అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:రాజకీయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9: పంక్తి 9:
==రాష్ట్రపతి==
==రాష్ట్రపతి==
భారతదేశం యొక్క అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు. ఇతను భారతదేశానికి ప్రథమ పౌరుడు. ఇతనిని పార్లమెంటు రెండు సభలలో ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు.
భారతదేశం యొక్క అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు. ఇతను భారతదేశానికి ప్రథమ పౌరుడు. ఇతనిని పార్లమెంటు రెండు సభలలో ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు.

[[వర్గం:రాజకీయం]]

03:32, 28 ఆగస్టు 2013 నాటి కూర్పు

ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని అధ్యక్షుడు (President) అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం. అధ్యక్షత వహించు (presiding over) నుండి పుట్టిన పదం అధ్యక్షుడు. ఒక దేశానికి చెందిన అధ్యక్షుడిని రాజ్యాధ్యక్షుడు లేదా దేశాధ్యక్షుడు అని పిలుస్తారు. ఇతని తర్వాతి పదవిని ఉపాధ్యక్షుడు (Vice President) అంటారు.

అధ్యక్ష ప్రజాప్రభుత్వము లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహించును (ఈపద్ధతి ప్రకారము ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉందురు. ఈ పద్ధతి అమెరికా సంయుక్త రాష్ట్రాలు లందున్నది.)

అధ్యక్షుడు ఎంపిక

యునైటెడ్ స్టేట్స్ కు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అతను ఎలక్టోరల్ కాలేజి చేత ఎన్నుకోబడతాడు. కంపెనీలకు అధ్యక్షులు ఉంటారు. వారు ఆ కంపెనీకి చెందిన స్వంత విభాగం వారిచే ఎన్నుకోబడతారు. కొన్ని కంపెనీలలో ఆ కంపెనీ కార్మికులు ఓటింగ్ పద్ధతి ద్వారా వారి యొక్క కంపెనీ ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు.


రాష్ట్రపతి

భారతదేశం యొక్క అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు. ఇతను భారతదేశానికి ప్రథమ పౌరుడు. ఇతనిని పార్లమెంటు రెండు సభలలో ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు.