వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎pullalacheruvu: removed unnecessary section
పంక్తి 80: పంక్తి 80:
వికీపీడియాలో సైటు నోటీసులు ఎప్పతికప్పుడు తాజాకరిస్తున్నాను.
వికీపీడియాలో సైటు నోటీసులు ఎప్పతికప్పుడు తాజాకరిస్తున్నాను.
అలానే [[మీడియావికీ:Anonnotice]] ను పునఃప్రారంభించాను. ఇక్కడ ఉండే సైటు నోటీసు ఖాతా తెరువని/లాగిన్ అవ్వని సందర్శకులకు కనిపిస్తుంది. అలానే సైటు నోటీసులో పాఠ్యం ఉంచడానికే ప్రయత్నించగలరు, బొమ్మలు పెట్టడం వల్ల అందంగా కనిపించినా కొన్ని దుష్ప్రభావాలున్నాయి. అలాగే పాఠ్యాన్ని మరింత అందంగా చూపించడం కోసం కొత్త సాంకేతికాలు తెలుసుకోవచ్చు. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 18:18, 21 సెప్టెంబర్ 2013 (UTC)
అలానే [[మీడియావికీ:Anonnotice]] ను పునఃప్రారంభించాను. ఇక్కడ ఉండే సైటు నోటీసు ఖాతా తెరువని/లాగిన్ అవ్వని సందర్శకులకు కనిపిస్తుంది. అలానే సైటు నోటీసులో పాఠ్యం ఉంచడానికే ప్రయత్నించగలరు, బొమ్మలు పెట్టడం వల్ల అందంగా కనిపించినా కొన్ని దుష్ప్రభావాలున్నాయి. అలాగే పాఠ్యాన్ని మరింత అందంగా చూపించడం కోసం కొత్త సాంకేతికాలు తెలుసుకోవచ్చు. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 18:18, 21 సెప్టెంబర్ 2013 (UTC)

== pullalacheruvu ==

pullalacheruvu is a village in prakasam dt.
it is also mandal head quarter


== [[:m:Community Logo/Request for consultation|Request for consultation on community logo]] ==
== [[:m:Community Logo/Request for consultation|Request for consultation on community logo]] ==

05:24, 24 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

<br=clear all>

బ్లాగులింకుల మయం

గత వారంరోజులుగా తెవికీ వ్యాసాలలో బ్లాగులింకులివ్వడం అతి అయిపోయింది. (నేను మాత్రం రెండు రోజుల క్రితమే చూశాను) కాపీ చేసిన వ్యాసాలు చేర్చడమే తప్పయితే, పైగా వాటికి బ్లాగులింకులివ్వడం మరోపొరపాటు. ఒకవేళ నిజంగా బ్లాగునిర్వాహకులే రచించిన వ్యాసాలు అనుమతిలో తెవికీలో చేర్చాలన్ననూ ముఖ్యమైన వాక్యాల చివరన మాత్రమే రెఫరెన్స్ పెట్టాలి కాని, మూలం అనే విభాగంలో కాదు. అలా ఇస్తే భవిష్యత్తులో ఇతరవనరుల నుంచి తీసుకున్న సమాచారానికి కూడా ఇదే లింకు ఆధారమని పొరపడే అవకాశముంది. ఇచ్చిన బ్లాగులింకులు కూడా వ్యాసాలలో ఎక్కడెక్కడో ఇష్టమున్నట్లుగా చేర్చారు. కొన్ని వ్యాసాలలో ప్రారంభంలో, (చూడండి:ఓలర్) కొన్నింటిలో మధ్యలో చేర్చడమే కాకుండా చాలా వ్యాసాలలో visit my Website Dr Seshagirirao, MBBS అని చేర్చడం దేనికి? (చూడండి: కాకర, తమలపాకు, బ్లూబెర్రీ, చిట్కాలు, చిక్కుడు, సమతౌల్యపౌష్టికాహారం) మరికొన్ని వ్యాసాలలో వ్యాసంలో మధ్యలోనే Collected /dr.seshagirirao-MBBS (Srikakulam) చేర్చే అవసరం ఏమిటి? (చూడండి: ఆలివ్ నూనె), మరికొన్ని వ్యాసాలలో "వివిధ వార్తా పత్రికల నుండి విషయ సేకరణ్ . (డా. వందన శేషగిరిరావు ...శ్రీకాకుళం)" అని చేర్చారు.(చూడండి: తేనె) అంటే పత్రికలలో వచ్చినదిగా చెబుతూనే పేరు వ్రాయడమెందుకు? మక్కికిమక్కి తీసుకోవడానికి సేకరణ అనరు, కాపీ అంటారు. తెవికీ అనేది బ్లాగులను ప్రచారం చేసే వేదిక కాదుకదా! కొన్ని వ్యాసాలలో ఒక్క వాక్యం కూడా లేదు, అలాంటి వ్యాసాలలో కూడా బ్లాగులింకులివ్వడం దేనికి? (చూడండి: హింషెన్‌వుడ్, వాల్టర్, హీమర్, బాయిల్) మరికొన్ని వ్యాసాలలో ఇదివరకే సమాచారం ఉన్ననూ కేవలం బ్లాగులింకు ఇవ్వడం కొరకే దిద్దుబాట్లు చేసినట్లు తెలిసింది. (చూడండి:వాల్తెర్‌బోథె, స్టీఫెన్‌హాకింగ్, రవీంద్రనాథ్‌ఠాగూర్,) కొన్ని వ్యాసాలలో బ్లాగరు పేరు చేర్చారు (చూడండి: జీడిపప్పు, బీటుదుంప) ఈ అనవసర లింకులన్నీ తొలిగించబడ్డాయి. ఇకముందైనా ఇలాంటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:19, 7 సెప్టెంబర్ 2013 (UTC)

ఆవును.ఈ విషయంలో సభ్యులు,నిర్వాహకులు తగిన విధంగా స్పందించి,అభిప్రాయాలు వెల్లడించిన, తదనుగుణంగా రచనలు చెయ్యటానికి వీలుంటుంది.మనకు రాశికన్న వాసి ముఖ్యం.అవసరమైతే కొన్ని మార్గదర్శకసూత్రాలను రచయితలకు అందుబాటుగా వుంటేటట్లు సభ్యుల చర్చాపేజిలో ఉంచిన మంచిదేమో?పాలగిరి (చర్చ) 01:05, 8 సెప్టెంబర్ 2013 (UTC)
  • పైన తెలిపిన వాటితో నేను ఏకీభవిస్తాను.--అర్జున (చర్చ) 13:53, 8 సెప్టెంబర్ 2013 (UTC)
  • ఇప్పటికే పుస్తకంలోఅందుబాటులో వున్నవాటిని యథాతథంగా చేర్చటానికి వికీసోర్స్ ఉత్తమం. గమనించండి--అర్జున (చర్చ) 13:53, 8 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీకి ఆమోదయోగ్యంకాని వ్యాసం పేర్లు

ఇటీవల తెవికీలో వచ్చిన వ్యాసాలను గమనిస్తే వ్యాసం పేర్లు వికీపీడియాలో పెట్టడానికి ఆమోదయోగ్యంగా లేనట్లుగా కనిపిస్తోంది.
1) వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది? అనే పేరుతో వ్యాసం సృష్టించడానికి బదులు అందులో అవసరమైన సమాచారం ఉంటే వంటనూనెలు వ్యాసంలో చేర్చితే సరిపోయేది. ఏ విషయంలోనైనా ఏది మంచిది? అనే విషయాన్ని తెవికీ ఎప్పుడూ చెప్పదు. అన్ని అభిప్రాయాలతో కూడిన సమాచారం, దానికి తగిన మూలాలతో కూడిన వ్యాసం మాత్రమే ఇక్కడ ఉండాలి.
2)ఆరోగ్యానికి టమేటా లాంటి శీర్షికలు పత్రికలు, మేగజైన్ల వారు సృష్టిస్తారు కాని మనకు మాత్రం అలాంటి సమాచారం అందుబాటులో ఉన్నా టమేటా వ్యాసంలో చేరిస్తే సరిపోతుంది. ‎ఆరోగ్యానికి పానీయాలు వ్యాసాలపేర్లు కూడా ఇంతే. గోజి...సూపర్‌ఫ్రూట్‌ వ్యాసం పేరే కాకుండా సమాచారం కూడా తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. "కాబట్టి 'గో గోజి...' అన్న స్లోగన్‌ మెల్లగా మనకీ విస్తరించినా ఆశ్చర్యం లేదు" అని మనం చెప్పడానికి వీలుండదు.
3)ఫాస్ట్ ఫుడ్-మన ఆరోగ్యము అవగాహన పేరుతో పాటు వ్యాస ప్రారంభమూ ప్రమాణంగా లేదు. "మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే..." తో ప్రారంభమైన వ్యాసంలో "అనుకుంటాం", "అనుకోవచ్చు" లాంటి పదాలు వాడినారు (ఉంచారు). వ్యాసంలో మన స్వంత అభిప్రాయాలు ఉండరాదు కదా! ఆ విషయం ఎవరైనా చెబియుంటే ఫలానా వారు ఇలా చెప్పారు అని వ్రాసి రెఫరెన్స్ ఉంచాలి.
4)పైడి జైరాజ్ -హిందీ చిత్ర సీమలో తొలి తెలుగు హీరో పేరు గురించి ఇదివరకే చెప్పాను. పొట్టలో క్రొవ్వు పెరుగుదల, పిల్లలలో చురుకుదనం తగ్గుదల, ఉద్యోగినుల పోషకాహారం, ఆహారము తో పెయిన్ కిల్లర్లు లాంటి వ్యాసాలలో పేరుతో సహా సమాచారం కూడా పత్రికల శైలిలోనే ఉంది.
5) శరీరం మృదువుగా ఉండడానికి బాడీలోషన్‌ పేరుతో సహా సమాచారం చూస్తే "శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే..." వాక్యంతో ప్రారంభమౌతుంది. అలా అని మనం ఎలా చెప్పగలం. తెవికీ వ్యాసం అనేది బాడీలోషన్ కంపెనీకి చెందిన ప్రకటన కాదుకదా!
పత్రికలలో వచ్చిన సమాచారం కాపి చేయడం (వయా బ్లాగు) వల్ల ఈ సమస్యలు వచ్చినట్లుగా భావిస్తున్నాను. ఇలాంటి వ్యాసాలలో అవసరమైన కొద్ది సమాచారం మాత్రమే ఉంచి (లేదా సంబంధిత వ్యాసాలకు తరలించి) పూర్తిగా వికీకరణ చేయాల్సి ఉంటుంది. ఇకముందైనా సభ్యులు కాపీ వ్యాసాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:30, 9 సెప్టెంబర్ 2013 (UTC)

వ్యాసాల శీర్షికలు చాలా పెద్దవిగా ఉండటం వాస్తవం. ఆ వ్యాసాలను యింతకు ముందు తెవికీ లో ఉన్న తగిన వ్యాసంలో విలీనం మూస ఉంచినట్లయితే వాటిపై చర్చించి తగు విధంగా విలీనం చేయవచ్చు. కొన్ని వ్యాసాలు యిది వరకు లేనివైతే వాటి పేర్లను తగువిధంగా సంగ్రహంగా అర్థం అయ్యేటట్లు వికీ నియమావళికి అనుగుణంగా తరలించవచ్చు. పైన చేర్చిన వ్యాసాలను తగు విధంగా వికీ నియమాల ప్రకారం వికీకరణను చేపట్టవలసి యున్నది. ఈ వికీకరణ లో నేను తగు విధంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను.---- కె.వెంకటరమణ చర్చ 13:10, 10 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావు గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఆయా వ్యాసాములలోని సమాచారమును అనుబంధ వ్యాసాలలో చేరిస్తే సమంజసంగా ఉంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:00, 10 సెప్టెంబర్ 2013 (UTC)
ఇవన్నీ మేగజిన్ సరుకు. వీటిని శుద్ధి చేయాలంటే చాలా ఓపిక, శ్రమ కావాలి దానికి బదులు నాణ్యమైన సమాచారాన్ని ఆంగ్ల వ్యాసాలనుండి అనువదించవచ్చు --వైజాసత్య (చర్చ) 02:04, 11 సెప్టెంబర్ 2013 (UTC)

ఏమిటీ లింకులు

ఇటీవల జరిగిన వ్యాసపు దిద్దుబాట్లలో కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే చాలా వ్యాసాపు మూలాలలో ఒక లింకు ఉన్నట్లుగా, దాన్ని నొక్కితే మళ్ళీ అదే వ్యాసపు ఎడిట్ పేజీ తెరుచుకుంటున్నట్లుగా గుర్తించాను. వందలాది వ్యాసాలలో ఇలాంటి లింకులున్నట్లు నా దృష్టికి వచ్చింది. అలాంటి లింకులవల్ల ఉపయోగమేమీ లేదు, వ్యాసాన్ని ఎడిట్ చేయాలంటే పైన ట్యాబ్ ఎలాగూ ఉంటుంది, మరి దీని ఉపయోగమేమిటో ఎందుకు చేర్చారో తెలియదు. కొన్ని వ్యాసాలలో ఇలాంటి లింకులు రెండేసి చొప్పున ఉన్నాయి. (చూడండి: అనాస, గ్రీన్‌టీ) కొన్నింటిలో నేను తొలిగించాను. ఇంకనూ తొలిగించాల్సినవి చాలా ఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:17, 10 సెప్టెంబర్ 2013 (UTC)

ఏక వాక్య వ్యాసాలు

ఈ మధ్య ఏక వ్యాసాలు అధికంగా చేరుతున్నాయి. ఏక వాక్యాలపై యిదివరలో చర్చ జరిగింది. 2 కె.బి పరిమాణం దాటితే మొలక స్థాయి దాటునట్లు నిర్ణయించారు. కానీ ఒక వాక్యాన్ని కూడా వ్యాసంగా చేర్చుతున్నారు. యిలాంటివి విక్షనరీలో చేర్చవచ్చు. కానీ వికీపీడియాలో విపరీతంగా చేరుతున్నాయి. శాస్త్రవేత్తల వ్యాసాలలో విషయమేమీ లేకుండా సమాచార పెట్టె తో అదీ ఆ సమాచార పెట్టె కూడా అనువాదం కాకుండా గల వాటితో మొలక వ్యాసాలు చేరుతున్నాయి. యిటువంటి వ్యాసాలను చేర్చరాదని మనవి. తెవికీలో రాశి కన్నా వాసి ముఖ్యం అని గమనించాలి. మనం తలచుకుంటే అనేక వాసిగల వ్యాసాలను తయారుచేయగలం. మరి ఎందుకు యిలాంటి లఘువ్యాసాలు? యివి ఎవరికి ఉపయోగపడతాయో వ్యాసకర్తలు ఆలోచించవలసియున్నది.---- కె.వెంకటరమణ చర్చ 04:45, 11 సెప్టెంబర్ 2013 (UTC)

వికీ బడి

మీ చర్చలను చర్చ:వికీ బడి పేజీలో రాయగలరు

నేను వికీ బడి అనే శీర్షికన క్రియాశీలక సభ్యులకు వికీపాఠాలు నిర్వాహించదలచుకున్నాను. ఇవి కొత్తసభ్యులను ఉద్దేశించినవి కావు. ఆసక్తి ఉన్నవారు ఈ దిగువన పేరు జతచేయండి. అందరికీ తగిన సమయం చూసి అంతర్జాల తరగతులను నిర్వహించగలను --వైజాసత్య (చర్చ) 05:00, 12 సెప్టెంబర్ 2013 (UTC)

