సుమలత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:1963 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 54: పంక్తి 54:
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:నంది ఉత్తమ నటీమణులు]]
[[వర్గం:నంది ఉత్తమ నటీమణులు]]
[[వర్గం:1963 జననాలు]]

05:16, 27 ఆగస్టు 2013 నాటి కూర్పు

సుమలత
జననం (1963-08-27) 1963 ఆగస్టు 27 (వయసు 60)
ఇతర పేర్లుసుమలత అంబరీష్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1978 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅంబరీష్

సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.

1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది. తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నటించింది.

సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది. గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.

సుమలత నటించిన తెలుగు చిత్రాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సుమలత&oldid=901223" నుండి వెలికితీశారు