కోడి రామ్మూర్తి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 111.93.20.156 (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు వరకు తిప్ప...
పంక్తి 13: పంక్తి 13:
[[File:Kodi Ramamurthy3.JPG|thumb|150px|కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం]]
[[File:Kodi Ramamurthy3.JPG|thumb|150px|కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం]]
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ''''ఇండియన్ హెర్క్యులెస్'''' అనే బిరుదును ప్రసాదించారు.
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ''''ఇండియన్ హెర్క్యులెస్'''' అనే బిరుదును ప్రసాదించారు.
ఇంకా '''కలియుగ భీమ''', మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.
ఇంకా '''కలియుగ భీమ''', మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. <ref> [http://books.google.com/books?id=T4xebP6S2KsC&pg=PA225&dq=kodi+ramamurthy&sig=WoODB5_4nQQbkKrfsRmsHzOFcN8] </ref>


Heman,spiderman,Rock man, Chiranjeevi ---------------------


==మూలాలు==
==మూలాలు==

05:53, 12 జూలై 2013 నాటి కూర్పు

కోడి రామ్మూర్తి నాయుడు

కోడి రామ్మూర్తి నాయుడు (1882 - 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతోవిజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు.మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.

శ్రీకాకుళంలో స్థాపించిన కోడి రామమూర్తి విగ్రహం

బలప్రదర్శన విశేషాలు

  • గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
  • ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
  • రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
  • ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.

బిరుదులు

కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం

ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, 'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. [1]

మూలాలు