ప్రపంచ ఆరోగ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ ఆరోగ్యం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. వైయక్తిక దేశాల లక్ష్యాలు, వాటి ఉద్దేశాల పరిధికి మించింది.[1] ఆరోగ్య సమస్యలు దేశాల సరిహద్దులను దాటి, ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయి.[2] 'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇస్తూ, ఒక అంశానికి సంబంధించిన అధ్యయనం, పరిశోధన, ఆచరణ'గా దీనిని నిర్వచిస్తారు.[3] కాబట్టి, దేశాల సరిహద్దులను అధిగమించి, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం, అసమానతలను తొలగించడం, ప్రపంచ స్థాయిలో తలెత్తే ముప్పులకు వ్యతిరేకంగా పోరాడటాన్ని ప్రపంచ ఆరోగ్యం అని పిలవవచ్చు.[4] 1948లో, నూతనంగా ఏర్పడిన ఐక్య రాజ్య సమితిలోని సభ్యదేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను ఏర్పరచాయి.[5]

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆరోగ్యానికి సంబంధించి ప్రధాన అంతర్జాతీయ సంస్థ. ప్రపంచ ఆరోగ్య కార్యకలాపాలపై ప్రభావం వేసే ఇతర ముఖ్యమైన సంస్థలు UNICEF, ప్రపంచ ఆహార పథకం (WFP) మరియు ప్రపంచ బ్యాంకు. ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ప్రధాన చర్య ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది ప్రకటన మరియు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు.[6]

చరిత్ర[మార్చు]

1948లో, నూతనంగా ఏర్పడిన ఐక్య రాజ్య సమితిలోని సభ్యదేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను ఏర్పరచాయి. 1947 మరియు 1948లో ఈజిప్టులో కలరా అంటువ్యాధి సోకి 20,000 మంది మరణించారు. ఈ సంఘటన అంతర్జాతీయ సమాజాన్ని చర్యకు ప్రేరేపించింది.[7]

అంతర్జాతీయ సమాజం సాధించిన అతి గొప్ప విజయాలలో మశూచి. నిర్మూలన ఒకటి. సహజంగా సంభవించిన ఈ వ్యాధికి సంబంధించిన చివరి కేసు 1977లో నమోదయింది. అయితే ఈ విజయం ఆశ్చర్యకరంగా, అతివిశ్వాసానికి దారితీయడం వలన, మలేరియా, ఇతర వ్యాధులను నిర్మూలించేందుకు చేసిన ప్రయత్నాలు అంత ప్రభావశీలంగా పనిచేయలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ ఆరోగ్య సమాజంలో వ్యాధి నిర్మూలనా కార్యక్రమాలను రద్దు చేసి, వాటి స్థానంలో తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రభావాన్ని కలిగించే ప్రాథమిక ఆరోగ్య, వ్యాధి నిరోధక కార్యక్రమాలను చేపడితే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

సంబంధిత రంగాల దృక్పథాలు[మార్చు]

ప్రపంచ ఆరోగ్యం, వైద్యం, సాంఘిక శాస్త్రంలతో పాటుగా, జన సాంఖ్యక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రోగ సాంక్రమణ విఙ్ఞానం, రాజకీయార్థిక శాస్త్రం, సామాజికశాస్త్రం వంటి శాస్త్ర విభాగాలతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతర్జాతీయ నేపథ్యంలో వివిధ రంగాల దృక్పథాల ఆధారంగా, ఆరోగ్య నిర్ణాయకాలపై, దాని వ్యాప్తిపై ఇది కేంద్రీకరిస్తుంది.

రోగ సాంక్రమణ విఙ్ఞాన దృక్పథం ప్రధానమైన ఆరోగ్య సమస్యలను గుర్తిస్తుంది. వైద్య దృక్పథం ప్రధానమైన వ్యాధులను అధ్యయనం చేయడం, వాటిని నిరోధక చర్యలు చేపట్టడం, వ్యాధులను నిర్ధారించి, చికిత్స చేసే విధానాల గురించి వివరిస్తుంది.

ఆర్థిక దృక్పథం, వ్యక్తిగతంగానూ, జనాభా ఆరోగ్య పరిరక్షణ కోసంగానూ చెల్లించిన మూల్యపు సార్థకతను, ఆ మూల్యానికి తగిన ప్రయోజనాలను పొందే విధానాల గురించి చెపుతుంది. మొత్తం విశ్లేషణలో, ఉదాహరణకు ప్రభుత్వాల, N.G.O.ల దృక్పథంలో ఆరోగ్య రంగ విశ్లేషణపై దృష్టి ఉంటుంది. మూల్య సార్థకతా విశ్లేషణ, చెల్లించిన మూల్యాన్ని, చర్యలు చేపట్టిన అంశాలలో ఆరోగ్యపరంగా వచ్చిన మార్పులను ఒకదానితో ఒకటి పోల్చి చూపుతుంది. ఆరోగ్య అంశాలలో చేసిన మదుపు ప్రయోజనకరంగా ఉందా, లేదా అనే విషయాన్ని ఆర్థిక దృక్పథంతో అంచనా వేస్తుంది. ఈ అంశాలలో స్వతంత్రంగా చేపట్టే చర్యలకు, పరస్పరం చేపట్టే చర్యలకు తప్పనిసరిగా తేడా ఉంటుంది. స్వత్రంత్ర్యంగా చేపట్టే చర్యలకు సగటు మూల్య సార్థకతా నిష్పత్తి సరిపోతుంది. పరస్పర చేపట్టే చర్యలను వీటితో పోల్చినపుడు, క్రమాభివృద్ధితో కూడిన మూల్య సార్థకతను తప్పని సరిగా ఉపయోగించాలి. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా గరిష్ఠ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణను ఎలా సాధించాలో ఆ తర్వాతి విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.

ఈ దృక్పథం నుంచి వ్యక్తిగత ఆరోగ్య విశ్లేషణా, ఆరోగ్యానికి ఉన్న గిరాకి, సరఫరాలపై దృష్టి పెడుతుంది. ఆరోగ్యానికి సాధారణంగా ఉన్న గిరాకీని బట్టి ఆరోగ్య పరిరక్షణ గిరాకీని నిర్ణయిస్తారు. ఆరోగ్య పరిరక్షణ అనేది, ఆరోగ్య "మూలధన"పు భారీనిల్వను పొందేందుకు వినియోగదారులకు ఒక సాధనం. ఉపాంత ఆరోగ్య మూల్యము, దానివలన కలిగే ఉపాంత ప్రయోజనానికి సమానంగా ఉన్నప్పుడు, వాంఛిత స్థాయిలో ఆరోగ్యంలో మదుపులు పెడతారు (MC=MB). కాలం గడిచేకొద్దీ ఆరోగ్యం కొంత స్థాయిలో క్షీణిస్తూ ఉంటుంది δ. ఆర్థిక వ్యవస్థలో సాధారణ వడ్డీ రేటును rతో సూచిస్తారు. ప్రోత్సాహకాల కల్పన, మార్కెట్ కల్పించడం, మార్కెట్ నిర్వహణ, సమాచార అసౌష్టవం గురించిన విషయాలు, ఆరోగ్య కల్పనలో ప్రభుత్వాల, ఎన్జీఒల పాత్ర వంటి వాటిపై ఆరోగ్య సరఫరా దృష్టి పెడుతుంది.

నైతిక విధానం పంపిణీకి సంబంధించిన విషయాలపై దృష్టి పెడుతుంది. పంపిణీకి సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఎ.ఆర్.జాన్సన్ (1986) సమస్యా పరిష్కార నిబంధనను ప్రవేశపెట్టాడు. రక్షించడానికి అవకాశం ఉన్నప్పుడు 'ప్రమాదంలో ఉన్న జీవితాన్ని సంరక్షించడం గ్రహించదగిన నిబంధన' అని ఈ నియమం స్పష్టం చేస్తున్నది.[8] నిష్పక్షపాత న్యాయంపై జాన్ రాల్స్ అభిప్రాయాలు పంపిణీ గురించి ఒడంబడిక దృక్పథంతో ఉన్నాయి. ఆరోగ్య సమానత్వం గురించిన కీలక అంశాలను చర్చిస్తూ ఆమర్త్యసేన్ [9] కూడా ఈ అభిప్రాయాలను ఉపయోగించుకున్నాడు. న్యాయానికి సంబంధించిన అంతర్జాతీయ కట్టుబాట్లను జీవనైతిక పరిశోధన[10] మూడు భాగాలుగా చేసి పరిశీలించింది: (1) అంతర్జాతీయ ఆరోగ్య అసమానతలు ఎప్పుడు అన్యాయపూరితంగా ఉంటాయి? ; (2) అంతర్జాతీయ ఆరోగ్య అసమానతలు ఎలా వస్తాయి?; (3) ఈ అసమానతలను అన్నింటిని పరిష్కరించలేకున్నప్పుడు ఆరోగ్య అవసరాలకు మనం ఎలా నెరవేరుస్తాం?

రాజకీయార్థిక విషయాలు ప్రపంచ ఆరోగ్యానికి వర్తిస్తాయని రాజకీయ దృక్పథం నొక్కి చెబుతుంది. రాజకీయార్థిక శాస్త్రం అనే పదం వాస్తవంగా ఉత్పత్తి, కొనుగోలు, అమ్మకం, వాటికి చట్టంతో, ఆచారంతో, ప్రభుత్వంతో ఉండే సంబంధాన్ని గురించిన అధ్యయనాన్ని తెలుపుతుంది. నైతిక తత్వశాస్త్రం నుండి ఆవిర్భవించిన (ఉదా. ఆడమ్ స్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో నైతిక తత్వ శాస్త్ర ఆచార్యుడు), ఆరోగ్య రాజకీయార్థశాస్త్రం, దేశాల ఆర్థిక వ్యవస్థలు - రాజకీయాలు, జనాభా ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేస్తుంది.

కొలత[మార్చు]

ప్రపంచ ఆరోగ్య విశ్లేషణ, ఆరోగ్య భారాన్ని ఎలా లెక్కిసారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు అనేక రకాల కొలతలను ఉపయోగిస్తున్నారు. అవి: DALY, QALY, మరణాల లెక్కింపులు కొలతల ఎంపిక వివాదాస్పదంగా ఉండొచ్చు. వీటిలో ఆచరణ సంబంధమైన, నైతిక సంబంధమైన విషయాలు కూడా ఉంటాయి.[11]

ఆయుర్దాయం[మార్చు]

ఆయుర్దాయం అనేది ఒక నిర్దిష్ట జనాభాకు సంబంధించిన సగటు జీవిత కాలపు (జీవితపు సగటు పొడవు ) సాంఖ్యక శాస్త్ర కొలత. చనిపోయేంత వరకు జీవించిన కాలాన్ని ఆ ప్రాంతపు ప్రజల ఆయుర్దాయం అంటారు (దేశాలను బట్టి, ప్రస్తుత వయసును బట్టి, జన సాంఖ్యక శాస్త్ర మార్పులను బట్టి). ఆయుర్దాయమనేది ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. దీనితో ఏ సమూహపు ప్రజలలోనైనా, ఏ వయస్సు వారిలోనైనా ఆయుర్దాయాన్ని లెక్కించి చెప్పవచ్చు.

శక్తివిహీనత సవరించిన ఆయుర్దాయం[మార్చు]

శక్తివిహీనత సవరించిన ఆయుర్దాయం (DALY) అనేది జనాభా ఆరోగ్యంపై జబ్బు, బలహీనత, మరణాల ప్రభావాన్ని కలిపి లెక్కించే సంక్షిప్త విధానం. DALY శక్తివిహీనతతో జీవించిన కాలాన్ని, అర్ధాంతర మరణం వలన కోల్పోయిన జీవిత కాలంతో కలిపి లెక్కిస్తుంది. ఒక DALYని వ్యాధి వలన కోల్పోయిన ఆరోగ్య సంవత్సరంగా భావించవచ్చు. వ్యాధి భారంతో ఉన్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి, ముసలితనంలో ఎలాంటి వ్యాధి కానీ శక్తి విహీనత కానీ లేకుండా ఉండే ఆదర్శ పరిస్థితికి మధ్య గల తేడా యొక్క కొలతగా కూడా దీనిని భావించవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యాధి యొక్క DALY అంటే జనాభాలో అర్ధాంతర మరణం (YLL) వలన కోల్పోయిన సంవత్సరాల మొత్తం మరియు ఆరోగ్య రీత్యా సంభవించే శక్తివిహీనత (YLD) కార‍ణంగా కోల్పోయిన సంవత్సరాలు. ఒక డిఎ‍ఎల్‍వై, కోల్పోయిన ఒక పూర్తి ఆరోగ్య సంవత్సరాన్ని సూచిస్తుంది.

