ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
|
|
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. |
| This article is outdated. (April 2010) |
ప్రపంచ- లేదా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అనేది సాధారణంగా ప్రపంచ దేశాలు, జాతీయ ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను ప్రస్తావిస్తుంది. అలాగే గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అనేది గ్లోబల్ సమాజ ఆర్థిక వ్యవస్థ మరియు జాతీయ ఆర్థికవ్యవస్థ -గ్లోబల్ సమాజాలను రూపొందించే స్థానిక సమాజాల ఆర్థిక వ్యవస్థలుగా చూడబడుతుంది. ఇది పలు రీతులలో లెక్కించబడుతుంది. ఉదాహరణకు, ఉపయోగించిన నమూనాపై ఆధారపడి, అంచనా వేయబడిన మదింపు 2006 US డాలర్లు వంటి నిర్దిష్ట కరెన్సీలో ప్రతిఫలిస్తుంది.
ఇది భూమి యొక్క భౌగోళికత, పర్యావరణం నుంచి విడదీయరానిది, అందుచేత, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ" యొక్క నిర్వచనాలు, ప్రాతినిధ్యాలు విభిన్నంగా ఉంటున్నందున, భూమి వెలుపల ఆధారపడిన ఏ వనరులు లేదా విలువ నిర్ధారణనైనా కనీసంగా మినహాయించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, అంటార్కిటికాలోని నిర్ధారించబడని భూభాగంలో ప్రస్తుతం ఉపయోగించుకోని మైనింగ్ అవకాశాల విలువ మదింపుకు ప్రయత్నాలు జరిగేటప్పుడు, అంగారక గ్రహంలో అదేవిధమైన అవకాశాలు ఉంటే వాటిని ప్రస్తుతం ఏదో ఒక రీతిలో ఉపయోగించుకుంటున్నప్పటికీ, అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగంగా పరిగణించబడవు మరియు ఇంతకుముందే గర్భితమై ఉన్న ఆవిష్కరణ వంటి సృష్టించబడని మేధో సంపదలో భాగంగా ప్రచ్ఛన్న విలువగా మాత్రమే ఇవి గుర్తించబడతాయి.
భూగ్రహం మీద జరుగుతున్న ఉత్పత్తి, ఉపయోగం మరియు పంపిణీలో కనీస ప్రమాణానికి సంబంధించిన విలువకు వెలుపల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వచనాలు, ప్రాతినిధ్యాలు, నమూనాలు మరియు మదింపులు చాలా విస్తారంగా ఉంటాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలను ప్రధానంగా మానవ ఆర్థిక కార్యాచరణకు పరిమితం చేయడం సాధారణమైపోయింది, కొన్ని రకాల సరుకులు లేదా సర్వీసులను మదింపు చేయడంలో సాయపడడానికి ఎటువంటి సమర్ద మార్కెట్ లేని సందర్భాలలో లేదా స్వతంత్ర పరిశోధన లేదా ప్రభుత్వ సహకారం అనేవి లేనప్పుడు సంఖ్యలను నిర్ణయించడం కష్టసాధ్యమైన సందర్భాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్య పరిమితులలోనే నిర్ణయించబడుతుంది. ఇందుకు విలక్షణమైన ఉదాహరణలు అక్రమ మాదక ద్రవ్యాలు మరియు ఇతర బ్లాక్ మార్కెట్ సరకులు, ఇవి ఏ ప్రమాణం నుంచి చూసినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతాయి, కాని నిర్వచనం ద్వారా ఎలాంటి లీగల్ మార్కెట్ కూడా ఉండదు.
అయితే, ద్రవ్య విలువను ఏర్పర్చడానికి స్పష్టమైన మరియు సమర్థవంతమైన మార్కెట్ ఉన్న సందర్భాలలో కూడా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం ఒకే యూనిట్‌గా ఈ మార్కెట్ యొక్క ద్రవ్య విభాగాలను పరివర్తింపజేసేందుకు ప్రస్తుత లేదా అధికారికి పంపిణీ రేటును ఆర్థిక వేత్తలు ప్రత్యేకించి ఉపయోగించరు, ఎందుకంటే పంపిణీ రేట్లు ప్రపంచ వ్యాప్త విలువను సమీపంగా కూడా ప్రతిఫలించవు, ఉదాహరణకు నగదు వ్యవహారాల పరిమాణం లేదా ధర అనేవి ప్రభుత్వం చేత నిశితంగా క్రమబద్దీకరించబడుతాయి.
పైగా, స్థానిక కరెన్సీలోని మార్కెట్ అంచనాలు కొనుగోలు శక్తి యొక్క భావనను ఉపయోగించుకుని ఏకైక ద్రవ్య యూనిట్‌కి వర్తింబజేయబడతాయి. ఇది కింద ఉపయోగించబడిన పద్ధతి, రియల్ US డాలర్ల రూపంలోని ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలను అంచనా వేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక విధాలుగా మదింపు చేయబడుతుంది మరియు వ్యక్తీకరించబడుతుంది. ఉదాహరణకు, ప్రపంచంలోని 6.8 బిలియన్ ప్రజలలో ఎంతమంది ఈ అంచనాలలో తమ ఆర్థిక కార్యాచరణను కలిగి ఉన్నారు అనేది స్పష్టం కాలేదు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థికవ్యవస్థలు U.S.A, U.K., చైనా, [[జపాన్|జపాన్/3}, జర్మనీ, రష్యా మరియు ఫ్రాన్స్]].
విషయ సూచిక
ఆర్థిక వ్యవస్థ - స్థూల పరిశీలన[మార్చు]
2007–2008[మార్చు]
ప్రపంచ ఉత్పత్తి (స్థూల ప్రపంచ ఉత్పత్తి) (GWP) 2008లో 3.2 శాతం పెరిగింది, చైనా (9%, ప్రపంచ వృద్ధిలో 21% శాతం), US (1.1%, లేదా 12% పెరుగుదల), ది యూరోపియన్ యూనియన్ (0.9%, 10.5% అభివృద్ధిలో వాటా) మరియు ఇండియా (7.3%, మొత్తం పెరుగుదలలో 5.6%). 12 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు (యుఎస్, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, రష్యా, స్పెయిన్, బ్రెజిల్, కెనడా, ఇండియా) 2008లో మొత్తం ఆర్థిక వృద్దిలో సగ భాగాన్ని అందించాయి.[1]
సంపన్న లేదా పురోగామి ఆర్థిక వ్యవస్థలలోని వృద్ది ఫలితాలు 2007లో ఉన్న 2.7 శాతం నుంచి, 2008లో కేవలం 0.9 శాతంకి అంటే మూడింట రెండువంతులకు పడిపోయాయి. వృద్ది చెందుతున్న ఆసియా 9.8 నుంచి 6.8 శాతానికి క్షీణించింది, వృద్ది చెందుతున్న యూరప్ 5.4 నుంచి 2.9 శాతానికి పడిపోగా, కామన్వెల్త్ స్వతంత్ర రాజ్యాలు 8.6 నుంచి 5.5కి క్షీణించిపోయాయి. (OECD యేతర) పశ్చిమ ధృవ ప్రాంతం 5.7 నుంచి 4.2 శాతానికి, మధ్యప్రాచ్యం 6.3 నుంచి 5.9కి, ఆఫ్రికా 6.2 నుంచి 5.2 కు పడిపోయాయి. [2]
బాహ్యంగా, జాతీయ రాజ్యం, కఠినమైన ఆర్థిక-రాజకీయ సంస్థగా అంతర్జాతీయంగా ప్రజలు, సరకులు, నిధులు మరియు టెక్నాలజీ ప్రవాహంపై నియంత్రణను క్రమంగా కోల్పోతోంది. కేంద్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాధికారాన్ని కోల్పోతున్నాయి మరియు వాటి అంతర్జాతీయ సామూహిక శక్తిని మెరుగుపర్చుకుంటున్నాయి, ప్రజాస్వామికంగా తాము భాగం కావాలనుకుంటున్న, ప్రత్యేకించి EU వంటి బలమైన ఆర్థిక సంస్థలకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవలసి ఉంది. ఒక సమీకృత ఆర్థిక శక్తికి దారి తీస్తూ, 1999 జనవరిలో పశ్చిమ యూరప్ యొక్క కామన్ కరెన్సీగా యూరోని పరిచయం చేయడం ఆర్థిక నష్ట భయాలను తీసుకువచ్చింది, భాగస్వామ్య దేశాల మధ్య పలు ఆదాయ స్థాయిలు, సాంస్కృతిక మరియు రాజకీయ విభేదాలు దీనికి కారణం.
