"ప్రేమకథా చిత్రమ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
కథ జతచేయబడింది
(ముఖ్యసవరణలు చేసాను)
(కథ జతచేయబడింది)
| image = Prema Katha Chitram poster.jpg
| writer = మారుతి
| starring = [[m:en:Sudheer Babu|సుధీర్ బాబు]]<br>[[నందిత]]<br>ప్రదీప్<br>గిరిసప్తగిరి
| director = జె. ప్రభాకర్ రెడ్డి
| cinematography = జె. ప్రభాకర్ రెడ్డి
 
==కథ==
జీవితంలో ఓడిపోయి బ్రతకాలనే ఆశ కోల్పోయిన సుధీర్ (సుధీర్ బాబు), ప్రవీణ్ (ప్రవీణ్), నందిత (నందిత) అనే ముగ్గురు వ్యక్తులు ఒక సుఖవంతమైన ఆత్మహత్యకు ప్రణాళికలు వేసుకోవడంతో ఈ సినిమా మొదలౌతుంది. మొదటగా చనిపోయే ముందు వాళ్ళు తమ చివరి కోరికలను తీర్చుకోవాలనుకుంటారు.ఒక కొత్త కారును దొంగిలించాలని నందిత కోరుకుంటే ఆ ప్రాంతపు ఎం.ఎల్.ఏ.ను తన ఇంటిలోనే కొట్టాలని సుధీర్ ఆశపడతాడు. ఒక కారును దొంగిలించి అక్కడి ఎం.ఎల్.ఏ.ను కొట్టి పోలీసులనుంచి తప్పించుకున్నాక ఆ ముగ్గురూ ఒక హోటలుకు వెళ్తారు. కారుని ఒకడు దొంగిలించుకు పోయాక ఆ ముగ్గురూ హోటలుకు వెళ్ళి భోజనం చేయాలనుకుంటారు. అక్కడ నెల్లూరు సప్తగిరి (సప్తగిరి) అని మరో యువకుడు వీళ్ళను కలిసి తను కూడా వాళ్ళతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. సప్తగిరితో కలిసి ఆ ముగ్గురూ దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అప్పటికే ప్రేమలో విఫలమై కుమిలిపోతున్న సుధీర్ ప్రాణాలను కాపాడాలని ప్రవీణ్, సుధీర్ ని ప్రేమిస్తున్న నందిత ప్లాన్ చేసి ఆత్మహత్యను మూడురోజులు వాయిదా వేయిస్తారు.
 
ఈ మూడు రోజుల్లో ఆ నలుగురూ ప్రాణస్నేహితులౌతారు. నందితపై ప్రేమను పెంచుకున్న సుధీర్ తన ప్రేమ గురించి నందితకు చెప్తే తనని నీచంగా చూస్తుందని భయపడి నిజాన్ని దాస్తాడు. మూడో రోజు రాత్రి ప్రవీణ్ నందితను సుధీర్ ప్రాణాలను కాపాడాలంటే వెళ్ళి తనని ముద్దుపెట్టుకోమని చెప్తాడు. మగాళ్ళ మనస్తత్వం ప్రకారం ఈ చర్యతో సుధీర్ మనస్తత్వంలో మార్పు వస్తుందని నమ్మిస్తాడు. ఇంకోవైపు ప్రవీణ్ సుధీర్ దగ్గరికి వెళ్ళి నందితను ముద్దుపెట్టుకుని తన చివరి ఆశలను తీర్చమని బలవంతపెడతాడు. వేరే దారి లేక సుధీర్ దీనికి ఒప్పుకుంటాడు. నందితకు ముద్దుపెట్టే సమయంలో నందిత శరీరంలోకి ఒక ఆత్మ ప్రవేశించి తనని బయటికి పొమ్మని కసురుతుంది. భయపడిపోయిన సుధీర్ అక్కడినుంచి పారిపోతాడు. ఆ క్షణం నుంచి నందితను దూరం పెడుతూ కాలం వెళ్ళదీస్తున్న సుధీర్ తనకు ఎప్పుడు దగ్గరైనా ఆ ఆత్మ కోపానికి బలైపోతానని కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలియని నందిత ఎంతో బాధపడుతుంది.
 
అప్పుడు సుధీర్ నందిత గురించి ప్రవీణ్ ద్వారా తెలుసుకుంటాడు. సుధీర్ ఎదురింటిలో ఉండే నందిత తొలిచూపులోనే తనని ప్రేమిస్తుంది. తనకోసం ఒక అమ్మాయి వేచి ఉందని తెలియని సుధీర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది తెలిసి ఎలాగైనా సుధీర్ ప్రేమను గెలవకముందే తన మనసులోని మాటను తెలియజేయాలనుకుంటుంది నందిత. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకోవలనుకున్న సుధీర్ ప్రాణాలను కాపాడాలని చూస్తున్న ప్రవీణ్ నందిత గురించి తెలుసుకుని తనతో కలిసి మరుసటిరోజు ఈ సామూహిక ఆత్మహత్య కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తాడు ప్రవీణ్. ఆపై సప్తగిరి, సుధీర్ తామిద్దరూ చావట్లేదని తెలుసుకుని ఆగిపోతారు.సుధీర్ నందితకి దయ్యం పట్టిందని, తనపై ప్రేమ ఎంతున్నా ఆ దయ్యానికి తను భయపడాల్సి వస్తోంది అని ప్రవీణ్ ముందు వాపోతాడుఇది విన్న ప్రవీణ్ నందిత రూనుకి వెళ్ళి తనని మందలించి సుధీరుకి దగ్గరవ్వమంటాడు. చివరికి తనలో ఆత్మ ప్రవేశించాక ఆ ఆత్మ కోపానికి ప్రవీణ్ బెదిరిపోతాడు. ఆత్మ ఆవహించిన నందిత చేతుల్లో దెబ్బలు తింటాడు. అదే రాత్రి సప్తగిరి కూడా సుధీర్, నందిత చదరంగం ఆడుతున్నప్పుడు కొన్ని కారణాల వల్ల సుధీర్, ప్రవీణ్ పారిపోయాక ఆ ఆత్మ నందితను ఆవహించడం, గాలి సోకిన నందిత విశ్వరూపాన్ని చూసి బెదిరి పారిపోయి సుధీర్, ప్రవీణ్ పక్కనే చేరి ఆ రాత్రి గార్డెనులో పడుకుంటారు. ఆ క్షణం నుంచీ ఆ ముగ్గురూ కలిసే తిరగాలనీ, నందితకు దూరంగా ఉండాలనీ నిర్ణయించుకుంటారు.
 
మరుసటి ఉదయం నుంచీ నందిత శరీరం నుంచి ఆ ఆత్మను బయటికి రప్పించాలని ప్రయత్నించి దారుణంగా విఫలమై ఆ ఆత్మ కోపాన్ని చవిచూస్తుంటారు ఆ ముగ్గురూ. తనకి దయ్యం పట్టిందని తెలిసాక నందిత కూడా ఆ ముగ్గురితో కలిసి పారిపోవాలనుకుంటుంది. కానీ ఈ సారి కూడా పాచికలు పారవు. సుధీర్ తనని దూరం పెట్టడం భరించలేక నందిత తీవ్ర మానసిక సంక్షోభానికి లోనై చేతినరాలను కోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఇంతలో ఆ ఇంటి ఓనరు కొడుకు, వాడి ఇద్దరి స్నేహితులు ఆ ఇంట్లోకి వస్తారు. సుధీర్, ప్రవీణ్, సప్తగిరి కాకుండా వారితో ఒక అమ్మాయి ఉందని తెలిసి కామేఛ్ఛతో వారిని రెండు రోజుల దాకా ఇక్కడే ఉండమని అనుమతిస్తారు. నందిత రూములోకి వెళ్ళిన సుధీర్ చావుబ్రతుకుల్లో ఉన్న తన దగ్గరికి వెళ్తాడు. మరలా తనకి దయ్యం సోకడంతో అసలు నువ్వెవరని సుధీర్, ప్రవీణ్, సప్తగిరి అడుగుతారు. అప్పుడు ఆ దయ్యం తన గతాన్ని చెప్తుంది.
 
నందిత శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ పేరు లక్ష్మి. తన భర్తతో కలిసి తొలిరాత్రి జరుపుకోడానికి ఈ ఇంటికి కొన్నాళ్ళ క్రితం వచ్చింది. కానీ అప్పుడక్కడే ఉన్న ఆ ముగ్గురు యువకులూ తన భర్తని మందు సీసాతోతల పగలకొట్టి తనపై అత్యాచారానికి పాల్పడతారు. వారి కిరాతకానికి లక్ష్మి చనిపోగా తన భర్త ఒక గునపాం వల్ల గాయపడి స్విమ్మింగ్ పూలులో పడి చనిపోతాడు. ఇదంతా విన్న సుధీర్, ప్రవీణ్, సప్తగిరి ఆ ముగ్గురు యువకులను ఎదిరించి వారిని చంపేస్తారు. ఆత్మ నందిత శరీరాన్ని వదిలి వెళ్ళాక నందితను హాస్పిటలుకి తీసుకెళ్ళి కొంత రక్తాన్ని తనకి దానం చేస్తాడు సుధీర్. మేలుకున్న నందిత సుధీరుని దగ్గరకు తీసుకోవడాన్ని తలుపు చాటున ప్రవీణ్, సప్తగిరి ఆనందంగా చూడటంతో సినిమా ముగుస్తుంది.
 
==నటవర్గం==
* [[m:en:Sudheer Babu|సుధీర్ బాబు]]
*[[నందిత]]
*ప్రదీప్
*గిరి
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867814" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