నాణ్యత సవరించిన ఆయుర్దాయం[మార్చు]

నాణ్యత సవరించిన ఆయుర్దాయము లేదా QALY అనేది ఇప్పటి వరకూ జీవించిన జీవితపు నాణ్యత, పరిమాణాలతో కలుపుకొని, వైద్య పరమైన జోక్యంతో జీవిత పరిమాణాన్ని పెంచే సాధనంగా ఉపయోగపడుతూ, వ్యాధి భారాన్ని అంచనా వేసే ఒకానొక పద్ధతి. వినియోగితా స్వాతంత్ర్యం, సమస్యలు లేకపోవడం, స్థిరమైన సర్దుబాటు ప్రవర్తన, QALY నమూనాకు అవసరం.[12] QALYలు ఇంకా మిగిలిఉన్న ఆయుర్దాయాన్ని, మిగిలి ఉన్న ఆయుర్దాయంలో ఉండబోయే జీవిత నాణ్యతతో కలుపుతారు. ఆరోగ్యవంతమైన ఆయుర్దాయపు ప్రతీ అదనపు సంవత్సరపు విలువను ఒకటి (సంవత్సరం) గా లెక్కిస్తారు. ఆరోగ్యవంతమైన ఆయుర్దాయంలో ఒక సంవత్సరం తగ్గిపోతే దాని విలువ ఒకటి (సంవత్సరం) కంటే తగ్గుతుంది.. QALY గణనలు వ్యక్తుల ఆయుర్దాయపు అంచనా విలువ యొక్క కొలతలపై ఆధారపడి ఉంటాయి. కొలతలను అనేక విధాలుగా లెక్కిస్తున్నారు: విచారణలు, విశ్లేషణల ద్వారా, ప్రత్యామ్నాయ ఆరోగ్య పరిస్థితుల ప్రాధాన్యాల గురించి అనేక పద్ధతులలో లేనిది ఉన్నట్లుగా కల్పిస్తున్నారు. వాటి కోసం డబ్బు ఖర్చు చేసే ఉద్దేశం ఉన్నట్లుగా తీర్మానిస్తున్నారు. సర్దుబాటుపై ఆధారపడిన కొన్ని సాధనాలను ఉపయోగించి, లేదా ఉన్నత నాణ్యతతో కూడిన తక్కువ ఆయుర్దాయాన్ని పొందడం కోసం వైద్య సహాయాన్ని అందించడం ద్వారా ఆయుర్దాయాన్ని పెంచనున్నట్లుగా చెప్పుకుంటున్నారు. QALYలు ఉపయోగితా విశ్లేషణకు ఉపయోగపడతాయి. అంతేకానీ వాటంతటవే సమానత్వ యోచనలను చొప్పించలేవు.[11]

శిశు, చిన్నపిల్లల మరణాలు[మార్చు]

ఆయుర్దాయం, DALYs/QALYs సగటు వ్యాధి భారాన్ని సూచిస్తాయి. శిశు మరణాలు, ఐదేండ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నపిల్లల మరణాలు, ప్రత్యేకించి జనాభాలోని పేద వర్గాల ఆరోగ్య పరిస్థితిని తెలియ జేస్తాయి. కాబట్టి ఆరోగ్య సమానత్వంపై దృష్టి పెట్టేటప్పుడు సంప్రదాయ కొలతలలో మార్పులు రావడం చాలా ఉపయోగకరం.[13] పిల్లల హక్కుల కోసం వాదించడానికి కూడా ఈ కొలతలు చాలా ముఖ్యమైనవి. 2001లో దాదాపుగా 56 మిలియన్ల పిల్లలు చనిపోయారు. వీరిలో 10.6 మిలియన్ల మంది ఐదేండ్ల కన్నా తక్కువ వయసు గలవాళ్ళు. వీరిలో 99%మంది అల్ప, మధ్యస్థాయి ఆదాయం గల దేశాలలో నివసిస్తున్నారు.[14] ఈ లెక్కన రోజుకు 30,000మంది పిల్లలు చనిపోతున్నారు.[15]

అనారోగ్య స్థితి[మార్చు]

అనారోగ్య స్థితి, తాకిడి రేటుతో పాటుగా, ప్రబలంగా ఉండడం, సంచిత తాకిడులను కూడా కలుపుకొని లెక్కిస్తుంది. తాకిడి రేటు అంటే నిర్దిష్ట కాలంలో ఒక కొత్త స్థితి అభివృద్ధి చెంది, నష్టం సంభవించే అవకాశం ఏర్పడడం. కొన్ని సార్లు దీనిని సరళంగా, ఒక కాలంలో సంభవించిన కొత్తకేసుల సంఖ్యగా కూడా చెబుతున్నప్పటికీ, అనురూప సంబంధంగా లేదా విభాజకం సహాయంతో వంతుగా చెప్పడం సరైనది.

ఆరోగ్య పరిస్థితులు[మార్చు]

శస్త్రచికిత్సా సంబంధిత వ్యాధి భారం[మార్చు]

HIV వంటి సంక్రమణ వ్యాధులు తక్కువ ఆదాయం కలిగిన దేశాలలో ఆరోగ్యానికి చాలా నష్టాన్ని కలగ జేస్తాయి. శస్త్ర చికిత్సా సంబంధిత పరిస్థితులతో పాటుగా రోడ్డు ప్రమాదాలలో తీవ్ర గాయాలైనపుడు, లేదా ఇతర గాయాలు ఏర్పడినపుడు, ప్రాణాంతకమైన వ్యాధులు, మృదు కణజాల సంక్రమణలు, పుట్టుకతో వచ్చే అసాధారణ లక్షణాలు, ప్రసవ సమయంలో తలెత్తే క్లిష్ట పరిస్థితుల వంటివి వ్యాధిభారానికి దోహద పడతాయి. ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తాయి.[16] [3]. ప్రపంచ వ్యాధి భారంలో 11% భారం శస్త్ర చికిత్సా సంబంధిత వ్యాధుల వలన కలుగుతుందని అంచనా వేయబడింది. 38% గాయాల వలన, 19% ప్రాణాంతకమైన వ్యాధుల వలన, 9% పుట్టుకతో వచ్చే అసాధారణ లక్షణాల వలన, 6% గర్భధారణ సమయంలో తలెత్తే సంక్లిష్ట పరిస్థితుల వలన, 5% పాక్షికంగా అంధత్వాన్ని కలిగించే కంటి వ్యాధి వలన, 4% ప్రసవ కాలంలో ఏర్పడిన పరిస్థితుల వలన వ్యాధి భారం కలుగుతుంది.[17] ఆఫ్రికాలో ప్రపంచం మొత్తం మీదనే శస్త్ర చికిత్సా సంబంధిత DALYల తలసరి రేటు ఎక్కువగా ఉంది. అయినా, శస్త్ర చికిత్సా సంబంధిత DALYలు ఆగ్నేయాసియాలో (48 మిలియన్లు) అధికంగా ఉన్నట్లు అంచనా.[18] పైన చర్చించిన దానిని అనుసరించి, ప్రపంచ శస్త్ర చికిత్సా సంబంధిత వ్యాధి భారం, గాయాల వలన ఎక్కువగా కలుగుతోంది. వీటిలో రోడ్డు ప్రమాదాల (RTAs) వంతు ఎక్కువగా ఉంది. WHO లెక్కల ప్రకారం, ప్రతీ రోజు 3500 కన్నా ఎక్కువగా RTA సంబంధిత మరణాలు జరుగుతున్నాయి. మిలియన్ల సంఖ్యలో ప్రజలు గాయాల పాలవడమో లేక జీవితానికి పనికి రాకుండా పోవడమో జరుగుతోంది. ప్రజలు చనిపోవడానికి ప్రస్తుతం ఉన్న కారణాలలో రోడ్డు ప్రమాదాలది తొమ్మిదవ స్థానం. ఇది దాని స్థానం నుండి రోజు రోజుకు పైకి ఎగబాకుతోంది. 2004 నాటికి ఐదవ స్థానంలో ఉన్న DALYs 2030 నాటికి దాని స్థానం కోల్పోతాయి. 2030 నాటికి అన్ని రకాల సంక్రమణ వ్యాధుల కన్నా, గాయాలే మనిషిని మృత్యువుకు చేర్చడంలో ముందుంటాయి.[19] [4]

శ్వాస సంబంధ వ్యాధులు, తట్టు[మార్చు]

వాయునాళానికి, మధ్య చెవికి సంక్రమణం వ్యాపించడం వల్ల శిశువుల, చిన్న పిల్లలలో ప్రధానంగా మరణాలు సంభవిస్తున్నాయి.[14] పెద్ద వారిలో క్షయ అతి సాధారణ వ్యాధి. అనారోగ్యానికి గురి చేయడం లోనూ, మరణానికి గురి చేయడం లోనూ ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. HIV వ్యాప్తితో, క్షయ వలన సంభవించే మరణాల సంఖ్య పెరిగింది. జన సమ్మర్ధత వల్ల శ్వాస సంబంధమైన సంక్రమణల వ్యాప్తి పెరిగింది. కోరింత దగ్గుకు వ్యతిరేకంగా చేపట్టిన టీకా కార్యక్రమం వలన ప్రతి సంవత్సరం 600,000 మరణాలు నిరోధించబడ్డాయి. గాలి ద్వారా వ్యాపించే తట్టు వ్యాధి మార్బిల్ వైరస్ వలన వస్తుంది. దీనికి ఒకరి నుండి మరొకరికి వ్యాపించే లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్లూలో మాదిరిగానే జ్వరం, దగ్గు, ముక్కు లోపల మంట, కొద్ది రోజుల తర్వాత దద్దుర్లు సాధారణంగా వస్తాయి. దీనిని టీకాల ద్వారా సమర్థవంతంగా నిరోధించవచ్చు. అయినప్పటికీ, 2007 సంవత్సరంలో 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, 200,000 మంది చనిపోయారు.[5] న్యుమోకాక్సి, హిమోఫీలస్ ఇన్‌ఫ్లూయంజా బ్యాక్టీరియాల వలన న్యుమోనియా సోకిన పిల్లలలో 50% మంది చనిపోతున్నారు. ఇవి బ్యాక్టీరియా సంబంధిత మెదడు వాపు, సెప్సిస్‌కు కూడా కారణమవుతున్నాయి. న్యుమోకాక్సి, హిమోఫీలస్ ఇన్‍ఫ్లూయంజా బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న కొత్త తరహా టీకాలు, అల్పాదాయ దేశాలకు విలువకు తగిన ప్రయోజనాన్ని ఇస్తాయి. ఈ రెండు టీకాలను సార్వత్రికంగా ఉపయోగించినట్లయితే ప్రతి సంవత్సరం 1,000,000 మంది పిల్లల మరణాలను నిరోధించవచ్చు. దీర్ఘకాలిక ప్రభావం కోసం పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా ఏర్పాట్లలో భాగం చేయాలి.[20]

అతిసార సంబంధిత వ్యాధులు[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలలో సంభవించే మరణాలలో 17 శాతం అతిసార సంబంధిత సంక్రమణల వలన జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల మరణానికి కారణం అవుతున్న వ్యాధులలో ఇది రెండవది.[21] పారిశుధ్య వసతులు సక్రమంగా లేక పోవడం వలన, ఈ వ్యాధి నీరు, ఆహారం, పాత్రలు, అశుభ్రమైన చేతులు, ఈగల నుండి వ్యాపిస్తుంది. రోటా వైరస్‍కు ఒకరి నుండి మరొకరికి వ్యాపించే లక్షణం చాలా ఎక్కువ. ఇది తీవ్రమైన అతిసారా కలుగజేసి, పిల్లల మరణానికి (ca 20%) కారణమవుతుంది. రోటా వైరస్ డయేరియాను నిరోధించడానికి పారిశుధ్య ఏర్పాట్లు ఒక్కటే సరిపోవని WHO చెపుతోంది.[22] రోటా వైరస్ టీకాలకు కాపాడే శక్తి చాలా ఎక్కువ, సురక్షితం. వాటికి విలువకు తగిన ప్రయోజనాన్ని ఇచ్చే సామర్ధ్యం ఉంది.[23] అతిసారా వలన నీటిని కోల్పోతారు. దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ORT) ద్వారా ప్రభావవంతంగా చికిత్స చేయవచ్చు. దీని నుపయోగించి మరణాల రేటును బాగా తగ్గించవచ్చు.[24][25] నీటిలో చక్కెర, ఉప్పు లేదా వంటా సోడా కలిపి వ్యాధికి గురైన పిల్లలకు తాపడం వల్ల నీటిని కోల్పోవడానికి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. తల్లి పాలు పట్టడం, జింక్‌మిశ్రమాలను తగు పాళ్ళలో ఇవ్వడం ద్వారా ముఖ్యమైన పోషక పదార్థాలను అందించ వచ్చు.

HIV/AIDS[మార్చు]

హ్యూమన్ ఇమ్యునోడిఫిషియన్సీ వైరస్ (HIV) ఒక రెట్రోవైరస్. ఇది మానవులలో 1980లో తొలిసారి కనపడింది. HIV ఒక దశకు చేరిన తర్వాత, సాంక్రమణం పొందిన వ్యక్తి AIDS, లేదా ఎక్వైర్డ్ ఇమ్యునోడిఫిషియన్సీ సిండ్రోమ్ రోగి అవుతాడు. HIV వైరస్, CD4+ T- కణాలను నిర్వీర్యపరచడం వలన అది AIDSగా మారుతుంది. CD4+ T కణాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యస్థకు అవసరం. యాంటీ రిట్రో వైరల్ మందులు జీవిత కాలాన్ని పొడిగించి, వ్యాధి పూర్వ దశ అయిన HIV కణాల మొత్తాన్ని శరీరంలో తగ్గించడం వలన AIDSను ఆలస్యం చేస్తుంది.

