అసీమా ఛటర్జీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 56: పంక్తి 56:
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు]]

06:27, 30 ఆగస్టు 2013 నాటి కూర్పు

అసిమా చటర్జీ
Asima Chatterjee
అసిమా చటర్జీ
జననం(1917-09-23)1917 సెప్టెంబరు 23
కొల్కతా, బెంగాల్
మరణంError: Need valid birth date (second date): year, month, day
కొల్కతా, పశ్చిమ బెంగాల్
జాతీయతభారతీయురాలు
రంగములుOrganic chemistry, phytomedicine
వృత్తిసంస్థలుకలకత్తా విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుకలకత్తా విశ్వవిద్యాలయం

అసిమా చటర్జీ (ఆంగ్లం : Asima Chatterjee; Bengali: অসীমা চট্টোপাধ্যায়) (సెప్టెంబరు 23 1917 - నవంబరు 22 2006) ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు.[1] ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు మరియు మలేరియా మరియు ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.

జీవిత విశేషాలు

అసిమా చటర్జీ 23 సెప్టెంబర్ 1917 తేదీన బెంగాల్ లో జన్మించింది. ఆమె తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. కలకత్తా యూనివర్శిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది(1944). అమెరికా వెళ్ళి యూనివర్శిటీ ఆఫ్ విస్కన్‌సిస్ లో పరిశోధనలు నిర్వహించారు.(1947-48). పుట్టిన దగ్గరి నుండి జీవితాంతం కలకత్తా లోనే గడిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి1936లో రసాయనశాస్త్రం లో పట్టా పొందారు.[2][3] 1938 లో ఆమె "ఆర్గానిక్ కెమిస్ట్రీ" లో మాస్టర్స్ డిగ్రీని పోందారు. ఈమె కలకతతా విశ్వవిద్యాలయం నందు డాక్టరల్ వర్క్ పూర్తిచేశారు. ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రం లో వృక్ష ఉత్పత్తుల గూర్చి పరిశోధనలు చేశారు. ఈమె ప్రఫుల్ల చంద్ర రే మరియు ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ గారి అధ్వర్యంలో పరిశోధనలు చెశారు. ఈమె 1940 లో కలకత్తా యూనివర్శిటీ యొక్క "లేడీ బ్రబోర్నె కాలేజి" లో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1944 లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానం లో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు[1] . 1954 లో ఆసిమా చటర్జీ కలకత్తా యూనివర్శిటీ లో ప్రొఫెసర్ గా కెమిస్ట్రీ విభాగంలో చేరారు. 1962 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. ఈమె 1982 నుండి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు[1].

పరిశోధనలు

ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు. కలకత్తా యూనివర్శిటీ లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా , ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలుగా (1982 - 90) ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు.

ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ ఔషథ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్‌పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు.. Saral Madhyamain Rasayana (3 సంపుటములు) , Bharater Banushadi మొదలైన గ్రంథ రచనలు చేశారు. 240 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. "జర్న ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీ" కి సంపాదకులుగా ఉన్నారు. అమెరికా లోని సిగ్మా XI సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు.

పురస్కారాలు

  • కలకత్తా యూనివర్శిటీ వారి నాగార్జున ప్రైజ్ మరియు గోల్డ్ మెడల్ (1940)
  • ప్రేమ్‌చంద్ రాయల్ స్కాలర్ ఆఫ్ కలకత్తా యూనివర్శిటీ.[3]
  • యూనివర్సిటీ కలకత్తా నుండి సైన్స్ లో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ (1944)[1]
  • 1948 - 49 : వాటుముల్ ఫెలోషిప్(అమెరికా)
  • 1962-1982 మధ్య ఆమె ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా కు చెందిన అత్యంత గౌరవ పదవి[1].
  • 1960: న్యూఢిల్లీ లోని ఇండియన్ నేషనల్ అకాడమీ యొక్క ఫెలోగా ఎంపిక [1].
  • 1961 : శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (రసాయన శాస్త్రం), ఈ అవార్డును పొందిన మొదటి మహిళ[1].
  • 1975 : పద్మభూషన్ అవార్డు. ఈ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త.[1]
  • 1981 : భువన్ మోహన్ దాస్ గోల్డ్ మెడల్
  • 1985 : సర్ సి.వి.రామన్ అవార్డు
  • 1989 : సర్ అసుతోష్ ముఖర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్
  • 1954 : శిశిర్ కుమార్ మిశ్రా పురస్కారం.
  • 1982 - 1990 : రాజ్యసభ సభ్యులు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 The Shaping of Indian Science. p. 1036. Indian Science Congress Association, Presidential Addresses By Indian Science Congress Association. Published by Orient Blackswan, 2003. ISBN 978-81-7371-433-7
  2. Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume Scottish Church College, 2008, p. 584
  3. 3.0 3.1 Chemistry alumni of Scottish Church College


బయటి లింకులు