పార్లమెంటు సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
*భారత పౌరుడై ఉండాలి.
*భారత పౌరుడై ఉండాలి.
*25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
*25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవులలో ఉండరాదు.
*పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

12:33, 1 జూలై 2013 నాటి కూర్పు

పార్లమెంటుకు ఎన్నుకోబడిన సభ్యుడిని పార్లమెంటు సభ్యుడు అంటారు. పార్లమెంట్ సభ్యుడిని ఆంగ్లంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ సభ్యుడిని సంక్షిప్తంగా ఎంపి అంటారు. అనేక దేశాలలో పార్లమెంట్ ద్విసభలను కలిగి ఉంటుంది, వీటిని దిగువ సభ, ఎగువ సభ అంటారు, కొన్ని దేశాలలో ఎగువ సభను సెనేట్ అని, అలాగే సభ్యులను సెనేటర్స్ అంటారు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ బృందాలుగా ఉంటారు (పార్లమెంటరీ పార్టీలు అని కూడా అంటారు). వీరు ఏ రాజకీయపార్టీ తరపున ఎన్నుకోబడ్డారో అదే పార్టీతో ఉంటారు.

భారతదేశం

భారతదేశంలో దిగువసభను ప్రజాసభ లేక లోక్ సభ అంటారు. లోక్ సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ఎన్నికోబడినవారు.

ఎగువసభను రాజ్యసభ అంటారు. రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు నేరుగా ప్రజలచే కాక పరోక్షంగా ఎన్నుకోబడతారు.

లోక్ సభ

లోక్‌సభ ప్రజాప్రతినిధుల సభ. వయోజన ఓటింగు పద్ధతిపై ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీరిని ఎన్నుకుంటారు. ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి లోక్ సభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. లోక్ సభ సభ్యుల సంఖ్య 550 కి మించరాదు. ప్రస్తుతం లోక్ సభ స్థానాల సంఖ్య 545. వీరిలో 530 మంది సభ్యులు 28 రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడగా 13 మంది 7 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపిక చేయబడతారు. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం లభించనిచో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు.

లోక్ సభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి:

  • భారత పౌరుడై ఉండాలి.
  • 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవులలో ఉండరాదు.
  • పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు