ప్రదీప్ జైన్ ఆదిత్య
ప్రదీప్ కుమార్ జైన్ ఆదిత్య | |||
![]()
| |||
పదవీ కాలం 2009 మే 28 – 2014 మే 26 | |||
ముందు | చంద్ర శేఖర్ సాహు | ||
---|---|---|---|
తరువాత | ఉపేంద్ర కుష్వాహా | ||
పదవీ కాలం మే 2009 – మే 2014[2] | |||
ముందు | చంద్రపాల్ సింగ్ యాదవ్ | ||
తరువాత | ఉమాభారతి | ||
నియోజకవర్గం | ఝాన్సీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] ఝాన్సీ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | 1962 సెప్టెంబరు 8||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | స్నేహలత జైన్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
ప్రదీప్ కుమార్ జైన్ ఆదిత్య (జననం 8 సెప్టెంబర్ 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా కేంద్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ప్రదీప్ జైన్ ఆదిత్య 1962 సెప్టెంబర్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో విష్ణు కుమార్ జైన్, శాంతి దేవి జైన్ దంపతులకు జన్మించాడు. ఆయన బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ, ఎం.కాం., ఎల్ఎల్‌బి డిగ్రీలు పూర్తి చేశాడు.[4][5]
రాజకీయ జీవితం
[మార్చు]ప్రదీప్ జైన్ ఆదిత్య భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి 2004లో ఝాన్సీ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2007 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ప్రదీప్ జైన్ ఆదిత్య 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి రమేష్ కుమార్ శర్మపై 47,670 ఓట్ల మెజారిటీతో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై మన్మోహన్ సింగ్ రెండవ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[6] ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 84,089 ఓట్లతో నాల్గొవ స్థానంలో నిలిచాడు.[7][8]
ప్రదీప్ జైన్ ఆదిత్య 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ చేతిలో 1,02,614 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Fifteenth Lok Sabha, Members Bioprofile". Lok Sabha, Parliament of India. Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.
- ↑ "List of all MP from Jhansi Lok Sabha Seat". Result University. Archived from the original on 11 August 2021. Retrieved 11 Aug 2021.
- ↑ "Ministry of Rural Development". Government of India. Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.
- ↑ "Detailed Profile: Shri Pradeep Kumar Jain Aditya". archive.india.gov.in. Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.
- ↑ "Detailed Profile: Shri Pradeep Kumar Jain Aditya". archive.india.gov.in. Archived from the original on 17 May 2014. Retrieved 17 May 2014.
- ↑ "Jain's inclusion in ministry shows focus on Bundelkhand". The Indian Express. 29 May 2009. Archived from the original on 1 December 2010. Retrieved 14 June 2010.
- ↑ "Jhansi: Five-way battle". The Economic Times. 9 April 2014. Archived from the original on 18 May 2014. Retrieved 18 May 2014.
- ↑ "Election Results 2014: Seven Union Ministers taste humiliating defeat in Uttar Pradesh". The Economic Times. 16 May 2014. Archived from the original on 19 May 2014. Retrieved 18 May 2014.
- ↑ "2024 Loksabha Elections Results -Jhansi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Jhansi Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.