేట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఇరుదేశాలు సంతకం చేసాయి. అయినప్పటికీ అది అమలుచేయడంలో తిరిగి తిరిగి జాప్యం జరిగింది. రెండు దేశాల చట్టసభలలో ఈ తీర్మానం అంగీకారం లభించకపోవడమే ఇందుకు కారణం. 2011 అక్టోబర్ 12 న అమెరికన్ చట్టసభలో ఈ ఒప్పందం అంగీకరించబడిన తరువాత మార్చ్ 15 నుండి ఈ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది.

రక్షణదళం

దక్షిణకొరియా చారిత్రకంగా దీర్ఘకాల దండయాత్రలు మరియు ఉత్తరకొరియా పరిష్కరించబడని వివాదాల కారణంగా దేశం జి.డి.పిలో 2.6% రక్షణవ్యవస్థ కొరకు వ్యయం చేయబడుతుంది. ప్రభుత్వధనంలో 15% (జి.డి.పిలో ప్రభుత్వ భాగం 14.967% ) రక్షణవ్యవస్థ కొరకు ఖర్చుచేయబడుతుంది. నిర్భంధ సైనిక శిక్షణ కారనంగా 6.50,000 సభ్యులు కలిగిన దక్షుణకొరియా కార్యశీలక సైనిక దళం ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. అలాగే 32,00,000 సభ్యులున్న దక్షిణ కొరియా రిజర్వ్ సైనిక దళం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా రక్షణ వ్యవస్థ ప్రణాళిక ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ది రిపబ్లిక్ కొరియా రెగ్యులర్ మరియు రిజర్వ్ సైనిక దళం సంఖ్య 37,00,000. కొరియా మొత్తం జనసంఖ్య 5 కోట్లు. కొరియా సరాసరి సైనికదళసంఖ్య ద్వితీయ స్థానంలో ఉంది. దిడెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాది ప్రధమస్థానం.

దక్షిణకొరియా కాల్బలం (ఆర్.ఒ.కె.సి,), నావికదళం (ఆర్.ఒ.కె.ఎన్), వాయుసేన (ఆర్.ఒ.కె.ఎం.సి) మరియు రిజర్వ్ దళాలు కలిసి కొరియన్ సైనిక భూభాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. దక్షిణ కొరియన్ పురుషులందరూ 21 మాసాల నిర్బంధ సైనికసేవ చేయాలని కోరబడతారు. ముందు మిశ్రిత కొరియన్ జాతివారికి నిర్బంధ సైనికసేవ చేయాలన్న నియమం నుండి మినహాయింపు ఉన్నప్పటికీ 2011 నుండి అది రద్దు చేయబడింది.

అదనంగా ఒక సంవత్సరానికి దక్షిణకొరియా సైన్యంలో 21 మాసాల నిర్బంధ సైనిక సేవలకు నియమించబడుతున్నారు. అమెరికా అందిస్తున్న ప్రణాళికా సాయంతో దక్షిణ కొరియాలో ఉన్న అమెరికన్ దళాలకు దక్షిణ కొరియా ఖర్చుచేస్తున్న ధనం 1.68 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. తన స్వంత సైనికవ్యవస్థకు దక్షిణ కొరియా ఖర్చు చేస్తున్న ధనం 29.6 ట్రిలియన్లు. అమెరికన్ సైన్యాలకు సహకరించడానికి దక్షిణ కొరొయా సైనికదళాలను అవసరమైనప్పుడంతా పంపుతూ ఉంటుంది. అమెరికా సబంధం ఉన్న 50 యుద్ధాలకు దక్షిణకొరియా అమెరికతో చేరి యుద్ధంలో పాల్గొన్నది. అమెరికా సబంధిత యుద్ధాలలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా, ఫిలిప్పైంస్, న్యూజిలాండ్ మరియు దక్షిణవియత్నాం సైనికదళాతో చేర్చి దక్షిణకొరియా 3,25,517 సైనిక దళాలను పపింది. 2004లో వియత్నాం యుద్ధంలో పాల్గొనడానికి దక్షిణవియత్నాం సైనిక దళాలకు సహాయంగా 50,000 మంది సైనికులను పపింది. 2004లో ఇరాక్ యుద్ధం తరువాత ఉత్తర ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాల కొరకు సంకీర్ణ సైనికదళాలతో పనిచేయడానికి కొరియన్ సహాయక బృందాలు పంపబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా మరియు బ్రిటన్ తరువాత అధికసంఖ్యలో పాల్గొన్నది కొరియన్ బృందాలే. ఐఖ్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలకు సహకరించడానికి మరియు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి దక్షిణ కొరియా 2001లో మిడిల్ ఈస్ట్‌కు 24,000 మందిని, 2007లో లెబనాన్‌కు 1,800 మందిని పంపింది.


