ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
ప్రపంచ టాయిలెట్ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచ వ్యాప్తంగా |
జరుపుకొనే రోజు | 19 నవంబర్ |
సంబంధిత పండుగ | UN-Water (convener), World Toilet Organization (initiator) |
ఆవృత్తి | వార్షిక |
ప్రపంచ టాయిలెట్ డే అనేది ప్రపంచ పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్యను ప్రేరేపించడానికి నవంబర్ 19 న అధికారిక ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆచార దినం.[1][2]ప్రపంచవ్యాప్తంగా, 4.2 బిలియన్ ప్రజలు " సురక్షితంగా నిర్వహించబడే పారిశుధ్యం " లేకుండా నివసిస్తున్నారు, సుమారు 673 మిలియన్ల మంది బహిరంగ మలవిసర్జనను అభ్యసిస్తున్నారు. : 74 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 అందరికీ పారిశుద్ధ్యాన్ని సాధించడం, బహిరంగ మలవిసర్జనను ముగించడం.[3] ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా చర్య తీసుకోవడానికి ప్రజలకు తెలియజేయడానికి, నిమగ్నమవ్వడానికి, ప్రేరేపించడానికి ప్రపంచ మరుగుదొడ్డి దినం ఉంది.
చరిత్ర
[మార్చు]2001 లో, సింగపూర్ లో దాత జాక్ సిమ్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ నవంబర్ 19 ను ప్రపంచ టాయిలెట్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రజల గుర్తింపు కోసం ఒత్తిడి చేసిం, 2007 సంవత్సరంలో సుస్థిర పారిశుద్ధ్య కూటమి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవానికి మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. 2010లో ఐక్యరాజ్యసమితి నీరు, పారిశుద్ధ్యంపై మానవ హక్కును ప్రాథమిక మానవ హక్కుగా ప్రకటించడంతో, ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం ఒక దృగ్విషయంగా మారింది. ప్రపంచములోని అందరికి పారిశుధ్యం, పరిశుభ్రత, శుభ్రమైన మరుగుదొడ్లు ప్రాథమిక మానవ హక్కులు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ప్రజలు కలిసి పారిశుద్ధ్యం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. పారిశుద్ధ్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను అన్వేషించడానికి వారు ప్రయత్నిస్తారు.
పారిశుద్ధ్యం ప్రాథమిక మానవ హక్కు. ఏ ప్రదేశంలోనైనా మంచి పారిశుధ్యం అవసరం చాలా ముఖ్యం. బహిరంగ మలవిసర్జన,పరిశుభ్రత లేకపోవడం తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన, సరైన పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడం ఇప్పటికీ ఆ యా దేశాలలో మనము పరిశీలించవచ్చును. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం మరుగుదొడ్లకు సరైన ప్రాప్యతను కలిగి ఉండాల్సిన అవసరాన్ని, రోజువారీ జీవనశైలిలో మంచి పరిశుభ్రతను కలిగి ఉండటం అవసరాన్ని తెలియజేస్తుంది[4].
ప్రస్తుత పరిస్థితి
[మార్చు]మరుగుదొడ్డి అందుబాటులో లేకుండా నివసిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో బిలియన్ల మంది ప్రపంచ పారిశుద్ధ్య సంక్షోభాన్ని మానవాళికి తెలియచేస్తుంది. శుభ్రమైన, సురక్షితమైన మరుగుదొడ్లు లేకుండా, మానవ వ్యర్థాలు (పూప్) దీనితో ఆహారం, నీటి వనరులను కలుషితం కావడం, ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది, ఎందుకంటే ప్రజలకు మరుగుదొడ్డి అందుబాటులో లేనప్పుడు, వారు బహిరంగ మలవిసర్జన వెళతారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనీసం 892 మిలియన్ల మంది బహిరంగ మలవిసర్జనను కొనసాగిస్తున్నారు. దీనితో తరచుగా డయేరియా వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుంది. పారిశుధ్య లోపం, కలుషిత నీటి వనరుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 1,000 మంది చిన్నారులు డయేరియాతో మరణిస్తున్నారు. సురక్షితమైన పారిశుధ్యం, మంచి పరిశుభ్రత పాటించడం, సురక్షితమైన నీటి సరఫరా సంవత్సరానికి చేస్తే, సుమారు 350,000 కంటే ఎక్కువ మంది పిల్లల ప్రాణాలను మనము కాపాడినవారం అవుతాము.
అవసరం
[మార్చు]అధిక వర్షాలు, భూకంపాల వంటి సంక్షోభ సమయాల్లో పరిశుభ్రమైన ,సురక్షితమైన మరుగుదొడ్లను త్వరితగతిన అందించడం ప్రజలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. తగినంత మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం ప్రజారోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది, తద్వారా కలరా, విరేచనాలు, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధుల వ్యాప్తికి దారితీస్తుంది. భూకంప ప్రభావిత టర్కీలో, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో మొబైల్ టాయిలెట్ల పంపిణీ కీలకం గా ఉన్నది.ఇందుకోసం వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండటానికి,వ్యాప్తి చెందకుండా, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు వీలుగా పరిశుభ్రత కిట్లను పంపిణీ చేస్తున్నారు[5].
మూలాలు
[మార్చు]- ↑ "What is World Toilet Day?". World Toilet Day. Archived from the original on 15 నవంబరు 2017. Retrieved 16 November 2017.
- ↑ "Call to action on UN website" (PDF). Retrieved 19 October 2014.
- ↑ "Goal 6: Ensure access to water and sanitation for all". United Nations. Retrieved 18 November 2017.
- ↑ "World Toilet Day 2023: Date, history and significance". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-11-17. Retrieved 2023-12-23.
- ↑ "The toilet as a symbol of health and dignity—World Toilet Day 2023 - Angola | ReliefWeb". reliefweb.int (in ఇంగ్లీష్). 2023-11-16. Retrieved 2023-12-23.