పారుపల్లి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) +వర్గం:తెలుగువారిలో సంగీతకారులు; +వర్గం:సంగీత దర్శకులు (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]] |
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]] |
||
[[వర్గం:సంగీత దర్శకులు]] |
[[వర్గం:సంగీత దర్శకులు]] |
||
[[వర్గం:తెలుగు సినిమా నటులు]] |
09:33, 3 జనవరి 2014 నాటి కూర్పు
స్త్రీ పాత్రధారి, సంగీత విద్యాంసుడైన పారుపల్లి సుబ్బారావుగారు కృష్ణా జిల్లా శ్రీకాకుళం (విజయవాడ) లో 1897లో జన్మించారు.
నట ప్రస్థానం
1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించారు.స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ , పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోను, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించారు.సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషం వీరి నటనా వైదుష్యానికి పరాకాష్ట.
నటించిన పాత్రలు
- విమల (రసపుత్ర విజయం)
- రాముడు (లవకుశ)
- సావిత్రి
- లీలావతి
- రాధ
- సుకన్య
- కైక
- చంద్రమతి
- రుక్మిణి
- రత్నాంగి
- కమలాంబ
- దుర్యోధనుడు
- రామదాసు
మూలాలు
- పారుపల్లి సుబ్బారావు , నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 660.