HIV శరీర ద్రవ్యాల ద్వారా వ్యాపిస్తుంది. HIV, సురక్షితం కాని లైంగిక సంపర్కం, రక్తనాళాలలోకి మత్తు మందులను ఎక్కించుకోవడం, రక్త మార్పిడి, శుభ్రం చేయని సూదులను వాడడం ద్వారా రక్తం, ఇతర ద్రవాల నుండి వ్యాపిస్తుంది. ఒకప్పుడు మత్తు మందులను వాడే వారికి, స్వలింగ సంపర్కులకు మాత్రమే ఈ వ్యాధి వ్యాపిస్తుందని అనుకునే వారు. కానీ అది ఎవరికైనా సోకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా, HIV భిన్న లింగ సంపర్కం అనే ప్రాథమిక విధానం ద్వారా వ్యాప్తి చెందుతున్నది. అది గర్భవతి అయిన స్త్రీ నుండి గర్భధారణ సమయంలో ఇంకా పుట్టని శిశువుకు వ్యాపిస్తుంది. లేదా గర్భం జరిగాక తల్లి పాలద్వారానైనా వ్యాపిస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎవరికయినా వ్యాపించగల వ్యాధి అయినప్పటికీ, దీని వ్యాప్తి రేటు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా ఉంది.

మలేరియా[మార్చు]

మలేరియా ప్రోటోజోవా వర్గానికి చెందిన ప్లాస్మోడియం పరాన్నజీవుల నుండి వ్యాపిస్తుంది. దీని సంక్రమణం దోమ కాట్ల వలన వ్యాపిస్తుంది. తొలి దశలో జ్వరంతో పాటుగా తలనొప్పి, చలి, వాంతులు లక్షణాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం దాదాపుగా 500 మిలియన్ల కేసులు వస్తున్నాయి. అభివృద్ధి చెందని దేశాలలో పిల్లలలోనూ, గర్భవతులైన స్త్రీలలోనూ ఇది చాలా సాధారణం.[26] దేశ ఆర్థిక వ్యవస్థను మలేరియా ఆటంకపరుస్తుంది. మలేరియా వలన ఆర్థిక పరంగా పని ఉత్పాదకత తగ్గిపోవడంతో పాటు, చికిత్సా వ్యయం, చికిత్స తీసుకోవడానికి వినియోగించాల్సిన కాలము వృధా అవుతుంది.[27] కీటక నాశనులను కలిగిన దోమ తెరలు వాడడం, ఆర్టెమిసిన్ ఆధారిత సంయోగ చికిత్సా విధానం ద్వారా, గర్భధారణ సమయంలో విడతలుగా చికిత్స చేయడం వలన మలేరియా మరణాలను తగ్గించవచ్చు. ఆఫ్రికాలో 23% మంది పిల్లలు, 27% గర్భవతులైన స్త్రీలు మాత్రమే కీటక నాశనులను కలిగిన దోమ తెరల కింద నిద్రిస్తున్నారు [6]. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడంకోసం ప్రతి ఏట ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.[28]

పోషకాహారం మరియు సూక్ష్మపోషకాహార లోటు[మార్చు]

ప్రపంచంలో రెండు వందల కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలు సూక్ష్మపోషకాహార లోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు (విటమిన్ A, ఇనుము, అయోడిన్, జింక్‌తో సహా). అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అయిదేళ్ల వయస్సులోని పిల్లలలో, సాంక్రమిక వ్యాధులతో ముడిపడిన మరణాలలో 53% మరణాలు పోషకాహార లేమి కారణంగా జరుగుతున్నాయి.[29] పోషకాహార లేమి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, తద్వారా శైశవదశ అస్వస్థత యొక్క తరచుదనం, తీవ్రత, కాలవ్యవధిని పెంచుతుంది (తట్టు, న్యుమోనియా, అతిసారంతో సహా) సూక్ష్మపోషకాహార లోట్లు బౌద్ధిక సామర్థ్యత, పెరుగుదల, వృద్ధి, పెద్దల ఉత్పాదకతను అడ్డుకుంటుంది.

అయితే, పోషకాహారలోపానికి రోగ సంక్రమణ కూడా ఒక ముఖ్యమైన కారకంగా, దోహదకారిగా ఉంటుంది. ఉదాహరణకు, కడుపు, పేగు సంక్రమణలు అతిసారం, HIV, క్షయ, పేగుల్లో పరాన్నజీవులు, తరుగుదల మరియు రక్తహీనతలను పెంచే దీర్ఘకాలిక సంక్రమణ వంటివాటికి కారణమవుతుంది.[30]

అయిదేళ్ల ప్రాయంలోని అయిదు కోట్లమంది పిల్లలు విటమిన్ A లోపంచే బాధపడుతున్నారు. ఇలాంటి లోటు రే చీకటితో ముడిపడి ఉంటుంది. తీవ్రమైన విటమిన్ A లోటు వల్ల కంటిశుక్లం పొడిబారటం –గ్జెరోప్తాల్మియా- మరియు కంటి శుక్లంలో కంతి ఏర్పడటం జరుగుతుంది, ఇది పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో, ఎపిథెలియల్ ఉపరితలాల నిర్వహణలో విటమిన్ A కూడా ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా, విటమిన్ A లోటు అనేది సంక్రమణ మరియు వ్యాధి యొక్క గ్రహణశీలతకు దారితీస్తుంది. వాస్తవానికి, విటమిన్ Aని అనుబంధంగా ఇచ్చినప్పుడు, విటమిన్ A లోపం కల స్థాయిలతో పోలిస్తే శిశు మరణాల రేటులో 23% తగ్గుదల కనిపించింది.[31]

ఇనుము లోటు ప్రపంచంలో దాదాపుగా మూడింట ఒక వంతు మహిళలు, పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఇనుము లోటు రక్తహీనతతోపాటు ఇతర పోషకాహార లోటులకు మరియు సాంక్రమణలకు దారితీస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరియు ప్రసూతి పూర్వ మరణాలు మరియు బుద్ధిమాంద్యంతో ముడిపడి ఉంటుంది. రక్తహీనత కలిగిన పిల్లల్లో, ఇనుమును ఇతర సూక్ష్మపోషకాహారలతో కలిపి అనుబంధంగా ఇవ్వడం వల్ల ఆరోగ్యం మరియు హెమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.[32] పిల్లల్లో ఇనుము లోటు అనేది అభ్యసన సామర్థ్యాన్ని, మనోద్వేగ, ఎరుక అభివృద్ధిని దెబ్బతీస్తుంది.

అయోడిన్ లోటు, నిరోధించగల బుద్ధి మాంద్యానికి ప్రధాన కారణం. {0/} ఏటా దాదాపు 50 మిలియన్ల మంది శిశువులు అయోడిన్ లోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. అయోడిన్ లోటు కలిగిన గర్భిణీ స్త్రీలు ఈ నిర్దిష్టమైన జోక్యం కోసం లక్షిత జనాభాలో పొందుపర్చబడతారు, ఎందుకంటే అయోడిన్ లోటు కలిగిన గర్భిణీ స్త్రీలు అకాల ప్రసవాలకు పాల్పడే అవకాశముది మరియు ఇది శిశువు అభివృద్ధిని అడ్డుకుంటుంది.[33] సార్వత్రిక ఉప్పు ఆయనీకరణకు ప్రపంచవ్యాప్తంగా చేసే ప్రయత్నాలు ఈ సమస్యను తొలగించడంలో సాయపడుతున్నాయి.

