ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు.[1][2]

A female house sparrow feeding a fledgling
ఆడ పిచ్చుక ఆహారాన్ని తినిపిస్తున్న దృశ్యం

ప్రాముఖ్యత[మార్చు]

పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాల లోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బావులలోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకొని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తని పీచు వట్టి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరెంత వరకు జాగ్రతగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు, ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించిన ప్రపంచ దేశాలు "ప్రపంచ పిచ్చుకల దినోత్సవము" నాడు పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి.

పిచ్చుక అవార్డులు[మార్చు]

పిచ్చుకల సంరక్షణ చేయుటకు, ప్రజలకు ప్రోత్సహించుటకు ఎన్.ఎఫ్.ఎస్ సంస్థ మొదటిసారి పిచ్చుకల అవార్డులను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో మార్చి 20,2011 న ప్రారంభించింది.

పిచ్చుకల అవార్డు విజేతలు 2014[మార్చు]

 • మోహన్ గార్గ్
 • ఎన్. షెహజాద్ & ఎం. సౌద్
 • జల్ గ్రాహన్ కామేటి, పిప్లాంట్రి

పిచ్చుకల అవార్డు విజేతలు 2013[మార్చు]

 • సలీమ్ హమీదీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఇలస్ట్రేటర్
 • ఆబిద్ సుర్తి, లిటరేటూర్ & ఎన్జిఓ హెడ్, డ్రాప్ డెడ్
 • జయంత్ గోవింద్ దుఖండే, ముంబై పోలీసులు

పిచ్చుకల అవార్డు విజేతలు 2012[మార్చు]

 • Dilsher Khan
 • Ramita Kondepudi
 • Individuals(VikramYende, Kapil Jadhav, Mahendra Khawnekar and Vishal Revankar )
 • Mahatma Gandhi Ashramshala

పిచ్చుకల అవార్డు విజేతలు 2011[మార్చు]

 • Bhavin Shah
 • Narendra Singh Chaudhary
 • L Shyamal
 • The Sparrow Company[3]

మూలాలు[మార్చు]

 1. "'Save sparrows for nature's balance'". Times of India. Bennett, Coleman & Co. 21 March 2012. Archived from the original on 2013-04-10. Retrieved 2015-03-21.
 2. Sathyendran, Nita (21 March 2012). "Spare a thought for the sparrow". The Hindu. Retrieved 22 March 2012.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-06. Retrieved 2015-03-21.

వెలుపలి లంకెలు[మార్చు]

 • ఈనాడు దినపత్రిక - 20-03-2015 - (ఏవీ పిచ్చుకల కిలకిలలు)

ఇతర లింకులు[మార్చు]