  • మంచి ఆలోచన. ఉదాహరణగా మొదటి కార్యక్రమానికి పాఠాల శీర్షికలు తెలిపితే ఆసక్తిగలవారు పేరు చేర్చటానికి సులభమవుతుంది.--అర్జున (చర్చ) 05:33, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీలో నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది. నన్ను మీ బడిలో విద్యార్థిగా నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 05:38, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నేను కూడా,ఇలాంటివి నాకు తెలియవు.పాలగిరి (చర్చ) 07:18, 12 సెప్టెంబర్ 2013 (UTC)
తొలి పాఠం - మూలాలు, ఉదహరింపులు, మూలలను చేర్చే విధానం, వికీలో మూలాలను ఉదహరించడంపై ఉన్న నియమనిబంధనలు, మార్గదర్శకాలు, మూలాల నాణ్యతను బేరీజు వెయ్యటం, బ్లాగులను ఉదహరించడం, సమాచారపు తనిఖీ మొదలుగు అంశాలని అనుకుంటున్నాను. నేను ఈ పాఠానికి కావలసినవి సమకూర్చుకోవటానికి ఒక రెండు వారాలు పడుతుంది.
రెండవ పాఠం - విజ్ఞానసర్వస్వపు రచనాశైలి - వివిధ రచనాశైలులలో ఉన్న వ్యత్యాసాలు (వార్తలు, మేగజిన్లు, పరిశోధనా వ్యాసాలు, సాధారణ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ట్రావెల్‌గైడ్స్, స్వీయ చరిత్రలు) డూస్ అండ్ డోంట్స్ (చేయకూడనివి, చేయవలసినవి)
మూడవ పాఠం - వికీపీడియాలోని వివిధ తత్త్వాలు, అభిమతాలు - వాటి పరిశీలన. దైనందిన దిద్దుబాటు క్రమంలో వీటి influence (అన్వయం?)
నాలుగవ పాఠం - వికీపీడియా ఏమిటి, ఏది కాదు, వికీపీడియా యొక్క పరిధి, ఇతర సోదర వికీమీడియా ప్రాజెక్టులతో గల సంబంధం.
ఐదవ పాఠం - వికీ సభ్యుల ప్త్రవర్తనా నియమావళి, ఎలా నడచుకోవాలి, ఎందుకలా నడచుకోవాలి, సభ్యుల మధ్య సంబంధాలు.
ఆరవ పాఠం - బొమ్మలు చేర్చటం, సేకరించడం, కాపీహక్కులు, సముచిత వినియోగం, క్లుప్తంగా సంబంధింత కాపీహక్కుల లైసెన్సులపై చర్చ, కొన్ని కాపీహక్కుల చట్టాలపై చర్చ.
ఏడవ పాఠం - నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు
ఇవి నాకు ప్రస్తుతానికి తోచిన కొన్ని అంశాలు. ఇంకా ఏవైనా మీకు తోచితే జోడించగలరు. --వైజాసత్య (చర్చ) 06:44, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నాకూ మీ బడిలో పాథాలు నేర్చుకోవాలనుంది. నన్నూ చేర్చుకోగలరు. దీనికి ఒక పేజీ తయారు చేసి అందులో రాస్తే బావుంటుందిగా. చర్చా పేజీలో వీటికి సంభందించిన చర్చలు రాయొచ్చు..విశ్వనాధ్ (చర్చ) 06:59, 12 సెప్టెంబర్ 2013 (UTC)
"వికీ బడి" అనేది మంచి ఆలోచన. వికీలో రచనలు చేసే విధానం చాలా మందికి తెలియవలసిన అవసరం ఉంది. మూలాలు, లింకులు చేర్చడం, దస్త్రాలను దిగుమతిచేయడం , కాపీహక్కులు , తెవికీ మార్గదర్శకాల గూర్చి తెలుసుకోవలసిన అవసరం నాకున్నది. నేను తెవికీ లో అనేక రంగాలలో రచనలు చేయగలను. కానీ విధివిధానాలు స్పష్టంగా తెలుసుకోవాలని ఉంది.అందువలన తెవికీ బడిలో నన్ను చేర్చుకోండి.---- కె.వెంకటరమణ చర్చ 10:13, 12 సెప్టెంబర్ 2013 (UTC)
విధివిధాన పరిజ్ఞానము కొరకు నేను కూడ "వికీ బడి" లో చేరాలని వుంది. Bhaskaranaidu (చర్చ) 11:24, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీబడి శిక్షణ అనేది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా భావిస్తున్నాను. చాలా కాలం నుంచి తెవికీలో నిర్వహణ అనేది సమస్యగా మారింది. "కాసే చెట్లకే దెబ్బలు అన్నట్లు" నిర్వహణ చేసే వారికే చివాట్లు రివార్డులుగా లభిస్తున్నాయి. దాంతో నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదు! సభ్యులందరికీ నిబంధనలపై అవగాహన ఉంటే నిర్వహణ చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వికీశిక్షణ అనేది అందరూ ఆనందంగా స్వాగతించాల్సిన ఒక శిక్షణా కార్యక్రమం. అయితే ఈ అంతర్జాల తరగతులు ఎక్కడ నిర్వహిస్తారు? ఎలా నిర్వహిస్తారు? అనేది తెలిస్తే పూర్తిగా విశ్లేషించడానికి వీలవుతుంది. నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే దీన్ని తెవికీలోనే నిర్వహించాలి. ఛాట్ రూపంలో అయితే ఆ సమయంలో మనకు వేరే వ్యాపకాలుండవచ్చు. తెవికీ పేజీలోనే అక్షరరూపంలోనే వారానికి ఒక పాఠం చొప్పున రోజూ వివరించాలి. సభ్యుల అభిప్రాయాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే భవిష్యత్తులో చేరే సభ్యులకే కాకుండా ఇప్పటి సభ్యులకు ఏమైనా అనుమానాలువచ్చినప్పుడు మరోసారి ఆ పేజీని దర్శించడానికి వీలవుతుంది. దీనికి అదనంగా వీడియో ఉన్నా మంచిదే. కొన్ని సందర్భాలలో యానిమేషన్ చిత్రాలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి బాగా తోడ్పడతాయి. అలాగే "నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు" అనే విషయాన్ని చివరి పాఠంగా పెట్టారు, అసలు దాన్నే మొదటిపాఠంగా పెడితే బాగుంటుంది. క్రియాశీలకంగా ఉండే సభ్యులు చాలా వరకు నిర్వాహకులై ఉంటారు. కాబట్టి వారి ప్రధాన బాధ్యత అయిన నిర్వహణ ఎలా చేయాలి? నియమాలు ఎలా ఉపయోగించాలి? ప్రస్తుతమున్న నియమాలు ఏమిటి? ఒక నియమానికి మరో నియమానికి ఘర్షణ వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చూపించాలి? ప్రస్తుతం నిర్వహణ ఎలా ఉంది? దీనిలో లోటుపాట్లేమి? దీన్ని సరిదిద్ది భవిష్యత్తులో నిర్వహణ ఎలా మెరుగుపర్చాలి? నియమాలు స్పష్టంగా లేనప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి? తదితర విషయాలు ప్రారంభంలోనే తెలియపర్చి ఆ తర్వాత మీరు పాఠాలు ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మొదటి పాఠానికి ఎలాగూ రెండు వారాల సమయం అవసరమంటున్నారు కాబట్టి అంతకు ముందే నిర్వాహకత్వ బాధ్యతలు పాఠం ప్రారంభిస్తే సరిపోతుంది. ఒక పాఠానికి సంబంధించి వివరించేటప్పుడు ప్రస్తుత నిబంధనలు, ఆ విషయంపై ఇప్పటివరకు జరిగిన చర్చలు (ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ వెదకాల్సిఉంటుంది), చర్చలపై తీసుకున్న నిర్ణయాలు, మారిన పరిస్థితులకనుగుణంగా మళ్ళీ చేయాల్సిన మార్పులు-చేర్పులు, సోదర వికీలలో ఇవే అంశానికి సంబంధించి నియమాలు ఎలా ఉన్నాయి (పరిశీలనకు మాత్రమే), వికీ పురోవృద్ధితో పాటు మారాల్సిన నిబంధలు ఏమిటి? నియమాలు ఏ సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలా అనేక అంశాలు పాఠ్యాంశంలోకి తీసుకోవాలి. అన్నింటికంటే ముందుగా (నిర్వాహక బాధ్యతల తర్వాత) వికీ మూల నియమాలు ఏమిటి? వాటిని ఎలా వర్తింపజేయాలి? వాటికి భిన్నంగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటివి కూడా తొలిదశలోనే శిక్షణ ఇస్తే బాగుంటుంది. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తే సమీక్షించడానికి వీలవుతుంది. ఆ పిదప శిక్షణా కార్యక్రమ ఎజెండాను ఖరారుచేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:21, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నిర్వహణ పాఠం నుండి మొదలుపెట్టడానికి అభ్యంతరమేమీ లేదు. నేనింకా ఈ పాఠాలకు పూర్తిగా ప్రణాళిక వేసుకోలేదు. కాకపోతే వీటిలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలన్న విషయంపై స్థూలంగా కొన్ని ఆలోచనలున్నాయి. వీటిని పాఠ్యప్రణాళిక తయారుచేసుకొనే క్రమంలో మరింత పరిపుష్ఠం చేస్తాను. సూత్రప్రాయంగా వికీ గురించిన చర్చలు, సమావేశాలు వీలైనంతగా వికీలోనే జరగాలి, కానీ ఈ పాఠాలు కేవలం పాఠాలు మాత్రమే, వికీ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు కాబట్టి ఇది బయట జరిగినా పెద్ద ఇబ్బంది లేదు. అదీగాక వికీలో పొందుపరచి వ్రాయాలంటే ఎంతో కొంత ప్రామాణికత ఉండాలి. నియమనిబంధనలు మొదలైన విషయాలు ఇప్పటికే వికీలో ఏదో ఒక చోట ఉన్నవి (తెలుగులో కాకపోయినా) వీటికి నేను కొత్తగా జోడించే విషయాలేవీ లేవు. కాకపోతే నాకున్న అనుభవాలతో వీటిని సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. విష్ణు గారు వీటి ఆధారంగా కొన్ని చిన్న చిన్న వీడియోలు, బోధక వనరులు ప్రొఫెషనల్స్‌తో తయారు చేయించే ప్రయత్నం చేస్తానన్నారు. ఇవి వికీపీడియన్లకు బోధకాలుగా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. యూట్యూబు యుగంలో నిబంధనలు వ్రాతలో తెలుసుకొనే అలవాటు కొరవడినట్టుంది. నా ఆలోచన ప్రకారం ఈ పాఠాలు ప్రధానంగా పవర్‌పాయింట్ స్లైడ్లు, నా వ్యాఖ్యానంతో ఒక అంతర్జాలపు పాఠంగా కొనసాగుతాయి. ఈ క్రమంలో తయారైన విషయాన్నంతా (పాఠ్యం, స్లైడ్ల ఫీడిఎఫ్ ఫైలు, వీలైతే వీడియో కూడా) వికీపీడియాలో ఎక్కించగలను. వీటి ఆధారంగా కొన్ని బైట్ సైజ్ బోధనా వీడియోలు తరువాత తయారుచేయిస్తారు. నేను పాఠ్యపు ప్రణాళిక, సంబంధిత సమాచారం ముందస్తుగానే వికీలో పెట్టగలను కానీ, పైన చెప్పినట్టుగా నియమాల విషయంలో నేను వికీకి కొత్తగా అందించగలిగేది ఏమీ లేదు. ఏదైనా విషయం వివరించేటప్పుడు ఇప్పటిదాకా జరిగిన చర్చలు మొదలైనవి తప్పకుండా ప్రస్తావిస్తాను కానీ నిర్ణయాలు తీసుకోవటం వంటివి ఈ బడి పరిధిలోకి రావు. చర్చలు, పాఠాలు సంబంధించిన విషయాలే కానీ వీలైనంతగా వాటిని వేరుగా ఉంచితేనే మంచింది. వికీ పద్ధతులపై చర్చలు సాధారణ పద్ధతిలో రచ్చబండపై జరిగితేనే మంచిది. --వైజాసత్య (చర్చ) 04:52, 13 సెప్టెంబర్ 2013 (UTC)
మీ ఆలోచన ప్రకారము చేయండి. ఎలా చేసిననూ ఫలితం మాత్రం ప్రస్తుతం ఉన్న దాని కంటె మెరుగుపరితే చాలు. మీ వ్యాఖ్యప్రకారం చూస్తే తెవికీనే కాకుండా ఇతర వికీ నిబంధనలు కూడా తెలియజేసే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ముందుగానే ఇతర వికీల నియమాలు కేవలం పరిశీలనకే అని చెబితే బాగుంటుంది, లేనిచో రేపు ఏదైనా చర్చలో మీ పాఠాన్ని ఉదహరించే అవకాశమూ ఉంటుంది. ఆ నిబంధన తెవికీ నియమానికి విరుద్ధంగానూ ఉండవచ్చు. ఇదివరకు నేను చేసిన చర్చలలో ఆంగ్లవికీ నియమాలు కూడా తెలియజేశారు. తెవికీకి విరుద్ధంగా ఉన్న ఇతర వికీ నియమాలతో భవిషత్తులో ఇబ్బందులు రావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 13 సెప్టెంబర్ 2013 (UTC)
ఇకపై ఈ విషయం గురించిన చర్చ ఇక్కడ కొనసాగించగలరు --వైజాసత్య (చర్చ) 06:00, 14 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీలో Echo (Notifications) వ్యవస్థ అందుబాటు - మీ సహకారం