లాస్సెరిని మరియు ఫిశ్చర్ తదితరుల ప్రకారం, జింక్ లోటు వల్ల అతిసార వ్యాధి, న్యుమోనియా, మలేరియా వంటి వ్యాధుల ద్వారా మరణం సంభవించే ప్రమాదముంది.[34][35] ప్రపంచం శిశువులలో దాదాపు 30% శాతం మంది జింక్ లోటును కలిగి ఉన్నారని తెలుస్తోంది. అనుబంధాలు అతిసారవ్యాధి సంభవించే కాలావధులను తగ్గించడంలో ఉపయోగపడతాయి.[36]

పోషకాహార లేమిని నిరోధించడానికి చేసే యత్నాలు సూక్ష్మపోషకాహార అనుబంధాలు, ప్రాథమికమైన తృణ ధాన్యాలు, వైవిధ్యపూరితమైన ఆహారం, సంక్రమణలు వ్యాప్తి చెందకుండా తగ్గించడానికి పరిశుభ్రతా చర్యలు మరియు తల్లిపాలను తాపడాన్ని ప్రోత్సహించడం వంటి వాటితో కూడి ఉంటాయి. పోషకాహార వైవిధ్యం క్రమబద్ధ ఆహారంలోని ప్రాణాధార సూక్ష్మపోషకాహాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కూడి ఉంటుంది. దీన్ని విద్య మరియు వైవిధ్యపూరితమైన ఆహారం ఇవ్వడం ద్వారా, సూక్ష్మపోషకాహారం మరియు స్థానికంగా పండే ఆహారం ద్వారా సాధించవచ్చు.

దీర్ఘకాలిక వ్యాధులు[మార్చు]

దీర్ఘకాలిక సాంక్రమికేతర వ్యాధి యొక్క సాపేక్ష ప్రాధాన్యత పెరుగుతోంది. ఉదాహరణకు, ఊబకాయంతో ముడిపడిన టైప్ 2 డయాబెటిస్ స్థాయిలు సాంప్రదాయికంగా ఆకలికి పేరు పడిన దేశాలలో పెరుగుతూ వస్తున్నాయి. స్వల్పాదాయ దేశాలలో, మధుమేహం బారిన పడిన వ్యక్తుల సంఖ్య 2030 నాటికి ప్రస్తుత 84 మిలియన్ల నుంచి 228 మిలియన్లకు పెరగుతుందని భావిస్తున్నారు.[37] ఊబకాయం నిరోధించదగినది మరియు గుండె నాళాలకు సంబంధించిన పరిస్థితులు, మధుమేహం, గుండెపోటు, కేన్సర్లు మరియు శ్వాససంబంధిత వ్యాధుల వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటాయి. DALYచే లెక్కించబడిన ప్రపంచ వ్యాధుల సమస్యలో 16% వరకు ఊబకాయంతో ముడిపడి ఉంది.[37]

ఆరోగ్యపరమైన చర్యలు[మార్చు]

మెరుగుపర్చబడిన శిశు ఆరోగ్యం మరియు మనుగడ కోసం సాక్ష్యం ఆధారిత చర్యలు: తల్లిపాలను ప్రోత్సహించడం, జింక్ అనుబంధం ఇవ్వడం, విటమిన్ A రక్షణ మరియు అనుబంధం, ఉప్పు ఆయనీకరణం, చేతులు శుభ్రపర్చుకోవడం, టీకాలు వేయడం, తీవ్రమైన పోషకాహారలేమికి సంబంధించిన చికిత్స. మలేరియా సాంక్రమిక ప్రాంతాలలో దోమతెరలకు పూసే కీటక సంహారులు మరియు మధ్య మధ్య విరామాలతో చేసే ఔషధపరమైన చికిత్సలు మరణాలను తగ్గించగలవు.[38] [39] .[40] ఇలాంటి అధ్యయనాలపై ఆధారపడి ప్రపంచ ఆరోగ్య మండలి ప్రతి ఏటా లక్షలాదిమందిని కాపాడే 32 రకాల చికిత్స మరియు నివారణ చర్యల జాబితాను సూచించింది.[7]

చికిత్స సమర్థవంతంగా పనిచేయాలంటే రోగనిరోధక చర్యలనేవి స్థానిక అవసరాలకు తగినట్లుగా ఉండాలి, చికిత్సను సకాలంలో, అందరికీ వర్తింపజేస్తూ లక్షిత జనాభాను గరిష్ఠంగా చికిత్స పరిధిలోకి తీసుకురావడాన్ని సాధించాలి. జనాభాలో కొద్దిమందికి మాత్రమే చికిత్స అందించే చర్యలు అనేది ఖర్చు తగ్గించక పోవచ్చు. ఉదాహరణకు, తక్కువమందికి వర్తింపజేసే రోగనిరోధక కార్యక్రమం వ్యాధి తీవ్రతను తగ్గించడంలో తరచుగా విఫలమవుతుంటుంది. పైగా, ఔషధ పంపిణీని పరిగణనలోకి తీసుకోనట్లయితే ప్రమాద అంచనాలు తప్పుదోవ పట్టించవచ్చు. కాబట్టి, జాతీయ వ్యాప్తంగా చికిత్సను వర్తింపజేయడం అనేది న్యాయబద్దంగా కనిపించవచ్చు కాని సమగ్ర పరిశీలన చేసేటప్పుడు ఇది సమర్థ ఫలితాలను ఇవ్వక పోవచ్చు. ఈ పరిస్థితిని ‘కవరేజ్‌కి సంబంధించిన అవాస్తవం’గా చెప్పబడుతుంది.[41]

ఆరోగ్యపరమైన చర్యలను చేపట్టడంలో పురోగతి, ప్రత్యేకించి శిశు, ప్రసూతి ఆరోగ్యానికి (సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు 4 మరియు 5) సంబంధించి చేపట్టే చర్యలను UNICEF ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్ టు 2015 అని పిలువబడిన సహకారం ద్వారా 68 స్వల్పాదాయ దేశాలలో గమనించవచ్చు. ఈ దేశాలు 97% శిశు, ప్రసూతి మరణాలకు బాధ్యత వహిస్తున్నాయని అంచనా వేయబడింది.[8]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • అంతర్జాతీయ కుటుంబ ఆరోగ్యం
 • ప్రపంచ ఆరోగ్య డెలివరి ప్రాజెక్ట్
 • MEDICC

సూచనలు[మార్చు]

 1. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్యేషన్ అండ్ ది ట్రాన్సిషన్ ఫ్రొం "ఇంటర్నేషనల్ " టు" గ్లోబల్" పబ్లిక్ హెల్త్. బ్రౌన్ et al., AJPH: Jan 2006, Vol 96, No 1. http://www.ajph.org/cgi/reprint/96/1/62
 2. Global Health Initiative (2008). Why Global Health Matters. Washington, DC: FamiliesUSA.
 3. కోప్లన్ JP, బాండ్ TC, మెర్సన్ MH, et al; కంసోర్టి యం అఫ్ యూనివర్సీటీస్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఏక్షిక్యుటివ్ బోర్డు. ప్రపంచ ఆరోగ్యానికి సామాన్యమైన నిర్వచనం దిశగా. ల్యాన్సుట్ 2009;373:1993-1995.
 4. మాక్ఫర్లన్ SB, జాకబ్స్ M, కాయ EE. ఇన్ ది నెం అఫ్ గ్లోబల్ హెల్త్: విద్యా సంస్థల్లో పోకడల కోసం. J ప్రజా ఆరోగ్య విధానం. 29(4):383-401. 2008
 5. పటేల్ V, ప్రిన్స్ M. ప్రపంచ మానసిక ఆరోగ్యం - వయసు తో వచ్చే ఒక కొత్త ప్రపంచ ఆరోగ్య విధానం. JAMA. 2010;303:1976-1977.
 6. http://www.un.org/millenniumgoals/
 7. WHO యొక్క చరిత్ర , http://web.archive.org/20010802103138/www.who.int/library/historical/access/who/index.en.shtml
 8. బోచ్నేర్ et al., 1994, పేజీలు901
 9. సెన్, A. వై హెల్త్ ఈక్విటి? హెల్త్ ఈకాన్. 11: 659–666. 2002
 10. అంతర్జాతీయ ఆరోగ్య అసమానత్వాలు మరియు ప్రపంచ న్యాయం: ఒక పరిసమాప్తి సవాలు. డానియెల్స్, నార్మన్. http://iis-db.stanford.edu/evnts/4925/international_inequalities.pdf
 11. 11.0 11.1 ఎత్చేస్ V, ఫ్రాంక్ J, డి రుగ్గీరో E, మానుఎల్ D. జనాభా ఆరోగ్య కొలత: ఒక సూచికల సమీక్ష. Annu Rev ప్రజా ఆరోగ్యం. 2006;27:29-55.
 12. ప్లిస్కిన్, షేపార్డ్ మరియు వీన్స్టన్ (1980, కార్య పరిశోధన)
 13. EK ముల్హోల్లాండ్, L స్మిత్, I కార్నీరో, H బెచేర్, D లేహ్మన్న్. సమానత మరియు and శిశు -సంక్షేమ ప్రాణాళికలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క వార్తలు. 86(5):321-416. 2008.
 14. 14.0 14.1 లోపెజ్ AD, మతేర్స్ CD, ఎజ్జాటి M, జమిసన్ DT, ముర్రే CJ. గ్లోబల్ అండ్ రీజినల్ బర్డెన్ అఫ్ డిసీజ్ అండ్ రిస్క్ ఫాక్టర్, 2001: జనాభా ఆరోగ్య విషయముల క్రమ విశ్లేషణ. ల్యాన్సుట్ 367(9524):1747-57. 2006.
 15. “శిశు మరణాలు”, UNICEF గణాంకాలు, http://childinfo.org/areas/childmortality/.
 16. శస్త్రవైద్య సంబందమైన వ్యాధి ఒత్తిడి పై చర్చ,అనస్తీషియా మరియు సర్జరీ లో ప్రపంచ భాగస్వాములు [1].
 17. డెబాస్ H, గోస్సేలిన్ R, మక్ కార్డ్ C, తిండ్ A. సర్జరీ. ఇన్: జామిసన్ D, ed. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధి నిరోధక ప్రాధాన్యాలు . 2వ edn. న్యూయార్క్: ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2006.
 18. డోరుక్ ఒజ్గేద్స్జ్, డీన్ జామిసన్, మీనా చేరియాన్, కెల్లీ మక్ క్వీన్ చే వ్యాక్యలు. వైద్య సంభంద పరిస్తితుల భారం మరియు దిగువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో బద్రతా చికిత్సకు అనుమతి. బుల్ వరల్డ్ హెల్త్ ఆర్గాన్ [ఇంటర్నెట్ లో దారావాహికం ]. 2008 ఆగస్టు 1901 http://www.who.int/bulletin/volumes/86/8/07-050435/en/index.html. నుండి లభ్యం
 19. (WHO గ్లోబల్ బర్దెన్ అఫ్ డిసీస్ రిపోర్ట్ 2004 (అప్డేట్ 2008))
 20. మది షబిర్ A, లెవిన్ ఒరిన్ S, హజ్జే రానా, మన్సూర్ ఒస్మాన్ D, చెరియన్ థోమస్. నిమోనియా అరికట్టడానికి మరియు శిశు సంక్షేమానికి ఔషధం. బుల్ వరల్డ్ హెల్త్ ఆర్గాన్ [ఇంటర్నెట్ లో దారావాహికం ]. 2008 మే [cited 2009 జాన్ 04] ; 86(5): 365-372. లభ్యత: http://www.scielosp.org/scielo.php?script=sci_arttext&pid=S0042-96862008000500014&lng=en. doi: 10.1590/S0042-96862008000500014.
 21. http://www.childinfo.org/709.htm
 22. http://www.rotavirusvaccine.org/documents/WHO_position_paper_rotavirus_2007_000.pdf
 23. వలెన్షియ-మెండోజా A, బెర్తోజ్జి SM, గుతిర్రెజ్ JP, ఇట్జ్లేర్ R. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ ధరల్లో రోట వైరస్ టీకా కోసం: మెక్షికో లో ఒక కేస్.BMC ఇన్ఫెక్ట్ డిస్. 8.1 2008
 24. టేలర్ CE, గ్రీనఫ్ WB. అతిసార వ్యాధుల నిర్మూలన. Annu Rev ప్రజా ఆరోగ్యం. 1989;10:221-244
 25. విక్టోరియా CG, బ్రైస్ J, ఫోన్టైన్ O, మొనాస్చ్ R. రెడ్యుసింగ్ డెత్స్ ఫ్రొం డయేరియ త్రూ ఓరల్ రీ హైడ్రేషన్ థెరపి. బుల్ వరల్డ్ హెల్త్ ఆర్గన్. 2000;78(10):1246-౫౫.
 26. బిర్న్, A., పిల్లే, యోగన్, హొల్ట్జ్, T. (2009). ఇంటర్నేషనల్ హెల్త్ యొక్క పుస్తకం . 3వ సంచిక. ఆక్ష్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణ. పేజి 273
 27. బిర్న్, A., పిల్లే, యోగన్, హొల్ట్జ్, T. (2009). ఇంటర్నేషనల్ హెల్త్ యొక్క పుస్తకం . 3వ సంచిక. ఆక్ష్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణ. పేజి
 28. జాగరణ్ జోష్. "ఏప్రిల్ 25; ప్రపంచ మలేరియా దినోత్సవం". www.jagranjosh.com. మూలం నుండి 25 April 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 April 2018.
 29. WHO న్యూట్రిషన్ http://www.who.int/nutrition/challenges/en/index.html
 30. షియాబిల్ UE, కాఫ్మన్ SHE. మాల్న్యూట్రిషన్ అండ్ ఇన్ఫెక్షన్: కామ్ప్లెక్ష్ మేకానిజమ్స్ అండ్ గ్లోబల్ ఇంపాక్ట్స్. PLoS మెడిసిన్. 4( 5):e115. 2007 [2]
 31. విటమిన్.A సప్లిమెన్టేషన్
 32. లించ్ S, స్టోల్జ్ఫస్ R, రావత్ R. క్రిటికల్ రివ్యు అఫ్ స్ట్రాటజీస్ టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ ఐరన్ డెఫిష్యన్సి ఇన్ చిల్ద్రన్. ఫుడ్ Nutr బుల్. 28(4 Suppl):S610-20. 2007
 33. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; thelancet.com అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 34. లజ్జేరినియా M. ఎఫ్ఫెక్ట్ అఫ్ జింక్ సప్లిమెన్టేషన్ ఆన్ చైల్డ్ మోర్టాలిటి. లాన్సెట్ 370(9594):1194-1195. 2007
 35. సంక్షిప్తత మాత్రమే. Full article in print Feb 2008: ఫిస్చర్ వాకర్ CL, ఎజ్జాటి M, బ్లాక్ RE. గ్లోబల్ అండ్ రీజినల్ చైల్డ్ మోర్టాలిటి అండ్ బర్డెన్ అఫ్ డిసీజ్ యాట్రిబ్యుటబుల్ టు జింక్ డెఫిష్యన్సి. Eur J Clin Nutr. 2008 Feb 13
 36. లజ్జేరినియా M, రోన్ఫని L. ఓరల్ జింక్ ఫర్ ట్రీటింగ్ డయేరియ ఇన్ చిల్ద్రన్. కోఖ్రెన్ డేటాబేస్ అఫ్ సిష్టమ్యటిక్ రివ్యూస్ 2008, ఇష్యు 3 ఆర్ట్ No.:CDOO5436. DOI: 10.1002/14651858.CD005436.pub2
 37. 37.0 37.1 హోస్సైన్ P, కవర్ B, El నహాస్ M. ఒబెసిటి అండ్ డయాబెటీస్ ఇన్ ది డెవలపింగ్ వరల్డ్--ఏ గ్రోయింగ్ చాలెంజ్.N Engl J Med.356(3):213-5. 2007
 38. భుట్ట ZA, అహ్మద్ T, బ్లాక్ RE, కౌసేన్స్ S, దెవే K, గియుగ్లియాని E, హైదర్ BA, కిర్క్వుడ్ B, మోరిస్ SS, సచ్దేవ్ HP, శేకర్ M. వాట్ వర్క్స్? ఇంటర్వెన్షన్స్ ఫర్ మెటీరియల్ అండ్ చైల్డ్ అండర్ న్యుట్రీషన్ అండ్ సర్వైవల్.ల్యాన్సుట్ 371(9610):417-40. 2008
 39. లక్ష్మినారాయణ్ R, మిల్ల్స్ AJ, బ్రేమన్ JG, మీషం AR, అల్లెయ్నే G, క్లేసన్ M, ఝా P, మస్గ్రోవ్ P, చౌ J, షాహిద్-సల్లెస్ S, జామిసన్ DT. అడ్వాన్స్మెంట్ అఫ్ గ్లోబల్ హెల్త్: కీ మెస్సేజెస్ ఫ్రొం ది డిసీజ్ కంట్రోల్ ప్రయోరిటీస్ ప్రాజెక్ట్. ల్యాన్సుట్ 367: 1193–208. 2006
 40. జేన్నిఫెర్ బ్రియన్స్, రాబర్ట్ E బ్లాక్, నెఫ్ఫ్ వాకర్, జుల్ఫికార్ A భుట్ట, జాయ్ E లాన్, రిచార్డ్ W స్టేకేటి. క్యాన్ ది వరల్డ్ అఫ్ఫోర్డ్ టు సేవ్ ది లైవ్స్ అఫ్ 6 మిలియన్ చిల్డ్రన్ ఈచ్ ఇయర్? లాన్సట్, సంచిక 365, ఇష్యు 9478, 25 జూన్ 2005-1 జూలై 2005, పేజీలు 2193-2200
 41. వంచన వ్యాప్తి:వాస్తవాల ద్వారా రోగనిరోధక శక్తి శాతాన్ని మెరుగుపరచడంకోసం అసమానతల నిర్మూలన. కనడియన్ ఇంటర్నేషనల్ ఇమ్యునైజ్యేషన్ ఇనీషియేటివ్ ఫేస్ 2 నుండి ఫలితాలు - కార్య పరిశోధన గ్రాంట్లు. షర్మిల L మ్హత్రే అండ్ అన్నే-మారి స్చర్యర్-రాయి. BMC ఇంటర్నేషనల్ హెల్త్ అండ్ హ్యూమన్ రైట్స్ 2009, 9(Suppl 1):S1. doi:10.1186/1472-698X-9-S1-S1

