కంచె (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంచె (సినిమా)
Love is war
దర్శకత్వంజాగర్లమూడి రాధాకృష్ణ
రచనసాయిమాధవ్ బుర్రా
(సంభాషణలు)
నిర్మాతసాయిబాబు జాగర్లమూడి
వై. రాజీవ్ రెడ్డి
తారాగణంవరుణ్ తేజ్
ప్రగ్యా జైస్వాల్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుసూరజ్ జగ్‌తప్
రామకృష్ణ అర్రం
సంగీతంచిరంతన్ భట్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2015 అక్టోబరు 22 (2015-10-22)
సినిమా నిడివి
169 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్19 crore (US$2.4 million)

కంచె 2015 అక్టోబరు 22 న విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ చిత్ర కథ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఇది. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై వేల మంది మరణించి, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడి, అరవై వేలమంది బందీలుగా చిక్కారన్న సత్యాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన సినిమా ఇది.[2] 2015 ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రం విభిన్నంగా ఉండి ఆకట్టుకున్నది.[3]

కథ[మార్చు]

రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ- యుద్ధానికి ముందు కాలంలోనూ - రెండు కాలాలలో నడిచే రెండు విడివిడి కథల సంపుటి ఇది. 1939 లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో బ్రిటన్ తరపున పాల్గొనేందుకు రాయల్ ఇండియన్ ఆర్మీలో చేరి ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) కూడా వెళ్తాడు. మొన్నటి వరకూ ఇదే యుద్ధంలో జర్మనీ, జపాన్ లతో కలిసి మిగిలిన దేశాలకి (మిత్ర పక్షాలు) వ్యతిరేకంగా యాక్సిస్ దేశంగా వున్న ఇటలీ, ఆ కూటమి నుంచి విడిపోయి మిత్రపక్షాల వైపు చేరుతుంది. దీంతో జర్మన్ నాజీలు హిట్లర్ ఆదేశాలతో ఇటలీ పనిబట్టాలని చూస్తూంటారు. ఆ జర్మనీ- ఇటలీ సరిహద్దులో ఇటలీ తరపున యుద్ధం చేస్తున్న దళంలో సైనికుడుగా హరిబాబు వుంటాడు. ఇతడి నేస్తంగా దాసు (అవసరాల శ్రీనివాస్) ఉంటాడు. ఇతను అతి భయస్థుడు, పిరికివాడు కూడా. ఇదే దళంలో మరో తెలుగు వాడైన ఈశ్వర్ (నికితిన్ ధీర్) అనే కల్నల్ ఉంటాడు. వీళ్ళందరికీ బ్రిటిష్ సైనికాధికారి సారథ్యం వహిస్తూంటాడు.

అయితే హరిబాబుకీ, ఈశ్వర్‌కీ పడదు. పాత పగలతో బద్ధ శత్రువుల్లా వుంటారు. దీనికి కారణాల్ని వెల్లడిస్తూ ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది- 1936 లో మద్రాసులో హరిబాబు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, అదే కాలేజీలో చదివే సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)తో పరిచయం ప్రేమా ఏర్పడతాయి. సీతాదేవి రాచకొండ సంస్థానానికి చెందిన జమీందారు (అనూప్ పురీ) వారసురాలు. ఆ దేవరకొండ గ్రామంలో క్షురకుడి (గొల్లపూడి మారుతీరావు) మనవడు హరిబాబు. వీళ్ళిద్దరి ప్రేమ సీత అన్న ఈశ్వర్‌కి నచ్చదు. అతను కులాల అంతరాల్ని తెరపైకి తెస్తాడు. సీతాదేవికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ఈశ్వర్. నిమ్నకులస్థుడైన హరిబాబుని అడ్డు తొలగించుకునేందుకు తండ్రి చెప్పిన పథకంతో, వూళ్ళో కులఘర్షణలు రేకెత్తిస్తాడు. ఆ ఘర్షణల్లో హరిబాబుని చంపేస్తే అది ఆ ఘర్షణల మీదికి పోతుందని ఆలోచన. ఘర్షణలతో ఊరు రెండుగా విడిపోతుంది. నిమ్న కులస్థుల ఇళ్ళకీ, ఉన్నత కులస్థుల ఇళ్ళకీ మధ్య కంచె కట్టేస్తారు. అలా హరిబాబు మీద కూడా దాడి చేయడంతో అతడు సీతాదేవి ఇంటికే వచ్చి, అందరి ముందూ తాళి కట్టి ఆమెని తీసికెళ్ళి పోతాడు. దీంతో ఆగ్రహించి హీరోని చంపేసేందుకు వెళ్ళిన ఈశ్వర్‌ని, సీతాదేవి అడ్డుకోవడంతో ఆమెని తోసేస్తాడు. ఆమె ఇనుప చువ్వ మీద పడి కడుపులో గాయంతో విలవిల్లాడుతుంది.

ఒక పక్క ఈ ప్రేమకథ అంతకంతకీ విషమంగా మారుతుంటే, దీనికి విరుద్ధంగా ప్రస్తుత యుద్ధకథ అనేక మలుపులు తిరుగుతూ సాగుతూంటుంది.

