అనుష్క శెట్టి: కూర్పుల మధ్య తేడాలు
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) చి వర్గం:ప్రముఖ మహిళలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
| homepage = |
| homepage = |
||
}} |
}} |
||
'''అనుష్క శెట్టి''' ([[తుళు]]: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. [[బెంగుళూరు]] నగరానికి చెందిన యోగా శిక్షకురాలు [[అనూష్క]] అసలు పేరు '''స్వీటీ శెట్టి'''. [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[నాగార్జున]] నటించిన [[సూపర్]] చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె [[విక్రమార్కుడు]], [[లక్ష్యం]] వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో |
'''అనుష్క శెట్టి''' ([[తుళు]]: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. [[బెంగుళూరు]] నగరానికి చెందిన యోగా శిక్షకురాలు [[అనూష్క]] అసలు పేరు '''స్వీటీ శెట్టి'''. [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[నాగార్జున]] నటించిన [[సూపర్]] చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె [[విక్రమార్కుడు]], [[లక్ష్యం]] వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి{{fact}} అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది. |
||
== వ్యక్తిగత జీవితం == |
== వ్యక్తిగత జీవితం == |
07:40, 15 అక్టోబరు 2013 నాటి కూర్పు
అనుష్క శెట్టి | |
జన్మ నామం | స్వీటి శెట్టి |
జననం | మంగుళూరు, కర్ణాటక | 1981 నవంబరు 7
క్రియాశీలక సంవత్సరాలు | 2005—ప్రస్తుతం |
అనుష్క శెట్టి (తుళు: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి[ఆధారం చూపాలి] అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.
వ్యక్తిగత జీవితం
మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.
అరుంధతి
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనె తనలొని నటీని ఆవిష్కరింఛింది