రోణంకి అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
| residence =
| residence =
| other_names =రోణంకి అప్పలస్వామి
| other_names =రోణంకి అప్పలస్వామి
| image =
| image =Ronanki Appalaswamy 2.jpg
| imagesize = 200px
| imagesize = 200px
| caption = రోణంకి అప్పలస్వామి
| caption = రోణంకి అప్పలస్వామి పాత చిత్రం
| birth_name = రోణంకి అప్పలస్వామి
| birth_name = రోణంకి అప్పలస్వామి
| birth_date =
| birth_date =

09:13, 5 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

రోణంకి అప్పలస్వామి
రోణంకి అప్పలస్వామి పాత చిత్రం
జననంరోణంకి అప్పలస్వామి
ఇతర పేర్లురోణంకి అప్పలస్వామి
ప్రసిద్ధిసహితీకారుడు

రోణంకి అప్పలస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా , ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి , బెట్టిన దొర టోపీ పెట్టుకొని ..టెక్కలి ని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. శ్రీశ్రీ, ఆరుద్ర లకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.

జీవిత విశేషాలు

అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15 న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యారు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. 1987 మార్చిలో మరణించారు.

పత్రికల్లో వ్యాసాలు

అభ్యుదయ, అవగాహన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రదేశ్‌, కళాకేళి, ప్రజారధం, సృజన మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. సమాచారశాఖ వారికోసం కోడి రామమూర్తిపై చిన్న పుస్తకం రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ప్రిన్స్‌ను - నేరుగా ఇటాలియన్‌ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, చాగంటి తులసి - మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -'త్వమేవాహం'నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి 'వెలిగించే దీపాలు'ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, శ్రీశ్రీ తానే పితామహుడిననడం తగదని - జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. విశాఖపట్నం ఆకాశవాణి నుండి తెలుగు, ఇంగ్లీషులలో పలు ప్రసంగాలు చేశారు. రావూరి భరద్వాజగారు - ప్రత్యేకంగా ఆయన చేత హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు.

టెక్కలి వారి స్వగృహంలో వివిధ యురోపి యన్‌ భాషలకు చెందిన అరుదైన గ్రంథాలు ఇప్పటికీ అలాగే వున్నాయి. వాటిని విశాఖనగర పౌర గ్రంథాలయానికి తరలించాలన్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఆయన రచనలు ఎన్నడూ జాగ్రత్త చేయలేదు. పోయినన్ని పోగా మిగిలిన తెలుగు, ఇంగ్లీషు రచనల్ని పుస్తకంగా తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. వారి ఇంగ్లీషు కవితలు లోగడ - సాంగ్స్‌ అండ్‌ లిరిక్స(1935), ది నావ్‌ అండ్‌ అదర్‌ పోయమ్స్‌ (1985) పేర పుస్తక రూపంలో వచ్చాయి.

మూలాలు