ప్రపంచ అంతరిక్ష వారం
ప్రపంచ అంతరిక్ష వారం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
రకం | యునైటెడ్ నేషన్స్ |
ప్రారంభం | అక్టోబరు 4 |
ముగింపు | అక్టోబరు 10 |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారంరోజులపాటు నిర్వహించబడుతుంది. మానవ ప్రగతిని మెరుగుపడటానికి కారణమవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా యూరప్, ఆసియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]
చరిత్ర
[మార్చు]1957, అక్టోబరు 4న స్పుట్నిక్ 1అనే తొలి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రారంభించి అంతరిక్ష అన్వేషణకు శ్రీకారం చుట్టగా, 1967 అక్టోబరు 10న చంద్రునితోసహా ఇతర ఖగోళ ప్రాంతాలలో అన్వేషణ వివిధ దేశాల కార్యకలాపాల నిబంధనలపై సంతకం చేయబడింది.[2]
అక్టోబరు 4, అక్టోబరు 10 తేదీలు ప్రపంచ అంతరిక్ష చరిత్రలో చారిత్రక సంఘటనలకు గుర్తుగా 1999, డిసెంబరు 6న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ రెండురోజుల మధ్య ఉన్న వారాన్ని అంతరిక్ష వారంగా ప్రకటించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక అంతరిక్ష కార్యక్రమం.[3]
కార్యక్రమాలు
[మార్చు]- 2017లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవం సందర్భంగా 82 దేశాలలో 4వేలకంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించగా మొత్తం 20లక్షలమంది పాల్గొన్నారు.
- అంతరిక్ష ప్రయోగ ఫిలింషోలు, ప్రదర్శనలు, సదస్సులు, విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
లక్ష్యాలు
[మార్చు]- అంతరిక్ష పరిశోధనల్లో వివిధ దేశాలమధ్య ఐకమత్యం తీసుకురావడం.
మూలాలు
[మార్చు]- ↑ World Space Week, General Assembly, The United Nations.
- ↑ World Space Week. Archived 2012-10-12 at the Wayback Machine. UN General Assembly.
- ↑ UN launches into World Space Week highlighting contributions of space science to humanity. The United Nations News Center; October 4, 2012.
ఇతర లంకెలు
[మార్చు]- World Space Week The United Nations
- World Space Week website