అకస్మాత్తుగా జర్మన్లు వైమానిక దళంతో దాడి చేసేసరికి వాళ్ళ ధాటికి తట్టుకోలేక లొంగిపోతుంది హరిబాబు వున్న దళం. హరిబాబూ దాసూ దాక్కుని ఆ తతంగం గమనిస్తూంటారు. జెనీవా ఒప్పందం ప్రకారం లొంగిపోయిన శత్రుదేశపు సైనికులపై ఏ దురాగతాలకీ పాల్పడకూడదు. కానీ ఇక్కడ చూస్తే ఈ జర్మన్లు ఆ ఒప్పందాన్ని గౌరవించేలాలేరు. మాట తేడా వచ్చిందని కళ్ళముందే లొంగిపోయిన కొందరు సైనికుల్ని కాల్చేశారు. ఓ పదిమందిని సజీవంగా పట్టుకెళ్ళారు. వాళ్ళల్లో బ్రిటిష్ సైనికాధికారితో బాటు, ఈశ్వర్ కూడా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని హరిబాబు ఒక సాహసోపేత ఆపరేషన్‌కి నడుం బిగిస్తాడు. ఆ జర్మన్ దళం మీద ఎటాక్ చేసి తమ వాళ్ళని విడిపించుకునే ఆపరేషన్. ఆ లక్ష్యంతో తన దళంతో శత్రుదేశంలోకి ప్రవేశించినప్పుడు, అక్కడా జర్మన్ దళాధికారి బృందం యూదు కుటుంబాన్ని హతమారుస్తూంటారు. జర్మన్ యువకుడు, యూదు యువతీ పెళ్లి చేసుకుంటే పుట్టిన ‘చెడు రక్తపు’ ఆర్నెలల పసిపాపని చంపెయ్యడానికి సిద్ధమవుతారు. ఇక్కడ హరిబాబు లక్ష్యం బందీలుగా వున్న తన దళాన్ని విడిపించుకోవడమే అయినప్పటికీ, కళ్ళ ముందు పసిపాపతో జరుగుతున్న అకృత్యాన్ని సహించలేకపోతాడు. తన వూళ్ళో తనకి జరిగినట్టే ఇక్కడ కూడా జాతి రక్తమంటూ రాక్షసత్వం జడలు విప్పుకుంటోంది. ఇక సాహసంతో దాడి చేసి ముందు ఆ పసిపిల్లనీ, యూదుకుటుంబాన్నీ విడిపించుకుని పారిపోతాడు. జర్మన్లు వెంటపడతారు. ఒక శిథిల భవనంలో దాక్కున్నప్పుడు జర్మన్లు దాడి చేస్తారు. వాళ్ళ వాహనంలోనే బందీలుగా వున్న హీరో దళ సభ్యుల్లోంచి ఈశ్వర్ తనకి తానే తప్పించుకుని పోరాటం చేయడం మొదలెడతాడు. పసిపిల్లని కాపాడుకుంటూ హరిబాబు కూడా జర్మన్ల మీద దాడి చేసి తన దళాన్ని విడిపించుకుని, ఒక నదిని దాటేందుకు ప్రయత్నిస్తాడు. నది దగ్గర తిష్టవేసిన జర్మన్ దళాల మీదికి తెగించి దాడికి పోతాడు.

ఇలా ఓ యుద్ధ కథ, ఇంకో ప్రేమ కథా విడివిడిగా సాగుతూ, ముగింపులో కలిసిపోయి ఒకటవుతాయి. రైలులో హరిబాబు మృతదేహంతో వూరికి చేరుకుంటాడు ఈశ్వర్. ప్రజల కన్నీళ్ళ మధ్య సీతాదేవి సమాధి పక్కనే హరిబాబుని సమాధి చేస్తారు. ఇలా పూర్వ కథతో వచ్చి ప్రత్యక్ష కథ కలుస్తుంది.[2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, హిందీ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని పాటలు:

  • ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమోఅటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో
  • విద్వేషం పాలించే దేశం ఉంటుందా
  • భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో..

విశేషాలు[మార్చు]

  • ఈ సినిమా నిర్మాణం 19 కోట్ల రూపాయల బడ్జెట్టుతో, 55 రోజుల్లో పూర్తి చేశారు.

విడుదల[మార్చు]

ఈ చిత్రం 2015 అక్టోబరు 22న విడుదలైనది.[4]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Kanche Story Line". moviearts.in. 2015-10-22. Retrieved 2015-10-22.[permanent dead link]
  2. 2.0 2.1 సికిందర్. "గ్లోకల్ వాస్తవికత - కంచె". సినిమా స్క్రిప్ట్ & రివ్యూ. Archived from the original on 1 మే 2016. Retrieved 6 May 2018.
  3. "Unexpected response for first teaser". TNP LIVE. Hyderabad, India. 15 August 2015.
  4. "'Kanche' Trailer: Varun Tej is convincing in Krish's World War 2 drama"
  5. "63rd National Film Awards: Complete List of Winners". The Indian Express. 28 March 2016. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 28 March 2016.

బయటి లంకెలు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు