టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 11: పంక్తి 11:
==బాల్యం==
==బాల్యం==
టిప్పూ సుల్తాను [[కోలార్]] జిల్లా దేవనహల్లిలో జన్మించాడు. ఇది [[బెంగళూరు]]కు 45 మైళ్ళ దూరంలో వుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా [[కడప]] కోట [[గవర్నరు]] [[మొయినుద్దీన్]] కుమార్తె.
టిప్పూ సుల్తాను [[కోలార్]] జిల్లా దేవనహల్లిలో జన్మించాడు. ఇది [[బెంగళూరు]]కు 45 మైళ్ళ దూరంలో వుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా [[కడప]] కోట [[గవర్నరు]] [[మొయినుద్దీన్]] కుమార్తె.
టిప్పూ సుల్తాను November 20 1950 lo janminchadu


== సైనిక బాధ్యత మొదలు ==
== సైనిక బాధ్యత మొదలు ==

12:01, 13 నవంబరు 2013 నాటి కూర్పు

టిప్పు సుల్తాను ముఖచిత్రం, 1792

టిప్పూ సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు), మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం (నవంబర్ 20, 1750, దేవనహల్లిమే 4, 1799, శ్రీరంగపట్నం), హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.[1].బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగుళూరు ఒప్పందము) తో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు. మూడవ మైసూరు యుద్ధం మరియు నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, 1799న శ్రీరంగపట్టణంను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.

బాల్యం

టిప్పూ సుల్తాను కోలార్ జిల్లా దేవనహల్లిలో జన్మించాడు. ఇది బెంగళూరుకు 45 మైళ్ళ దూరంలో వుంది. అతని తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించెడివాడు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు మొయినుద్దీన్ కుమార్తె. టిప్పూ సుల్తాను November 20 1950 lo janminchadu

సైనిక బాధ్యత మొదలు

టిప్పూ సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలిచే నియమించబడ్డ ఫ్రెంచ్ అధికారుల వద్ద యుద్ధవిద్యలు అభ్యసించెను. 1766లో తన పదహేనవ యేట తన తండ్రితో కలసి మొదటి మైసూరు యుద్ధంలో పాల్గొన్నాడు. తన పదహారవ యేట జరిగిన యుద్ధాలలో ఆశ్వికదళంకు సారధ్యం వహించాడు. 1775-1779 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.

రాకెట్ల ఉపయోగం

ఇంగ్లీషు వారిపై రాకెట్లను ప్రయోగించిన టిప్పు సుల్తాన్ రాకెట్ బ్రిగేడ్

1792, లో లోహపు కవచాలు గల రాకెట్లను (తగ్రఖ్) టిప్పూ సుల్తాన్ తన సైనికాదళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాలలో ప్రముఖమైన మైసూరు యుద్ధాలు లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు. వీటి గురించి తెలుసుకొన్న బ్రిటిష్ వారు, తరువాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.[2]

ఇతర విశేషాలు

మైసూరు బెబ్బులి టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన ఖడ్గం పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని ఆర్కాట్ నవాబ్ కు బహూకరించాడు. అటునుండి అది లండన్ చేరింది. 2004లో జరిగిన వేలంలో భారతీయ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్య దానిని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ 1799 లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకోవడం జరిగినది.

టిప్పు సుల్తాన్ కాలపు ముఖ్య ప్రదేశాలు

మూలాలు

  1. Brittlebank, Kate. Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184. Oxford University Press.
  2. Stephen Leslie (1887) Dictionary of National Biography, Vol.XII, p.9, Macmillan & Co., New York Congreve, Sir William.