తెవికీలో Echo (Notifications) ఒక కొత్త ప్రకటనల వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కొత్త వ్యవస్థ సముదాయ సభ్యుల మధ్య పరస్పర సందేశాలను మరింత ఉన్నతంగా బట్వాడా చేయడానికి సహకరిస్తుంది. ఇది ఇప్పటికే ఆంగ్ల, మీడియా వికీ మరియు ఇతర పాశ్చాత్య వికీపీడియాలలో సమర్ధవంతంగా అమలు చేయబడింది. దీనిని భారతీయ భాషా వికీలలో (బహుశా ఆసియా అంతటిలోనూ అనుకుంటా) మొదటి సారి మన తెవికీ సముదాయానికి అందుబాటు చేయడానికి ఈ ప్రయత్నం. ఈ అధునాతన వ్యవస్థను తెవికీలోకి సెప్టెంబరు చివరన అమలు పరచడానికి దీనికి సంబందిత వికీమీడియా ఇంజనీరింగ్ జట్టు చాలా ఉత్సాహం చూపిస్తుంది. దీనికి మనందరి సహకారం అవసరం.

మనం అందించవలసిన సహాయం
  • ఈ క్రింది లంకెలలో ఇచ్చిన సిస్టం మెసేజులను అనువదించడం. అంతే.
  1. Echo ఎకో [1]
  2. Thanks ధన్యవాదాలు [2]
  3. Notifications సహాయ సూచిక [3]

మీరందరు మన తెవికీ అభివృధ్ధికై చేస్తున్న ఈ కార్యక్రమంలో చాలా చురుకుగా సహాయ సహకారాలందిస్తారని ఆశిస్తూ --విష్ణు (చర్చ)08:59, 18 సెప్టెంబర్ 2013 (UTC)

మంచి ప్రయత్నం. --అర్జున (చర్చ) 17:18, 19 సెప్టెంబర్ 2013 (UTC)
అనువాదం ప్రారంభించాను. కానీ ఇంతకు ముందు ప్రోగ్రాం లోని వికీపీడియా కు చెందిన తెలుగు భాషను అనువదించిన వైజాసత్య, అర్జునరావు లాంటి వారు ఈ ప్రధాన మూసల అనువాదం చేస్తే యూనిఫార్మిటీ ఉంటుందనుకుంతున్నాను.Rajasekhar1961 (చర్చ) 03:19, 20 సెప్టెంబర్ 2013 (UTC)
  • ఇప్పటికే వున్న అనువాదాల సముదాయంలో సరిపోయిన అనువాదం వుంటే సాఫ్ట్వేర్ సూచిస్తుంది కావున ఎవరైనా సరే అనువాదంలో పాల్గొనవచ్చు. Translatewiki.net లో ఖాతా ద్వారా ప్రవేశించి అనువాదాలు చేస్తే సరి. --అర్జున (చర్చ) 05:12, 20 సెప్టెంబర్ 2013 (UTC)

Tamil Wikipedia turns 10. We need your wishes

Andharukku Namaskaram :) This is Ravi from Tamil Wikipedia. We are celebrating our 10 years with an event in Chennai on 29th September. I invite you all to join us as it would be great to share our experiences and learn from each other. If you cannot make it to the event, please leave your best wishes for us here. --Ravidreams (చర్చ) 22:51, 19 సెప్టెంబర్ 2013 (UTC)

  • Ravidreams గారి ద్వారా తమిళ సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. పై లంకెలో రాద్దామంటే తమిళం కనిపిస్తోంది. అది నాకు రానందున విచారిస్తూ ఇక్కడే తెలుపుతున్నా శుభాకాంక్షలు. Through Ravidreams i express my best wishes to our Tamil friends. To write on page @ link above, it is in Tamil. I regret not able to follow it. so, i just expressing here my best wishes. Telugubhagavatam (చర్చ) 16:31, 21 సెప్టెంబర్ 2013 (UTC)

సైటునోటీసుల విషయమై

వికీపీడియాలో సైటు నోటీసులు ఎప్పతికప్పుడు తాజాకరిస్తున్నాను. అలానే మీడియావికీ:Anonnotice ను పునఃప్రారంభించాను. ఇక్కడ ఉండే సైటు నోటీసు ఖాతా తెరువని/లాగిన్ అవ్వని సందర్శకులకు కనిపిస్తుంది. అలానే సైటు నోటీసులో పాఠ్యం ఉంచడానికే ప్రయత్నించగలరు, బొమ్మలు పెట్టడం వల్ల అందంగా కనిపించినా కొన్ని దుష్ప్రభావాలున్నాయి. అలాగే పాఠ్యాన్ని మరింత అందంగా చూపించడం కోసం కొత్త సాంకేతికాలు తెలుసుకోవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 18:18, 21 సెప్టెంబర్ 2013 (UTC)

ఈశావాస్య ఉపనిషత్తు (Isavaasya upanishattu)

"ఈశావాస్య మిద్‌గం సర్వం" అనే మంత్రముతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు లేక శ్లోకాలు ఉన్నాయి. యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ విద్య" అంటారు.

