కార్యసాధక నిబంధన సిద్ధాంతం

వికీపీడియా నుండి
16:27, 6 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: MYADAM ABHILASH (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

కార్యసాధక నిబంధన సిద్ధాంతం ను అమెరికాకు చెందిన బి ఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. దీన్ని స్కిన్నర్ సిద్ధాంతం అనీ, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అనీ, ఆర్ టైపు నిబంధన సిద్ధాంతం అనీ, ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతం అనీ అంటారు. ఇది ఒక ప్రవర్తనా వాద సిద్ధాంతం.

బి ఎఫ్ స్కిన్నర్

బి ఎఫ్ స్కిన్నర్

బి ఎఫ్ స్కిన్నర్ అమెరికా కు చెందిన మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త. ఇతను ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం పావ్ లోవ్ సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం కు భిన్నంగా ఉంటుంది. టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, వెర్బల్ బిహేవియర్ అనేవి స్కిన్నర్ రాసిన గ్రంథాలు.[1][2]

ప్రయోగం

స్కిన్నర్ ఎక్కువగా ఎలుకలు, పావురాలపై ప్రయోగాలు చేశాడు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం లో మీటను నొక్కితే ఆహారం వచ్చే ఒక స్కిన్నర్ బాక్సు ను, ఒక ఎలుకను ఉపయోగించాడు. ఎలుకకు ఆకలిని కలుగజేసి, ఆహారం అనే ఉద్దీపన వచ్చేలా సిద్ధాంత ప్రతిపాదన చేశాడు.

ప్రయోగ విధానం

స్కిన్నర్ బాక్సు లో బాగా ఆకలిగా ఉన్న ఒక ఎలుకను ఉంచినపుడు అది అనేకసార్లు అటూ ఇటూ తిరుగుతూ ఒకసారి అనుకోకుండా మీట ను నొక్కి ఆహారం పొందింది. మరొకసారి కొన్ని ప్రయత్నాల ద్వారానే మీట నొక్కి ఆహారం పొందింది. ఇలా కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నేరుగా మీట నొక్కి ఆహారం పొందే అలవాటు చేసుకుంది. ఇలా ముందుగా మీట నొక్కిన తర్వాత నే ఆహారం పొందింది.

ప్రయోగ ఫలితం

మీట నొక్కడం అనే అసహజ ప్రతిస్పందన ఉపయోగించి, ఆహారం అనే సహజ ఉద్దీపన ను పొందింది. ప్రతిస్పందనకు, ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పడటమే ఈ సిద్ధాంత ఫలితం.

సిద్ధాంత అనుప్రయుక్తం

1. మంచి పని చేసిన వెంబడే బహుమతి కానీ, అభినందన గానీ అందించటం.

2. చెడు పని చేసిన వెంబడే శిక్ష ను అమలు చేయటం.

మూలాలు

  1. "Skinner, Burrhus Frederic". behavioranalysishistory.pbworks.com.
  2. "Psychology History". Archived from the original on ఏప్రిల్ 4, 2007.