హిందూ స్వయం సేవక్ సంఘ్

వికీపీడియా నుండి
14:09, 3 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: MYADAM ABHILASH (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search
హిందూ స్వయం సేవక్ సంఘ్
సంకేతాక్షరంహెచ్ఎస్ఎస్
ఆశయం""మేము మా స్వంత బలం ద్వారా సాధిస్తాము""
స్థాపన1940
సేవావిదేశాల్లో
అనుబంధ సంస్థలుసంఘ్ పరివార్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

హిందూ స్వయంసేవక్ సంఘ్ భారతదేశం వెలుపల నివసిస్తున్న హిందువుల సంఘటితం కోసం ఏర్పడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ. ఇది 1940 లో కెన్యాలో స్థాపించబడింది, ప్రస్తుతం ఇది 3289 శాఖలతో 156 దేశాలలో చురుకుగా పనిచేస్తుంది.

చరిత్ర

1940 లో కెన్యాలో స్థిరపడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు ఇద్దరు స్వచ్ఛందంగా శాఖను ప్రారంభించారు. అలాంటి శాఖలు అంతర్జాతీయ స్థాయిలో లేనందున, వాటిని భారతీయ స్వయంసేవక్ సంఘం అనీ తరువాత హిందూ స్వయం సేవక్ సంఘ్ (హెచ్ఎస్ఎస్) శాఖలుగా మార్చారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులు దత్తాత్రేయ దేవరస్ వంటి వారు సంస్థను అభివృద్ధి చేయడానికి విదేశాలలో చాలా సంవత్సరాలు గడిపారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో హెచ్‌ఎస్‌ఎస్ 1966 లో స్థాపించబడింది. బర్మింగ్‌హామ్, బ్రాడ్‌ఫోర్డ్ వంటి నగరాల్లో కూడా శాఖలు స్థాపించబడ్డాయి.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని హెచ్‌ఎస్‌ఎస్ సంస్థ, తన మాతృ దేశానికి డబ్బులు పంపిస్తుందని ఆస్ట్రేలియా దేశ ప్రజలకు అనుమానం కలిగింది. కానీ అది నిజం కాదని, కేవలం హిందువుల సంఘటితం కోసం ఏర్పడిన సంస్థ మాత్రమే అని, ఏ రాజకీయ పార్టీలకు చెందింది కాదని హెచ్ఎస్ఎస్ చెప్పింది.

కెన్యా

హెచ్ఎస్ఎస్ ను కెన్యాలోని నైరోబిలో 14 జనవరి 1947 న జగదీష్ చంద్ర శాస్త్రి తన సహచరులతో కలిసి ప్రారంభించాడు. దీనినే మొదట భారతీయ స్వయంసేవక్ సంఘ్ అని పిలిచేవారు. అప్పటి నుండి ఇది మొంబాసా, నకూరు, కిసుము, ఎల్డోరెట్, మేరు వంటి పట్టణాలతో పాటు కెన్యా అంతటా వ్యాపించింది. కెన్యాలోని హెచ్‌ఎస్‌ఎస్ హిందూ ధర్మ సేవా కేంద్రం (హెచ్‌ఆర్‌ఎస్‌సి) పేరుతో హిందువుల సామాజిక-సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే ఒక సంస్థను కూడా నడుపుతోంది. ఇది 1947 లో నైరోబిలో ప్రారంభించబడింది.

లైబీరియా

హెచ్‌ఎస్‌ఎస్ ను లైబీరియాలోని మన్రోవియాలో 29 అక్టోబర్ 2017 న ప్రారంభించారు.

నేపాల్

నేపాల్‌లో సంఘ స్వయం సేవకులు హెచ్ఎస్ఎస్ ను 1992 లో స్థాపించారు. నేపాల్ లో దీని ఉనికి ముఖ్యంగా టెరాయ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది.

యునైటెడ్ కింగ్డమ్

యునైటెడ్ కింగ్‌డమ్‌లో హెచ్ఎస్ఎస్ 1966 లో స్థాపించబడింది.

యునైటెడ్ స్టేట్స్

యుఎస్‌లో, హెచ్‌ఎస్‌ఎస్ 1989 లో లాభాపేక్షలేని సంస్థగా నమోదు చేయబడింది.

ఇతర దేశాల్లో

డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాలలో సైతం హెచ్ఎస్ఎస్ శాఖలు ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్ 2014 లో ప్రకటించింది. రెండు సంస్థలు కలిసి పనిచేస్తూనే ఇటువంటి భావజాలాన్ని పెంపొందిస్తాయని అలా అని రెండు సంస్థలు ఒకటే కాదని కేవలం అనుబంధ సంస్థలే అని తెలియజేసింది.

మూలాలు