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది. "ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే ఓం శాంతిః శాంతిః శాంతిః దేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

వివరణ: పరిపూర్ణం నుండి పరిపూర్ణం ఎలాపుడుతుంది? తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమే ఎలా మిగులుతుంది? అనే అనుమానాలు మనకు వస్తాయి. కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని చూడవచ్చు. ఒక దీపం నుండి ఎన్ని దీపాలను వెలిగించినా మొదటి దీపము అలాగే మిగతా దీపాలు కూడా సంపూర్ణప్రకాశమే కలిగి ఉంటాయి. అలానే విద్యాదానం విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇలానే భగవంతుని పరిపూర్ణత కు కూడా తీసివేయడం వలనో లేక ఇవ్వడం వలనో లోపం కలుగదు.

ఈ మంత్ర సారాంశం ఏమిటంటే దేవుడి నుండి ఉద్భవించడం వలన ఈ ప్రపంచం కూడా భగవంతుని అంశ లేక భగవంతునిచే నిండి ఉన్నదని.

వేదమంత్రాలన్నీ ఓం శాంతిః అంటూ ముగుస్తాయి. మూడు సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయంటే నిత్యజీవితములోని మూడు ఆటంకాల నుండి బయటపడుటకు. ఆ మూడు ఏమంటే

1.ఆద్యాత్మికం: శారీరక,మానసిక అనారోగ్యాలు మొదలగునవి 2.ఆదిభౌతికం: ఇతర జీవరాసులవలన, ఇతర మానవులవలన కలుగు బాధలు 3.ఆధిదైవికం: ప్రకృతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి.

ఈ మూడు రకాలైన బాధల నుండి తప్పించుకోవడానికి మూడు సార్లు శాంతి అని పలుకుతాము.

ఇక ఉపనిషత్తు మొదటిశ్లోకం: ౧. " ఓం ఈశా వాస్య మిద్గం సర్వం యత్కించ జగత్యాం జగత్

      తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం

అర్థం: జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి.. అలాంటి త్యాగబుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీఆశించకు.

వివరణ: నింపబడడం అంటే ముందు శాంతి మంత్రములో చెప్పుకున్నట్లుగా ఈ లోకం దేవుడి నుండి పుట్టింది కాబట్టి లోకం అంతా భవంతుడిమయమే. కాబట్టి నువ్వు కూడా అంటే మనం కూడా సర్వ లోకాన్నీ, లోకములోని అన్ని వస్తువులనూ ,జీవనిర్జీవ పదార్థాలను భగవంతుడిగానే చూడాలి. అంటే భగవంతుని సంపదగానే చూడాలి. అందువలన మన సంపదను లేక ధనాన్ని కూడా భగవంతుని సంపదగానే చూడాలి. అలాంటి త్యాగబుద్ధి మనకు ఉంటే ధనం ఉన్నా,పోయినా మనం బాధపడము. ఆనందముగా ఉండగలము.అలాగే ఎవరి సంపదనూ అంటే పరుల సంపదను కూడా ఆశించకూడదు.

రెండవ శ్లోకము: ౨. "కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ం సమాః ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లిప్యతే నరే అర్థం: ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు.కర్తవ్యాలు నిన్ను అంటవు.

వివరణ: లోకములో జీవించాలంటే పని చేసి తీరాలి.ఆ పని ఫలితం మంచైనా,చెడైనా కావచ్చు. ఆ ఫలితానికి మనము దాసులము. అంటే ఖచ్చితముగా ఫలితం ఉంటుంది. మరి ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముందు మొదటిశ్లోకము గమనిస్తే అంతా భగవంతుని సంపదే కాబట్టి మనము భగవంతుని కొరకే పనిచేయాలి. మన సంపద ,ఐశ్వర్యము భగవంతునికి చెందినదని భావించి అందుకు బాధ్యత వహించిన వ్యక్తిగా జీవితం గడపాలి. ఆ విధముగా మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తే ఆ పని ద్వారా కలిగే ప్రతిఫలం మనలను తాకదు. మనకు ఇంతకంటే మరో మార్గం లేదు. ఇలా పనిచేస్తూనే మనం నూరేళ్ళూ జీవించాలని ఆశించాలి. మూడవ శ్లోకం: ౩.అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః

అర్థం: రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.

వివరణ: మనకు తెలుసు రాక్షసులు అంటే ఇతరులను పీడించే స్వభావం లేక గుణాలు కలిగినవారని. అంటే తమ ఆనందం కోసం ఇతరులను చంపడానికైనా తయారుగాఉండేవారు. దీని ప్రకారం మన సమాజంలోనే మనం ఎంతోమంది రాక్షసుల మధ్య ఉన్నామని మనకు తెలుసు. ఇక ఈ శ్లోకం విషయానికి వస్తే ఆత్మహంతకులు అనగా ఎప్పుడూ శరీరసుఖాలే జీవితలక్ష్యాలుగా చేసుకొని దేవుడి గురించి లేక పరమాత్మను గురించి ఆలోచన చేయనివారు. వీరు రాక్షసులతో సమానం. వీరు చనిపోయినతర్వాత రాక్షసుల లోకాలు పొందుతారు అంటే తమ స్వభావం ప్రకారమే మళ్ళీ జన్మిస్తారు. అంటే మళ్ళీమళ్ళీ పుడుతూ,చస్తూ బాధలకు గురి అవుతుంటారు. గాఢమైన చీకటి అని ఎందుకన్నారంటే వీరు కన్నూమిన్నూ కానకుండా సంచరిస్తారు. చీకటిలోనే కదా మనం కూడా అలా కదిలేది.

నాల్గవ శ్లోకం: ౪.అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో న్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి

అర్థం: ఆత్మ కదలలేనిది,ఒక్కటే అయినది. మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దాన్ని పొందలేవు. అన్నిటికన్నా ముందు వెళ్తూనే అది స్థిరముగా ఉంటుంది. కదిలే వస్తువులు అన్నిటికన్నా ఆత్మ వేగవంతమైనది. ఆత్మ స్థిరముగా ఉండటం వలన ప్రాణం అన్నిటితో పనిచేయిస్తుంది.

వివరణ: ఈ శ్లోకం లో ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలు ఉన్నాయి. చలిస్తుంది అనీ చలనం లేనిదనీ, స్థిరము అనీ అన్నిటికన్నా వేగవంతం అనీ వ్యతిరేకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కదలాలన్నా, పనిచేయాలన్నా ఒక స్థలం ఉండాలి. విశ్వమంతా ఆత్మ ఒకటే ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు ఆత్మ ఎక్కడకు కదలగలదు? అందుకే ఆత్మ చలనం లేనిది అన్నారు.

మనం ఒక వస్తువును అనుకొన్నప్పుడు మన మనసు ఆ వస్తువు రూపాన్ని ఊహించుకొంటుంది లేక ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తుంది. మన శరీరం ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళిపోతుంది. కాని ఆత్మ ఒక్కటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉండడం వలన మనసు,శరీరం అన్నీ అందులోనివే కావడం వలన మనసు ఆ వస్తువు వద్దకు వెళ్ళక ముందే అక్కడ ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ స్థిరముగా ఉంటూనే మనసు కన్నా కూడా వేగవంతం అని చెప్పబడింది.

ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు. ఎందుకంటే ఇంద్రియాలు ( కన్ను,ముక్కు,చెవి,కాళ్ళు,చేతులు, చర్మము, నాలుక మొదలగునవి) బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి. ఏ వస్తువు కదలాలన్నా, కదలని వస్తువు ఒకటి ఆధారముగా ఉండాలి. బస్సు కదలాలంటే కదలని రోడ్డు, చలనచిత్రం చూడాలంటే కదలని తెర ఉండాలి. ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలను లేక ప్రపంచముతో పని చేయిస్తుంది. ఈ శ్లోకం యొక్క వివరణ ఇది.

ఐదవ శ్లోకం: ౫.తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః

అర్థం: అది చలిస్తుంది మరియు చలించదు. దూరంగా ఉంటుంది మరియు చాలా దగ్గరగా ఉంటుంది. అది అన్నిటి లోపలా మరియు బయట కూడా ఉంటుంది.

వివరణ: ఈ శ్లోకం లో కూడా ముందటి శ్లోకంలో లాగా వ్యతిరేకాలే కనిపిస్తున్నాయి. ముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా ఆత్మ ఇంద్రియాలకు అందదు. చలిస్తుంది,చలించదు అనే వాటికి ముందు శ్లోకములో అర్థం చెప్పుకున్నాము. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టి అందరికీ అది చాలా దగ్గరగా ఉంది. కాని మనం ఆ విషయం అనుభవపూర్వకముగా తెలుసుకోనప్పుడు అది మనకు దూరంగా ఉందనే కదా అర్థం. ఆత్మ రూపములో అది మనలోనే ఉంది, అలాగే పరమాత్మ రూపంలో మన బయట కూడా ఉంది అన్న విషయం మనకు తెలుసు కదా.

ఆరవ శ్లోకం: ౬.యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే అర్థం: ఎవరైతే ఆని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు.

ఏడవ శ్లోకం: ౭.యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః అర్థం: ఆత్మే అన్ని జీవరాసులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా ఉంటాయి?

వివరణ: పై 6,7 శ్లోకాలు ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడి లేక ఆత్మానుభూతి పొందిన వాడి గురించి చెబుతున్నాయి. మనకు ఇష్టం లేనిదాన్ని మనం ద్వేషిస్తాం. విపరీత ఆకర్షణ వలన మనకు ఒక వస్తువుపై మోహం కలుగుతుంది. మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది. కాని ఆత్మానుభూతి పొందిన వ్యక్తి విశ్వాన్ని అంతటినీ ఆత్మస్వరూపంగా లేక భగవంతుడిగా చూస్తాడు. అలాంటప్పుడు అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసు పోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే ఉంటుంది. అందువలన బాధ గాని, ఆకర్షణ లేక మోహం కాని, ద్వేషం కాని ఎలా ఉంటాయి. ఇవన్నీ ఆత్మానుభూతి పొందిన వాడి లక్షణాలు.

ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ముందులానే ఉంటుంది. కాని చూసేవాడి మనసును బట్టి వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పు అంతా చూసేవాడిని బట్టే. అలానే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి రెండు కొమ్ములు ఏమీ రావు. అతని మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది. ఎనిమిదవ శ్లోకం: ౮.స పర్యాగాచ్చుక్ర మకాయవ్రణమస్నావిరగ్‌ం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః అర్థం: అతడు(అంటే ఆత్మానుభూతి పొందినవాడు) అన్నిటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు.మనసును వశం చేసుకొన్నవాడు.మొత్తం జ్ఞానాన్నీ తనలో ఉంచుకొన్నవాడు.ఎవరికీ చెందనివాడు.అన్నివేళలా అన్ని వస్తువుల నిజమైన నైజాన్ని తెలుసుకొన్నవాడు.ఉజ్వలమైన శరీరం లేని,కండలు లేని,పాపం లేని పరిపూర్ణమైన,స్వచ్చమైన దేవుడిని అతడు చేరుకొంటాడు.

వివరణ: ఈ శ్లోకంలో ఆత్మానుభూతి పొందిన వాడి అనుభవం చెప్పబడింది. సాధారణ మానవులమైన మనం ఏదైనా వస్తువును చూడడం తో ఆగిపోతాం. కాని అతడు ఒక వస్తువును చూడడమే కాకుండా దానికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోగలడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు,అతడు చెప్పినట్లు అతని మనసు ఆడుతుంది. మనం ఎంత నేర్చుకొన్నా ఇంకా నేర్చుకోవాలనే కోరికతో తృప్తిలేకుండా ఉంటాము. కాని ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అందుకే ఏది తెలుసుకొంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే ఆత్మ అని "కేనోపనిషత్తు" లో కూడా చెప్పబడింది. ఎవరికీ చెందనివాడంటే అతడు కేవలం ఆత్మ లేక భగవంతుడిపైనే ఆధారపడిఉంటాడు కాబట్టి మిగతా జీవరాసులపై కాదు. అతడు వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగనివాడు. భగవంతుడు నిరాకారుడు కాబట్టి కేవలం అనుభూతి ద్వారా మాత్రమే అతనిని తెలుసుకోగలం కాబట్టి అతడు కండలు లేనివాడని,శరీరం లేనివాడని చెప్పబడింది. పాపంలేకపోవడం, తేజోమయం, స్వచ్చమైనది అనే గుణాలు భగవంతుడి గుణాలుగా చెప్పబడినవి.

తొమ్మిదవ శ్లోకం: ౯.అంధం తమః ప్రవిశన్తి యేవిద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ంరతాః అర్థం: ఎవరు కర్మల(పనుల)లో పాల్గొంటారో వారు చిమ్మచీకటిలోనూ, అలాగే జ్ఞానాన్ని అవలంబిస్తారో వారు అంతకన్నా కారుచీకటిలో మునిగిపోతారు.

వివరణ: ఈ శ్లోకం చాలా విశేషార్థం కలిగిఉంది. ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ ఉంటారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే అర్హత లేకుండా డాంబికం కోసం అంటే లోకం దృష్టిలో పడడం కోసం,లోకం తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటి కోసం ప్రయత్నిస్తారో(అంటే మనస్పూర్థిగా కాకుండా) వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు అని అర్థం. దీని గురించి అందరికీ తెలుసు, ఎక్కువ వివరణ అవసరం లేదని భావిస్తున్నాను.

పదవ శ్లోకం: ౧౦.అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే అర్థం: ఆత్మ విద్య ద్వారా ఒక ఫలితం, కర్మల(పనుల) ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. మాకు దానిని వివరించిన మహాత్ములు ఇలా చెప్పారు.

పదకొండవ శ్లోకం: ౧౧.విద్యాం చావిద్యాం చ య స్తద్వేదో భయగ్‌ం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతశ్నుతే

అర్థం: జ్ఞానం(అంటే భగవంతుని తెల్సుకొనే విద్య), కర్మలు(పనులు) రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్త్వాన్ని పొందుతాడు.