దక్షిణ కొరియా రక్షణకొరకు అమెరికా గుర్తించతనంత సైనికదళాలను దక్షిణకొరియాకు పంపింది. అకెరికా దక్షిణకొరియాకు దాదాపు 28,500 మంది సైనికోద్యోగులను పంపింది. వారిలో చాలామంది ఒక సంవత్సరం ఉద్యోగపర్యటనకు ఒంటరిగా పింపబడుతుంటారు. ప్రధానంగా అమెరికన్ కాల్బలం మరియు వాయుసేన ఎయిత్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ & సెవెంత్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ది యు.ఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వారిని యు.ఎస్ ఫోర్సెస్ కొరియాకు పంపబడుతుంటారు.

భౌగోళికం, పరిసరాలు మరియు వాతావరణం

భౌగోళికం

కొరియాద్వీపకల్పంలో దక్షిణభాగంలో దక్షిణకొరియా ఉపస్థితమై ఉంది. ఆసియా ప్రధానభూభాగానికి దక్షిణకొరియా 1,100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతాలతో నిండిన ఈ ద్వీపకల్పం పడమరదిశలో ఎల్లో సీ మరియు జపాన్ (తూర్పు) సముద్రం ఉన్నాయి. దక్షిణ దిశలో కొరియా స్ట్రెయిట్ తూర్పున చైనా సముద్రం ఉన్నాయి. దక్షిణ కొరియా మొత్తం వైశాల్యం 1,00,032 చదరపుకిలోమీటర్లు.

దక్షిణ కొరియా నాలుగు ప్రధాన భూభాగాలుగ విభజించబడి ఉంటుంది. తూర్పుదిశలో ఉన్నతమైన పర్వతాలు ఇరుకైన మైదానాలు ఉన్నాయి. పడమరదిశలో విశాలమైన సముద్రతీర మైదానాలు,రోలింగ్ హిల్స్ మరియు నదీముఖద్వారాలు ఉన్నాయి. ఆగ్నేయదిశలో పర్వతాలు మరియు లోయలు ఉన్నాయి. దక్షిణదిశలో నెక్డాంగ్ నది యొక్క విశాలమైన ముఖద్వారం ఉంది. దక్షిణకొరియా భూభాగం వ్యవసాయానికి సహకరించని పర్వతాలతో నిండి ఉంటుంది. దేశాంలో సాధారణ సమతల భూమి మొత్తం 30% మాత్రమే ఉంటుంది. అతి చిన్నవి మరియు నిర్జనమైనవి అయిన దాదాపు 3,000 దీవులు ఉన్నాయి. దక్షిణకొరియాకు 100 కిలోమీటర్లదూరంలో జెయూ-డి దీవి ఉన్నది. 1,845 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన జెయూ-డి దేశంలోని అతిపెద్ద దీవి. అలాగే జెయూ-డి దీవి దేశంలో అత్యంత ఎత్తైనది. విశాలమైన హల్లాసన్ అగ్నిపర్వతం ఎత్తు 1,950 మీటర్లు. తూర్పున చివరిగా ఉన్న దీవి ఉలెంగ్డో మరియు లియాన్‌కోర్ట్ రాక్స్ ఉన్నాయి. దక్షిణ దిశ చివరిలో మారాడో మరియు సొకోటా రాక్స్ ఉన్నాయి. దక్షిణకొరియాలో 20 కి పైగా జాతీయ ఉద్యానవనాలు మరియు ప్రకృతిసహజ ప్రదేశాలు ఉన్నాయి.