మరింత చదవడానికి[మార్చు]

 • జాకబ్సేన్ KH (2008) ఇంట్రడక్షన్ టు గ్లోబల్ హెల్త్. జోన్స్ మరియు బార్లెట్
 • స్కోల్నిక్ R (2008) ఎసెన్షియాల్ పబ్లిక్ హెల్త్: ఎసెన్షియాల్స్ అఫ్ గ్లోబల్ హెల్త్. జోన్స్ మరియు బార్లట్ట్ .
 • లెవిన్ R (Ed) (2007) ఎసెన్షియాల్ పబ్లిక్ హెల్త్: ప్రపంచ ఆరోగ్యంలో అధ్యయనాలు. జోన్స్ మరియు బార్లట్ట్.
 • ఈ యొక్క పుస్తకాలు హుల్ విశ్వవిద్యాలయం హెల్త్ & సోషల్ కేర్ అద్యాపకుల నుండి గ్రహింపబడినవి. అవి ప్రధానముగా BSc గ్లోబల్ హెల్త్ అండ్ డిసీజ్ (ఇంటర్నేషనల్ హెల్త్ డెవలప్మెంట్ అండ్ హ్యుమానిటేరియన్ రిలీఫ్) మరియు ప్రపంచ ఆరోగ్య అధ్యాయం I మరియు ప్రపంచ ఆరోగ్య I అధ్యాయంలో ప్రస్తుత వ్యవహారములలో ముఖ్య పఠనములు.
 • ప్రపంచ ఆరోగ్యం ఆవిష్కరణ స్టీవెన్ పాల్మర్. అన్న్ అర్బోర్, మిచిగాన్ విశ్వవిద్యాలయ ముద్రణ, 2010.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Public health