స్లట్ వాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏప్రిల్ 3, 2011 న ఒనిటోరియో లో స్లట్ వాక్ చేస్తున్న మహిళలు

స్లట్ వాక్ (బేషర్మీ మోర్చా) (Slut Walk/Besharmi Morcha) అనేది ఢిల్లీలో జూలై 31 న, ఉమాంగ్ శభార్వాల్ ఆధ్వర్యంలో యువతులు రోడ్ల పైకి వచ్చి తెలిపిన అసమ్మతి. ఈ అసమ్మతి ముఖ్య ఉద్దేశం - యువతులపై పురుషులు జరిపే అత్యాచారాలకు యువతులు వేసుకొనే కురచ దుస్తులు కారణం కాదు అని. ఢిల్లీలో ఈ వాక్ జంతర్ మంతర్ కట్టడం వద్ద్ద జరిగిన ఈ వాక్ లో సుమారు 200 మంది అమ్మాయిలు తమ కురచ దుస్తుల్లో రోడ్లపైకి పైకి వచ్చి తమ అసమ్మతి తెలిపి హల్ చల్ చేశారు. ఈ స్లట్ వాక్ కు హిందీ భాషలో బెషార్మీ మోర్చా అని నామకరణం చేశారు. బెషార్మీ అనగా సిగ్గులేని తనం, మోర్చా అనగా అసమ్మతి. ఈ స్లట్ వాక్ లో "మా దుస్తులు మా ఇష్టం", "మేం కురచ దుస్తులు వేసుకుంటే మీకేంటి?" అని పురుషులను ఉద్దేశించి నినాదాలు చేశారు. అయితే భారతీయ కట్టుబాట్లకు విరుద్ధంగా అమ్మాయిలు కురచ దుస్తులు ధరించి బయటకు వచ్చి అసమ్మతి ప్రకటించడాన్ని పలు సంప్రదాయ వాదులు, పోలీసులు ఖండించారు. చివరకు పోలీసులు కల్పించుకోవడంతో ఈ అసమ్మతికి తెరపడింది.

చరిత్ర[మార్చు]

స్లట్ వాక్ మొదటిసారిగా టొరాంటో (Toronto) నగరంలో జరిగింది. దీనికి కారణం ఒక పోలీస్ ఆఫీసర్ "యువతులు పురుషులను లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకోకుండా సరైన దుస్తులు వేసుకుంటే వారిపై అత్యాచారాలు జరగవు" అని వాఖ్య చేయడం వల్ల యువతుల స్లట్ వాక్ ఆవిర్భవించింది. స్లట్ వాక్ మొట్టమొదటి సారిగా 2011, జూలై 17న భోపాల్ లో జరిగింది. ఆ తర్వాత 2011, జూలై 31న ఢిల్లీలో జరిగినది, 2011 ఆగస్టు 21న లక్నౌలో జరిగింది.

లంకెలు[మార్చు]