వాతావరణం

దక్షిణకొరియా ఆర్ధ్ర ఖండాంతర శీతోష్ణస్థితి మరియు ఆర్ధ్ర ఉష్ణమండల శీతోష్ణస్థితి కలిగి ఉంటుంది. దక్షిణకొరియాలో తూర్పాసియా వర్షపాతకాలానుగుణంగా వేసవికాలంలో అధికవర్షపాతం ఉంటుంది. ఈ వర్షపాతం జూన్మాసంలో ఆరంభమై జూలై మాసానికి వరకు కొనసాగుతుంది. అత్యంత శీతలంగా ఉండే చలికాలంలో లోతట్టు ప్రాంతంలో ఉష్ణోగ్రత -20 ° సెంటీగ్రేలుంటుంది. సియోల్ నగరంలో -7 నుండి 1 ° సెంటీగ్రేలుంటుంది. ఆగస్ట్ మాస సరాసరి ఉష్ణోగ్రత 22-30 ° సెంటీగ్రేలుంటుంది. దక్షిణ తీరంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి పర్వతప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దేశంలో అధిక భూభాగంలో వేసవి ఉష్ణోగ్రతలు ఆర్ధత కలిగిన వేడిమితో 30° సెంటీగ్రేలుంటుంది. దక్షిణకొరియా శీతోష్ణస్థితి నాలుగు వైవిధ్యతలను కలిగి ఉంటుంది. వసంతం, వేసవి, ఆకురాలుకాలం మరియు శీతాకాలం. మార్చి నుండి మే ఆరంభంలో చివరలో వసంతం మొదలౌతుంది, మే మధ్య నుండి సెప్టెంబర్ ఆరంభం వరకు మాసనంలో వేసవి మొదలౌతుంది, సెప్టెంబర్ మద్య నుండి నవంబర్ ఆరంభం వరకు ఆకురాలు కాలం ఉంటుంది మరియు శీతాకాలం నవంబర్ మద్య నుండి మార్చ్ వరకు ఉంటుంది. వేసవిలో ఆరంభమయ్యే వర్షాలు సెప్టెంబర్ వరకు కొనసాగుతాయి.సియోలులో సరాసరి వర్షపాతం 1,370 మిల్లీమీటర్లు ఉంటుంది. బ్యూసన్ వర్షపాతం 1,470 ఉంటుంది. అప్పుడప్పుడూ వచ్చే తుఫానులు ఈదురుగాలులు వరదలకు కారణం ఔతుంటాయి.

పర్యావరణం

దక్షిణకొరియా అభువృద్ధి ప్రారంభమైన మొదటి 20 సంవత్సరాల కాలంలో పర్యావరణ పరిరక్షణకొరకు స్వల్పంగా ప్రయత్నాలు చేయబడ్డాయి. అనియంత్రిత పారిశ్రామికాభివృద్ధి మరియు నగరాభివృద్ధి కారణంగా అడవుల నరికివేత మరియు సాంగ్డో టైడల్ ఫ్లాట్ వంటి చిత్తడినేలల నశింపజేయడం వంటి చర్యలు అనివార్యం అయ్యాయి. అయినప్పటికీ ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం 84 వందల కోట్ల ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం విద్యుచ్చక్తి ఉత్పత్తి మరియు పచ్చదనం అభివృద్ధి.

దక్షిణకొరియా మొత్తం జి.డి.పి లో 2% తో రూపొందించిన ఈ పచ్చదనం ఆధారిత ఆర్ధికవ్యూహం దక్షిణకొతియా ఆర్ధికరంగంలో సమగ్రమైన మార్పులు రావడానికి కారణం అయింది. పచ్చదనం పెంపొందించే ప్రయత్నాలలో దేశం అంతటా ద్విచక్రవాహనాల వాడకం అధికం చేయడం, సూర్య అరియు పవన శక్తిని వాడుకోవడం, చమురుతో నడిచే వాహనాల వాడకం తగ్గించడం, సూర్యరస్మి వాడకాన్ని ప్రోత్సహించడం మరియు పర్యావరణ అనుకూలిత సాంకేతికత వాడకం అధికరించడం వంటి ప్రయత్నాలు చేపట్టారు. విద్యచ్చక్తి వాడకం తగ్గించడానికి దేశంలో ఇప్పటికే అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బ్రాడ్ బాండ్ సేవలకంటే 10 రెట్లు వేగవంతమైన అంతర్జాల సేవలందించడానికి దేశం ఇప్పటికే సిద్ధంగా ఉన్నది.

ప్రస్థుతం సియోలులో కుళాయిలద్వారా లభ్యమౌతున్న శుద్ధజలాలు త్రాగడానికి సురక్షితమైనవిగా భావిస్తున్నారు. నగరాఫ్హికారులు " అరిసు" అనే పేరుతో ఒప్పందదారులద్వారా ఈ ప్రణాళికను అమలుచేసి నగరవాసుల త్రాగునీటి అవసరాలను తీర్చి తృప్తిపరుస్తున్నారు. అరణ్యాలను అభివృద్ధిచేసే ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. మరొక పలుకోట్ల విలువచేసే ప్రణాళిక " చియాంగియోచియాన్ " పునరుద్ధరణ. సియోల్ నగరకేంద్రం (డౌన్ టౌన్) గుండా ప్రవహించే ఈ పిల్లకాలువ గతలో మోటర్ యంత్రాలద్వారా అతిగా జలవినియోగం చేయడం ఎండిపోయింది. మరొక ప్రధాన సవాలు వాయుకాలుష్యం, ఆమ్ల వర్షాలు, సల్ఫర్ ఆక్సైడ్స్ మరియు సంవత్సర పసుపు దుమ్ము తుఫానులను ఎదుర్కొనడం. ప్రధాన వాయుకాలుష్యానికి కారణమైన చైనాకు సమీపంలో దక్షిఅకొరియా ఉండడమే ఇందుకు కారణం.

దక్షిణకొరియా అంటార్కిటికా -ఎంవిరాన్మెంటల్ ప్రొటోకాల్, అట్లాంటిక్ ట్రీటీ, బయోడైవర్సిటీ ట్రీటీ, కియోటో ప్రొటోకాల్ డిసర్టిఫికేస్గన్, ఎండేంజర్ స్పెసీస్, ఎంవిరాన్మెంటల్ మోడిఫికేషన్, హజార్డస్ వేస్ట్స్, లా ఆఫ్ ది సీ, మేరిన్ డంపింగ్, కాంంఫరెంసివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, షిప్ పొల్యూషన్, ట్రాపికల్ టింబర్ 83, ట్రాపికల్ టింబర్ 94, వెట్ లాండ్స్ అండ్ వేలింగ్ లలో సభ్యత్వం కలిగి ఉన్నది.

ఆర్ధికరంగం

దక్షిణ కొరియా వాణిజ్య ఆధారిత ఆర్ధికకరంగం జి.డిపి పరంగా ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. అలాగే కొనుగోలుశక్తి 12వ స్థానంలో ఉంది. అలగే దక్షిణ కొరియా ఆర్ధికరంగం జి-20 అంతర్జాతీయంగా ఆర్ధికరంగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒ.ఇ.సి.ఇడి సభ్యత్వం ఉన్న దక్షిణకొరియా ఉన్నత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. అధికంగా పరిశ్రలున్న దేశాలలో దక్షిణకొరియా ఒకటి. అభివృద్ధి చెందిన 12 దేశాలలో దక్షిణకొరియాది ప్రధమ స్థానం అయితే మిగిలిన 11 దేశాలు దక్షిణకొరియా స్థాయికి దూరంగానే ఉన్నాయి. 1960 నుండి 1990 మద్యకాలంలో వేగవంతంగా అభివృద్ధిచెందిన దేశాలలో దక్షిణ కొరియా ఒకటి. 2000 నుండి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిన దేశాలైన హాంకాంగ్, సింగపూర్ మరియు తైవానులతో కలిసి దక్షిణకొరియా కుడా గుర్తింపు పొందింది. ఈ నాలుగు దేశాలు ఆర్ధికపరంగా ఆసియన్ టైగర్లుగా గుర్తింపు పొందాయి. ఈ అభివృద్ధిని దక్షిణకొరియా హాన్ నది అద్భుతంగా వర్ణిస్తుంది. దక్షిణకొరియా ఆర్ధికకరంగం అంతర్జాతీయ వాణిజ్యం మీద అధికంగా ఆధారపడుతూ ఉంది. 2010లో అసియాలో అధికంగా ఎగుమతి చేసిన దేశాలలో దక్షిణ కొరియా 6వ స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉంది.

2010లో దక్షిణకొరియా రాజధాని నగరంలో జి.20 సమావేశాలకు దక్షిణకొరియా ఆతిథ్యం ఇచ్చింది. రెండురోజుల సమావేశాలు తమ ఆర్ధికరంగాన్ని 31 ట్రిలియన్లకు తీసుకు పోగలదని సగర్వంగా చెప్పుకున్నారు. ఆర్ధిక ప్రయోజనాలతో సహా దేశంలో 1,60,000 ఉద్యోగాలను ఉత్పత్తి చేయగదన విశ్వసించారు. అలాగే దేశం సావరిన్ క్రెడిట్ కూడా అభివృద్ధి ఔతుందని అనుకున్నారు. ఒక వైపు దక్షిణ కొరియా ఆర్ధికరంగ అభివృద్ధి నిర్మాణాత్మకంగా స్థిరంగా ఉంది. ఉత్తరకొరియాతో ఉన్న వివాదాలు సైనిక సంక్షోభం కారణంగా దక్షిణ కొరియా ఫైనాంషియల్ మర్కెట్ మీద వ్యతిరేక ప్రభావం చూపెట్టింది. దక్షిణ కొరియా ఆర్ధికరంగం అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం సమయలో నిలదొక్కుకున్నదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలలో దక్షిణకొరియా ఒకటి. 2010లో దక్షిణకొరియా అభివృద్ధి శాతం 6.2%. 2008లో ఆర్ధికాభివృద్ధి 2.3. 2009 ఆర్ధిక సంక్షోభ కాలంలో ఆర్ధికాభివృద్ది 0.2%. 2009 నుండి దక్షిణకొరియా నిరుద్యోగ శాతం 3.6% గా ఉంటూ వస్తుంది.

రవాణా మరియు విద్యుత్చ్చక్తి

దక్షిణకొరియాలో అత్యాధునిక రైలు సౌకర్యాలు ఉన్నాయి. అతివేగ రైళ్ళు, రహదారులు, బస్ మార్గాలు మరియు వాయు మార్గాలున్నాయి. కొరియా ఎక్స్‌ప్రెస్‌వే కార్పొరేషన్ టోల్ రహదారులు మరియు మార్గమద్యంలో అవసర సేవలు అనిదింస్తుంది. కొరియా ప్రధాన నగరాలలో కోరెల్ రైలు సర్వీసులు ఒకదానివెంట ఒకటిగా లభిస్తున్నాయి. దేశంలో జియోంగూ మరియు డాంఘీ అనే రెండు మార్గాలు ఉన్నాయి. ఉత్తరకొరియాతో రవాణాసౌకర్యాలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. ది కొరియన్ హైస్పీడ్ రైలు సిస్టం, కెటి.ఎక్స్ జియాంగూ మరియు హోనం లైన్ హైస్పీడ్ సర్వీసులను అందిస్తున్నాయి. ప్రధాననగరాలైన సియోల్, బూసన్, ఇంచియాన్, డీగూ, డీజియాన్ మరియు గ్వాంగ్జూ అనేవి నగర అతివేగ రైలు సర్వీసులు. పలు నగరాలలో అతివేగ బసు సర్వీసులు లభిస్తున్నాయి. దక్షిణకొరియాలోని పెద్దదైన విమానాశ్రయం ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2001లో నిర్మాణాన్ని పూర్తిచేసుకున్నాయి. 2007 నాటికి ఇక్కడ నుండి 3 కోట్ల మంది ప్రయాణించారు. ఇతర విమానాశ్రయాలు వరుసగా జింపో, బూసన్ మరియు జియూ. దేశంలో 7 దేశీయ విమానాశ్రయాలు మరియు పెద్ద సంఖ్యలో హెలికాఫ్టర్లు ఉన్నాయి.

