ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం
జరుపుకొనే రోజు15 అక్టోబరు
ఉత్సవాలు"మన చేతులు, మన భవిష్యత్తు!"
సంబంధిత పండుగMenstrual hygiene day
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 15న నిర్వహించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంకోసం ప్రతిరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.[1]

చరిత్ర[మార్చు]

అతిసార, శ్వాస కోస వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దీనికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబరు 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించింది.[2]

లక్ష్యాలు[మార్చు]

  1. తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయించడం
  2. చేతి శుభ్రతపై అవగాహన కల్పించి అంటురోగాలను అరికట్టడం, శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని చెప్పడం

కార్యక్రమాలు[మార్చు]

  1. ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా చేతులు - పరిశుభ్రత కార్యక్రమం అమలు
  2. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా 2015లో మధ్యప్రదేశ్‌ గిన్నిస్‌ రికార్డులను నమోదు చేసింది. అక్టోబర్‌ 15న రాష్ట్రంలోనే 51 జిల్లాల నుంచి 12,76,425 మంది చిన్నారులు చేతులు కడిగే కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్‌ రికార్డు సాధించారు.[3]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, మహబూబాబాద్ (15 October 2019). "రోగాలను కడిగేద్దాం". www.ntnews.com. Archived from the original on 20 October 2019. Retrieved 20 October 2019.
  2. ఆంధ్రభూమి, సంపాదకీయం (15 October 2019). "మన చేతుల్లో మన ఆరోగ్యం". andhrabhoomi.net. కె.రామ్మోహన్‌రావు. Archived from the original on 16 October 2019. Retrieved 20 October 2019.
  3. ప్రజాశక్తి, రాజోలు (తూర్పుగోదావరి) (15 October 2019). "చేతుల శుభ్ర‌త‌తోనే ఆరోగ్యా‌నికి ర‌క్ష‌". www.prajasakti.com. డాక్టర్‌ ప్రభాకర్‌. Archived from the original on 15 October 2019. Retrieved 20 October 2019.

ఇతర లంకెలు[మార్చు]