"వైఖానసం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,559 bytes added ,  7 సంవత్సరాల క్రితం
చి
వీరెక్కువగా తెలుగు మాట్లాడుతారు. అరవం వారు కూడా తెలుగు లిపిని చదవగలుగుతారు.
==మత సిద్ధాంతం==
వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషి''విఖనసుడు'' మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, మరియు భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం, మరియు మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు.
వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు.
విష్ణువు యొక్క ఐదు రూపాలను వీరు కొలుసారు -
# విష్ణువు - సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
# పురుషుడు - జీవితం యొక్క సూత్రము
# సత్యము - దైవం యొక్క మారని అంశం
# అచ్యుతుడు - మార్పు చెందని వాడు
# అనిరుద్ధుడు - ఎన్నటికీ తరగని వాడు
 
==మూలములు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/991322" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