సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
బ్లాగు లింకు తొలిగింపు
పంక్తి 53: పంక్తి 53:
==మూలాలు==
==మూలాలు==
*-ప్రొ.ఈ.వి. సుబ్బారావు గారి సేకరణ:
*-ప్రొ.ఈ.వి. సుబ్బారావు గారి సేకరణ:

*https://sites.google.com/site/scientistsintelugu/home/subramanyamchandrashekhar_
===మూలాలు===
===మూలాలు===

16:47, 7 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
జననం(1910-10-19)1910 అక్టోబరు 19
లాహోర్, పంజాబ్, British India
మరణం1995 ఆగస్టు 21(1995-08-21) (వయసు 84)
చికాగో, United States
జాతీయతBritish India (1910-1947)
భారతదేశం (1947-1953)
United States (1953-1995)
రంగములుAstrophysics
వృత్తిసంస్థలుచికాగో విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుTrinity College, Cambridge
Presidency College, Madras
పరిశోధనా సలహాదారుడు(లు)R.H. Fowler
డాక్టొరల్ విద్యార్థులుDonald Edward Osterbrock, Yavuz Nutku
ప్రసిద్ధిChandrasekhar limit
ముఖ్యమైన పురస్కారాలుNobel Prize, Physics (1983)
Copley Medal (1984)
National Medal of Science (1967)

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్(తమిళం: சுப்பிரமணியன் சந்திரசேகர்) (అక్టోబర్ 19, 1910ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ కు భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు తో సత్కరించింది.

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్(అక్టోబర్ 19, 1910—ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఇతని అంకుల్ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ కు భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు తో సత్కరించింది.


పేరు  : సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జననం ---- అక్టోబర్ 19 1910(1910-10-19);లాహోర్, పంజాబ్, British India మరణం --- ఆగష్టు 21 1995 (వయసు: 84),చికాగో, United States జాతీయత --- British India (1910-1947),భారతదేశం (1947-1953),United States (1953-1995) రంగము Astrophysics సంస్థ ----- చికాగో విశ్వవిద్యాలయం,కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మాతృ సంస్థ -- Trinity College, Cambridge,Presidency College, Madras పర్యవేక్షకుడు- R.H. Fowler ప్రముఖ విద్యార్ధులు Donald Edward Osterbrock, Yavuz Nutku ప్రాముఖ్యత -- Chandrasekhar limit ముఖ్య పురస్కారాలు --- Nobel Prize, Physics (1983),Copley Medal (1984),National Medal of Science (1967) మతం---- None, atheist

నక్షత్రాల నిర్మాణం, పరిణామ దశలపై అద్భుతమైన సిద్ధాంతాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందాడో భారతీయ శాస్త్రవేత్త. ఆయనే సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. పుట్టిన రోజు -1910 అక్టోబర్‌ 19న

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒక వ్యక్తి దేశంలోనే తొలి నోబెల్‌ పొందిన శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. తారల పరిణామ దశలకు సంబంధించిన పరిశోధనల్లో 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా ఇప్పటికీ ఉపయోగపడుతున్న సిద్ధాంతాలను అందించిన చంద్రశేఖర్‌, ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచాడు.

ప్రతి వ్యక్తి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలున్నట్టే, నక్షత్రాల్లో రెడ్‌జెయింట్‌, వైట్‌డ్వార్ఫ్‌, సూపర్‌నోవా, న్యూట్రాన్‌స్టార్‌, బ్లాక్‌హోల్‌ అనే పరిణామ దశలుంటాయి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్‌ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ పొందారు.

పంజాబ్‌లోని లాహోర్‌ (ప్రస్తుత పాకిస్థాన్‌)లో 1910 అక్టోబర్‌ 19న పదిమంది సంతానంలో మూడో వాడిగా, నలుగురు కొడుకుల్లో పెద్దవాడిగా పుట్టిన చంద్రశేఖర్‌ చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. తండ్రి ఉద్యోగరీత్యా పలుప్రాంతాలు తిరిగినా వాళ్ల కుటుంబం తమిళనాడుకు చెందినదే. ప్రాథమిక విద్యను ఇంట్లోనే అభ్యసించిన చంద్రశేఖర్‌ మద్రాసులో హైస్కూల్లో చేరాడు. అక్కడి ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడై, ఆపై ప్రతిభతో ఉపకారవేతనం సాధించి లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే తన 23వ ఏట పీహెచ్‌డీ సాధించి, ఆపై షికాగో విశ్వవిద్యాలయంలో శాఖాధిపతిగా చేరి జీవితాంతం అక్కడే ఉండిపోయారు.

సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా ఆయన నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్‌ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్‌నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ చివరికి బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం) అయిపోతాయి.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నెలకొల్పిన ఖగోళ భౌతిక పరిశోధనాలయంలో కీలక బాధ్యత వహించారు. వృద్ధాప్యంలో సైతం ఆయన న్యూటన్‌ సిద్ధాంతాలను విశ్లేషిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాసిన 'న్యూటన్‌ ప్రిన్సిపియా ఫర్‌ కామన్‌ రీడర్‌' సైన్స్‌ అభిరుచి ఉన్నవారందరూ చదవవలసిన పుస్తకం. చంద్ర ఎక్స్‌రే వేధశాల, చంద్రశేఖర్‌ సంఖ్య, గ్రహశకలం 1958 చంద్ర అనేవి ఆయన సేవలకు శాస్త్రలోకం అర్పించిన నివాళులకు గుర్తులు. ఆయన 1995లో షికాగోలో తన 85వ ఏట మరణించారు.

మూలాలు

  • -ప్రొ.ఈ.వి. సుబ్బారావు గారి సేకరణ:


మూలాలు