"కుబేరుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
16 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Kubera on man.jpg|thumb|right|కుబేరుడు]]
[[దస్త్రం:F1907.271.297.jpg|thumb|left|కుబేరుని వద్ద నుంచి పుష్పక విమానమును లక్కున్న రావణుడు]]
[[కుబేరుడు]] ([[సంస్కృతం]]: कुबेर) హిందూ పురాణాల ప్రకారం [[యక్షులు|యక్షుల]]కు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే [[ధనపతి]] అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన [[ఉత్తరం|ఉత్తర]] దిక్కుకు అధిపతి అనగా [[దిక్పాలకుడు]]. ఈతని నగరం [[అలకాపురి]]. ఇతడు [[విశ్రవసుడు|విశ్రవసుని]] కుమారుడు. ఈయన భార్య పేరు [[చార్వి]].
 
[[కృతయుగం]]లో బ్రహ్మపుత్రుడైన [[పులస్త్యుడు]] అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపమాచరించుకునేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరివల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసిన యెడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు.
 
ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడుని[[పులస్త్యుడు]]ని చూడటం తటస్థించింది. వెంటనే గర్భం దాల్చింది. భయాందోళనలతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే [[విశ్రవసుడు]]. విశ్రవసుడి కొడుకు [[కుబేరుడు]]
 
కుబేరుడు ధనాధిదేవత. [[శ్రీ వేంకటేశ్వరుడు]] వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం.
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/885100" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