అంతర్గతంగా, కేంద్ర ప్రభుత్వం జాతి ప్రాతిపదికన చెలరేగుతున్న వేర్పాటువాద ప్రాంతీయ ఉద్యమాల కారణంగా వనరులపై నియంత్రణను కోల్పోవడం పెరుగుతోంది, మునుపటి సోవియట్ యూనియన్, మునుపటి యుగోస్లేవియా, ఇండియా, ఇరాక్ మరియు ఇండోనేషియాలలోని కొత్త రాజ్యాలు ఇందుకు ఉదాహరణ.
గణాంక సూచికలు[మార్చు]
ఆర్థిక వ్యవస్థ[మార్చు]
- GDP (GWP) (స్థూల ప్రపంచ ఉత్పత్తి): (కొనుగోలు శక్తి సమాన మారకపు రేట్లు ) - $59.38 ట్రిలియన్ (2005 అంచనా), $51.48 ట్రిలియన్ (2004), $23 ట్రిలియన్ (2002)
- GDP (GWP) (స్థూల ప్రపంచ ఉత్పత్తి):’’’[3] (మార్కెట్ మారకపు రేట్లు) - $60.69 ట్రిలియన్ (2008)
- GDP - వాస్తవ వృద్ధి రేట్లు: 3.2% (2008), 3.1% p.a. (2000-07), 2.4% p.a. (1990-99), 3.1% p.a. (1980-89)
- GDP - తలసరి: కొనుగోలు శక్తి సమార్హత - $9,300 (౨౦౦౫ అంచనా), $8,200 (92) (2003), $7,900 (2002)
- 2005 - రంగంవారీ సమ్మేళనం: వ్యవసాయం: 4%; పరిశ్రమ: 32%; సేవలు: 64% (2004 అంచనా)
- ద్రవ్యోల్బణ రేటు (వినియోగదారు ధరలు): అభివృద్ధి చెందిన దేశాలు 1% నుంచి 4% వరకు విలక్షణంగా; అభివృద్ది చెందుతున్న దేశాలు 5% నుంచి 60% విలక్షణంగా; జపాన్‌లో పెరుగుతున్న ధరల నుంచి పలు మూడవ ప్రపంచ దేశాలలో హైపర్ ఇన్‌ప్లేషన్ వరకు జాతీయ ద్రవ్యోల్బణ రేట్లు వ్యక్తిగత సందర్భాలలో పూర్తి విభిన్నంగా ఉంటాయి (2003)
- డెరైవేటివ్‌లు జాతీయ మొత్తాన్ని మించిపోతున్నాయి : $273 ట్రిలియన్ (2004 జూన్ చివరినాటికి) $84 ట్రిలియన్ (1998 జూన్ చివరినాటికి) ([1])
- గ్లోబల్ రుణ జారీ : $5.187 ట్రిలియన్ (2004), $4.938 ట్రిలియన్ (2003), $3.938 ట్రిలియన్ (2002) (థామ్సన్ ఫైనాన్షియల్ లీగ్ టేబుళ్లు)
- గ్లోబల్ ఈక్విటీ జారీ : $505 బిలియన్ (2004), $388 బిలియన్ (2003), $319 బిలియన్ (2002) (థామ్సన్ ఫైనాన్షియల్ లీగ్ టేబుళ్లు)
ఉపాధి[మార్చు]
- నిరుద్యోగితా రేటు: 8.7% (2009 అంచనా). 30% (2007 అంచనా) అనేక పారిశ్రామికేతర దేశాల్లో కలగలిసిపోయిన నిరుద్యోగిత మరియు నిరుద్యోగితలో కూరుకుపోవడం; అభివృద్ధి చెందిన దేశాలలో ప్రత్యేకించి 4%-12% నిరుద్యోగిత.
పరిశ్రమలు[మార్చు]
- పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు: 3% (2002 est.)
ఇంధనం[మార్చు]
- ప్రతి ఏడాది విద్యుత్తు - ఉత్పత్తి: 15,850,000 GWh (2003 అంచనా), 14,850,000 GWh (2001 అంచనా)
- ప్రతి ఏడాది విద్యుత్తు - వినియోగం: 14,280,000 GWh (2003 అంచనా), 13,930,000 GWh (2001 అంచనా)
- చమురు - ఉత్పత్తి: 7,96,50,000 bbl/d (1,26,63,000 m3/d) (2003 అంచనా), 7,54,60,000 barrels per day (1,19,97,000 m3/d) (2001)
- చమురు - వినియోగం: 8,01,00,000 bbl/d (1,27,30,000 m3/d) (2003 అంచనా), 7,62,10,000 barrels per day (1,21,16,000 m3/d) (2001)
- చమురు - తేలిన నిల్వలు: 1.025 ట్రిలియన్ బ్యారెల్ (163 km³) (2001 అంచనా)
- సహజ వాయువు - ఉత్పత్తి: 2,569 km³ (2001 అంచనా)
- సహజ వాయువు - వినియోగం: 2,556 km³ (2001 అంచనా)
- సహజ వాయువు - తేలిన నిల్వ: 161,200 km³ (1 జనవరి 2002)
సీమాంతరం[మార్చు]
- ప్రతి ఏడాది ఎగుమతులు : $12.4 ట్రిలియన్ (2009 అంచనా)
- ఎగుమతులు - సరకులు: పారిశ్రామిక మరియు వ్యావసాయిక సరకులు మరియు సేవల మొత్తం శ్రేణి
- ఎగుమతులు - భాగస్వాములు: US 12.7%, జర్మనీ 7.1%, చైనా 6.2%, ఫ్రాన్స్ 4.4%, జపాన్ 4.2%, యూకే 4.1% (2008)
- ప్రతి ఏడాది దిగుమతులు: $12.29 ట్రిలియన్ (2009 అంచనా)
- దిగుమతులు - సరకులు: పారిశ్రామిక మరియు వ్యావసాయిక సరకులు మరియు సేవల మొత్తం శ్రేణి
- దిగుమతులు - భాగస్వాములు: చైనా 10.3%, జర్మనీ 8.6%, యూఎస్ 8.1%, జపాన్ 5% (2008)
- రుణం- బాహ్యం: $56.9 ట్రిలియన్ (31 డిసెంబర్ 2009 అంచనా)
బహుమతి ఆర్థికవ్యవస్థ[మార్చు]
- ప్రతి ఏడాది ఆర్థిక సహాయం - స్వీకర్త: అధికారిక అభివృద్ధి సహాయం (ఓడీఏ) $50 బిలియన్
కమ్యూనికేషన్‌లు[మార్చు]
టెలిఫోన్‌లు - ఉపయోగంలో ఉన్న మెయిన్ లైన్లు: 843,923,500 (2007)
4,263,367,600 (2008)
- టెలిఫోన్లు- మొబైల్ సెల్యులర్: 3,300,000,000 (నవంబర్. 2007)[4]
- ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పిలు): 10,350 (2000 అంచనా)
- ఇంటర్నెట్ వినియోగదారులు: 1,311,050,595 (జనవరి 18, 2008 [2] అంచనా), 1,091,730,861 (డిసెంబర్ 30, 2006 [3] అంచనా), 604,111,719 (2002 అంచనా)
రవాణా[మార్చు]
రవాణా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంది:
- విమానాశ్రయాలు
- మొత్తం: 49,973 (2004)
- రహదారి మార్గాలు (కిలోమీటర్లలో)
- మొత్తం: 32,345,165 కిలోమీటర్లు
- నిర్మించినవి: 19,403,061 కిలోమీటర్లు
- నిర్మించనివి: 12,942,104 కిలోమీటర్లు (2002)
- రైల్వేలు
- మొత్తం: 1,122,650 కిలోమీటర్లు 190,000 నుంచి 195,000 కిలోమీటర్లు విద్యుత్ మార్గాలతో సహా, వీటిలో 147,760 కిలోమీటర్లు యూరోప్‌లో, 24,509 కిలోమీటర్లు దూరప్రాచ్యంలో, 11,050 కిలోమీటర్లు ఆఫ్రికాలో, 4,223 కిలోమీటర్లు సౌత్ అమెరికాలో, మరియు 4,160 కిలోమీటర్లు నార్త్ అమెరికాలో ఉన్నాయి.
సైన్యం[మార్చు]
- మిలటరీ నిర్వహణా ఖర్చులు - డాలర్లలో: 1999లో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలపై పెట్టిన సగటు వాస్తవ వ్యయం దాదాపుగా 1998 స్థాయిలో కొనసాగుతోంది, $750 బిలియన్, దీంట్లో 1/2 మొత్తం యునైటెడ్ స్టేట్స్ (1999)లోనే ఉంది.
- మిలటరీ నిర్వహణా ఖర్చులు - శాతంలో GDP: సరాసరిగా నికర ప్రపంచ ఉత్పత్తిలో 2% (1999).
వీటిని కూడా చూడండి[మార్చు]
- Common Wealth: Economics for a Crowded Planet (బుక్)
- ప్రపంచీకరణ
- ప్రపంచీకరణ
- వాణిజ్య మార్గం
- ప్రపంచ వాణిజ్య నివేదిక
- The World Economy: Historical Statistics
ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు:
- ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ
- ఆసియా ఆర్థిక వ్యవస్థ
- యూరోప్ ఆర్థిక వ్యవస్థ
- నార్త్ అమెరికా ఆర్థిక వ్యవస్థ
- ఓషియానా ఆర్థిక వ్యవస్థ
- అమెరికా ఆర్థిక వ్యవస్థ
సంఘటనలు
- 2007–2008 ప్రపంచ ఆహార ధరల సంక్షోభం
- 2000వ దశకం చివర్లో మాంద్యం
- 2003 నుంచి నూనె ధర పెరుగుతోంది
జాబితాలు
- జీడీపీ సెక్టార్ కాంపోజీషన్లో దేశాల జాబితా
- ప్రపంచ అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థల జాబితా(లాంఛనం) - ప్రస్తుత కరెన్సీ మార్కెట్ మారకపు రేట్లపై ఆధారపడినవి
- ప్రపంచ అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థల జాబితా (పీపీపీ) -కొనుగోలు శక్తి సమార్హతపై ఆధారపడినవి
- ప్రపంచ అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థల చారిత్రక జాబితా (పేరుకు మాత్రమే) - 1998 మరియు 2003 సంవత్సరాల మధ్య
- హిస్టారికల్ లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ (పీపీపీ) - 1 మరియు 1998 సంవత్సరాల మధ్య
సూచనలు[మార్చు]
- ↑ ఐఎంఎఫ్ ‘’వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్, ఏఫ్రిల్ 2009 http://www.imf.org/external/pubs/ft/weo/2009/01/index.htm
- ↑ ఐఎంఎఫ్
- ↑ ఐఎంఎఫ్ ‘’ఆల్ ఎకానమీ, ఏఫ్రిల్ 2009 http://www.imf.org/external/pubs/ft/weo/2009/01/index.htm
- ↑ ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగం 50 శాతంకి చేరుకుంది