దాడిచిలుక వీర గౌరీశంకర రావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q5208079
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 42: పంక్తి 42:
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

13:59, 15 అక్టోబరు 2013 నాటి కూర్పు

దాడిచిలుక వీర గౌరీశంకర రావు

పదవీ కాలం
1999 -2004
ముందు వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్
తరువాత వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్
నియోజకవర్గం పార్వతీపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1968-04-30) 1968 ఏప్రిల్ 30 (వయసు 55)
Palika valasa, విజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి స్వర్ణలత

దాడిచిలుక వీర గౌరీశంకర రావు (Dadichiluka Veera Gouri Sankara Rao (జ: ఏప్రిల్ 30, 1968), డి. శంకర్రావు లేదా డి.వి.జి. శంకర్రావు, ప్రముఖ మత్తుమందు వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు. ఇతడు తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మరియు లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

తొలినాళ్లు

శంకర్రావు ఆదివాసునిగా ఏప్రిల్ 30, 1968 తేదీన పలికవలస గ్రామంలో జన్మించాడు. ఇతడు వైద్యశాస్త్రంలో పట్టాపొంది; తర్వాత మత్తుమందు (అనగా Anesthesiology) లో ఎం.డి. పూర్తిచేశాడు. రాజకీయాలలోకి ప్రవేశించి; జిల్లా తెలుగుదేశం పార్టీ లో చేరి; తర్వాత ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నుకోబడ్డాడు.

రాజకీయ జీవితం

ఇతడు 1999 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ సభ్యునిగా పార్వతీపురం లోకసభ నియోజకవర్గం నుండి పోటీచేసాడు. అందులో తన సమీప ప్రత్యర్ధి వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ మీద గెలుపొందాడు. లోకసభలో శ్రామికుల సంక్షేమానికి చెందిన కమిటీ సభ్యునిగా వ్యవహరించాడు. తర్వాత 2004 జరిగిన ఎన్నికలలో కిషోర్‌చంద్ర దేవ్ మీదనే పరాజయం పాలయ్యాడు.[1]

వ్యక్తిగత వివరాలు

ఇతడు స్వర్ణలతను వివాహం చేసుకున్నాడు. తీరికవేళల్లో పద్యరచన ప్రవృత్తిగా చేసుకున్నాడు. ఇతడు రచించిన ఆశాజీవులు ప్రచురించబడినది.

మూలాలు