1962 లో స్థాపించబడిన కొరియన్ విమానాశ్రయాలు2008 లో 2,16,40,000 మంది ప్రయాణీకులకు సేవలందించింది. 2008లో స్థాపించబడిన ఎ సెకండ్ కారియర్, ఏసియన్ ఎయిర్‌లైంస్ దేశీయ మరియు విదేశీ సర్వీసులను అందిస్తున్నాయి. దక్షిణకొరియా విమానాశ్రయాలు 297 అంతర్జాతీయ మార్గాలలో ప్రయాణ సౌకర్యాలు అందిస్తున్నాయి. జెయూ వంటి చిన్న విమానాశ్రయాలు తక్కువ చార్జీలతో దేశీయ సర్వీసులు అందిస్తున్నాయి. .

అణువిద్యుత్ ఉత్పత్తిలో దక్షిణకొరియా ప్రపంనచలో 5 వస్త్గానంలో ఉంది. అలాగే 2010 లో ఆసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. దేశంలోని విద్యుత్తులో 45% అణువిద్యుత్తు నుండి లభిస్తుంది. అలాగే ఆధునిక పరిశోధనలు నిర్వహిస్తుంది. స్మాల్ మోడ్యులర్ రియాక్టర్, ఎ లిక్విడ్-మెటల్ ఫాస్ట్/ట్రాంస్మ్యుటేసన్ రియాక్టర్ మరియు ఎ హైటెంపరేచర్ హైడ్రోజన్ జనరేషన్ డిజైన్ వంటి రియాక్టర్ల తయారీ చేయబడుతున్నాయి. ఇంధన ఉత్పత్తి మరియు చెత్త నిర్వహణ వంటివి అభివృద్ధి చెందాయి. దక్షిణకొరియా ఐ.టి.ఇ.ఆర్ సభ్యత్వం కలిగిఉంది. దక్షిణకొరియా న్యూక్లియర్ రియాక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అలాగే యు.ఎ.ఇతో న్యూక్లియర్ నాలుగు అత్యాఫ్హునిక రియాక్టర్ల నిర్మాణం మరియు నిర్వహణ ఒప్పందం చేసుకున్నది. జోర్డానుతో న్యూక్లియర్ రియాక్టర్ పరిశోధన ఒపాందం చేసుకున్నది. అర్జెంటీనాతో హెవీ వాటర్ న్యుక్లియర్ నిర్మాణం బాగుచేయడం ఒప్పందం చేసుకున్నది. 2010 లో దక్షిణకొరియా మరియు టర్కీ రెండు న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణానికి చర్చలు జరుపుతున్నది. దక్షిణకొరియా అర్జెంటీనా కొరకు లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది.

తనతానుగా యురేనియం నిల్వచేసుకోవడానికి లేక సాంప్రదాయకంగా యురేనియం ఉత్పత్తి చేయగల సాంకేతికాభివృద్ధి చేసుకోవడానికి దక్షిణకొరియా అనుమతించబడలేదు. యు.ఎస్ రాజకీయ వాత్తిడే ఇందుకు కారణం. న్యూక్లియర్ జనరేటిన్ టెక్నాలజీ మరియు రియాక్టర్ల ఉత్పత్తిలో దక్షిణకొరియా విజయం సాధించింది.

సైన్యం

మూలాలు

మూస:Link FA