వివరణ: ఈ శ్లోకంలో తము తెలుసుకొన్నామని చెప్పుకోకుండా తమ గురువుల ద్వారా తెలుసుకొన్నామని చెప్పుకుంటున్నారు. మనం బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. కాని ఆ పనులు మాత్రమే చేసుకుంటూ కూర్చుంటే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి(ఉపనిషత్తు యొక్క మొదటి శ్లోకం చూడండి). ధ్యానం మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం,పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అని చెప్పబడింది.

పన్నెండవ శ్లోకం: ౧౨.అంధం తమః ప్రవిశన్తి యే సంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్‌ం రతాః అర్థం: దేవుడిని నిరాకారము గా పూజించేవారు కటిక చీకటిలోనూ, ఆకారం ఉన్నవాడిగా పూజించేవాడు ఇంకా ఘోరచీకటిలోనూ మునిగిపోతారు.

పదమూడవ శ్లోకం: ౧౩.అన్యదేవాహుః సంభవాదన్యదాహురసమ్భవాత్ ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే అర్థం: మాకు దానిని వివరించిన మహాత్ములు విన్నది ఏమంటే " సాకార ఉపాసన వలన ఒక ఫలితం,నిరాకార ఉపాసన వలన మరోరకమైన ఫలితం లభిస్తాయి" అని.

పదునాల్గవ శ్లోకం: ౧౪.సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్‌ం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే అర్థం: సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెంటినీ కలిపి గ్రహించినవాడు సాకారోపాసన వలన మరణాన్ని దాటి, నిరాకారోపాసన వలన అమరత్వం పొందుతాడు.

వివరణ: మనకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి మన జ్ఞానం రూపాన్ని,గుణాలను దాటిపోవాలంటే కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో కలిగే కష్టం ఇది. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము. అందువలన మనలాంటి సాధారణజీవులకు ఇది చీకటిలో ఉన్నట్లే లెక్క. అలాగే సాకారఉపాసన అంటే రాముడిగానో,శివుడిగానో పూజించడం. ఇలా పూజించాలంటే అన్ని దేవుళ్ళరూపాలు ఒకే పరమాత్మ అని గ్రహించి ఉండాలి. లేకుంటే "దశావతారం" చిత్రంలో రాజుల కాలం నాటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం,మూఢభక్తి లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకని ఇది ఇంకా చీకటిలో ఉండడం అన్నమాట. కాబట్టి రెండింటినీ కలిపి మనం ఆత్మానుభూతి పొందాలనేది ఈ శ్లోకాల అర్థం. అది ఎలా అనేది తర్వాతి శ్లోకాలలో చూస్తాము. పదహైదవ శ్లోకం: ౧౫. హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖం తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే

అర్థం: సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు.

వివరణ:ఈ శ్లోకం మన ఊహకు కూడా అందని దాన్ని గురించి తెలుపుతోంది. అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి తోడ్కొని వెళ్ళమని ప్రార్థన మనకు తెలుసు. ధ్యానం,భక్తి మొదలగు వాటివలన భగవత్‌దర్శనం కలుగుతుంది. అంటే వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని సత్యం అనేది వెలుగుచీకట్లకు,జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది. అంటే ఆ తేజస్సును అంటే వెలుగును కూడా దాటిపోవాలి అనే విషయం ఈ శ్లోకం లో తెలుస్తోంది. ఆ తేజస్సునే ఇందులో సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉన్నదని చెప్పబడింది."సత్యనిష్ఠుడనైన నేను" అని ఎందుకు అంటున్నారంటే తన అర్హతను తెలిజేయడం జరుగుతోంది.నిరాకార,నిర్గుణమైన సత్యం ను అనుభూతి పొందడానికి ప్రార్థించడం ఇక్కడ జరుగుతోంది.

పదహారవ శ్లోకం: ౧౬. పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యో సావసౌ పురుషః సోహమస్మి

అర్థం:సకల జీవరాసులను పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు. అన్నిటినీ పాలించే ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ తేజస్సును కుదించుకో. కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని నీ అనుగ్రహం తో నేను చూస్తున్నాను. ఆ సూర్యునిలో ఉన్నది "నేనే".

వివరణ:ఈ శ్లోకం లో ఋషి తను దర్శించినది చెప్పినాడు. భగవత్కృపతో దర్శిచి ఆ సత్యమైన పదార్థం "నేను" అని కనుగొన్నాడు. ఇక్కడ "నేను" అని సూచించబడ్డది మనం మామూలు అర్థంలో తీసుకోకూడదు. ఈ "నేను" అన్నది ఏంటో నాకు( బ్లాగు రచయిత) చెప్పడానికి అర్హత కానీ, అనుభవపూర్వక జ్ఞానం కానీ లేవు. కానీ ఉపనిషత్తు ప్రకారం ఈ "నేను" అనేది ముందటి శ్లోకాలలో చెప్పబడిన "ఒకే వస్తువు". ఇంతకు మించి ఈ బ్లాగు రచయిత ఏమీ చెప్పలేడు. ఈ స్థితి అత్యున్నత స్థితి, భగవంతుడి స్థితి అని మాత్రం చెప్పగలను.

పదిహేడవ శ్లోకం: ౧౭. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరం ఓం(3) క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర

అర్థం:ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది.ఈ శరీరప్రాణం మరణంలేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా! చేసినవాటిని విచారణ చేయి,విచారణ చేయి.

వివరణ: ఈ శ్లోకం ఒక "స్వయం సూచన" (Self suggestion) లేక "స్వయం ప్రేరణ"(Self Motivation) మంత్రం లాంటిది.నిత్యజీవితములోనైనా సరే, ఆధ్యాత్మిక జీవితములోనైనా సరే ఒక లక్ష్యము ఎంచుకొన్నప్పుడు ఆ లక్ష్యము నుండి జారకుండా ఉండడానికి మన మనసుకు మనమే గుర్తుచేసుకోవడం ఇది.మహారాజైనా, బిక్షగాడైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. దీనిని గుర్తుచేస్తూ ఒక సాధకునికి చెప్తున్న మంత్రం ఇది.

పద్దెనిమిదవ శ్లోకం: ౧౮. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ

అర్థం:ఓ అగ్నిదేవా! మేము చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ప్రారబ్ధకర్మలను అనుభవించడానికి మమ్మల్ని అనుభవమార్గంలో తీసుకెళ్ళు. మా ఘోరమైన తప్పుల నుండి మమ్మల్ని విముక్తున్ని చేయి. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం.

వివరణ: అనుభవమార్గం అంటే "ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, క్రొత్తపనులతో అంటే చేయబోయేపనుల ఫలితం మాకు అంటకుండా చేయి" అని అర్థం. అంటే చేయబోయే పనులు నిష్కామంగా చేసేట్టు చేయి అని అర్థం.

ఈ శ్లోకం తో "ఈశావాస్య ఉపనిషత్తు" సంపూర్ణమౌతుంది.

శాంతి మంత్రం:

"ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిఃదేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.