Jump to content

ప్రపంచ బిలియనీర్ల జాబితా

వికీపీడియా నుండి

ది వరల్డ్స్ బిలియనీర్స్
నికర ఆస్తుల ఆధారంగా ప్రపంచ కుబేరుల జాబితా
ప్రపంచ కుబేరుల నికర సంపద 2000లో $1 ట్రిలియన్ కంటే తక్కువ నుండి 2025 నాటికి $16 ట్రిలియన్లకు పైగా పెరిగింది.
ప్రచురణ వివరాలు
ప్రచురణకర్త
  • వేల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్
  • ఫోర్బ్స్ కుటుంబం
ప్రచురణఫోర్బ్స్
మొదటి ప్రచురణమార్చి 1987
తాజా ప్రచురణ 2026 మార్చి 10
2026 జాబితా వివరాలు[1]
అత్యంత ధనవంతులుఎలాన్ మస్క్
నికర ఆస్తులు (1వ స్థానం)Increase US$852 బిలియన్లు
బిలియనీర్ల సంఖ్యIncrease 3,428 (3,028 నుండి)
జాబితా మొత్తం నికర సంపదIncrease US$20.1 ట్రిలియన్లు (US$16.1 ట్రిలియన్ల నుండి)
మహిళల సంఖ్యIncrease 481
పురుషుల సంఖ్యIncrease 2,947
జాబితాలో కొత్త సభ్యులుIncrease 309
ప్రపంచ కుబేరుల జాబితా 2026
The World's Billionaires

ది వరల్డ్స్ బిలియనీర్స్ అనేది అమెరికన్ వ్యాపార మ్యాగజైన్ ఫోర్బ్స్ ఏటా ప్రచురించే కుబేరుల జాబితా. కనీసం 1 బిలియన్ డాలర్ల నికర ఆస్తులు ఉన్నవారిని ఇందులో చేరుస్తారు. ఈ జాబితాను మొదటిసారిగా 1987 మార్చిలో ప్రచురించారు. జాబితాలోని ప్రతి వ్యక్తి నికర సంపదను వారి డాక్యుమెంట్ చేసిన ఆస్తులు, అప్పులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అమెరికన్ డాలర్లలో అంచనా వేస్తారు. పదవుల ద్వారా సంపద పొందే రాజ కుటుంబీకులు, నియంతలను ఈ జాబితాల నుండి మినహాయించారు. అధికారికంగా ధృవీకరించిన ఆస్తుల ఆధారంగా మాత్రమే ఈ జాబితాను రూపొందిస్తారు. సంపదను కచ్చితంగా అంచనా వేయలేని వ్యక్తులకు ఇందులో స్థానం ఉండదు.[2]

2018లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటిసారిగా అగ్రస్థానంలో నిలిచారు, ఈ ర్యాంకింగ్‌లో చేరిన మొదటి సెంటిబిలియనీర్‌గా అవతరించారు.[3] అంతకుముందు 24 సంవత్సరాలలో 18 సార్లు అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను ఆయన అధిగమించారు.[4] నాలుగేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న బెజోస్‌ను 2022లో ఎలాన్ మస్క్ అధిగమించారు. 2023లో కేవలం ఏడాది పాటు అగ్రస్థానంలో ఉన్న మస్క్‌ను ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించారు. జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఫ్రెంచ్ వ్యక్తిగా ఆర్నాల్ట్ గుర్తింపు పొందారు. 2025లో ఆర్నాల్ట్‌ను అధిగమించి మస్క్ మళ్లీ అత్యంత ధనవంతుడిగా అవతరించారు.[5]

విధానం

[మార్చు]

ప్రతి సంవత్సరం, ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా విలేకరుల బృందాన్ని ఉపయోగిస్తుంది.[6] జాబితాకు అర్హత ఉన్నవారికి ప్రాథమిక సర్వేలు పంపుతారు. కొందరు తమ సంపదను పెంచి చెబుతారు, కొందరు సహకరిస్తారు కానీ వివరాలు దాస్తారు, మరికొందరు సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఆ తర్వాత వ్యాపార ఒప్పందాలను పరిశీలిస్తారు, విలువైన ఆస్తులైన భూమి, ఇళ్లు, వాహనాలు, కళాఖండాలు మొదలైన వాటి అంచనాలను రూపొందిస్తారు. అంచనాలను మెరుగుపరచడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పబ్లిక్ కంపెనీల షేర్ల ధరలను ప్రచురణకు నెల రోజుల ముందున్న మార్కెట్ రేటు ఆధారంగా గణిస్తారు. ప్రైవేట్ కంపెనీల విలువను ధర-విక్రయాల నిష్పత్తి లేదా ధర-ఆదాయాల నిష్పత్తి ద్వారా అంచనా వేస్తారు. మొత్తం ఆస్తుల నుండి తెలిసిన అప్పులను తీసివేసి అమెరికన్ డాలర్లలో తుది నికర ఆస్తిని లెక్కిస్తారు. షేర్ల ధరలు వేగంగా మారుతుంటాయి కాబట్టి, ప్రచురణ సమయంలో వ్యక్తి నిజమైన సంపదలో మార్పులు ఉండవచ్చు.[6]

జీవించి ఉన్న వ్యక్తి తన సంపదను కుటుంబ సభ్యులకు పంచినప్పటికీ, ఆ వ్యక్తి బతికి ఉన్నంత కాలం దానిని ఒకే సంపదగా పరిగణిస్తారు. అయితే, మరణించిన కుబేరుని సంపదను పంపిణీ చేస్తే, దానిని కలిపి చూపరు. ఆ సంపదను పొందిన వారి నికర ఆస్తి 1 బిలియన్ డాలర్లు దాటితేనే వారిని విడిగా జాబితాలో చేరుస్తారు.[6] రాజ కుటుంబాలు, నియంతలను ఎల్లప్పుడూ ఈ జాబితాల నుండి మినహాయిస్తారు.[7]

వార్షిక ర్యాంకింగ్‌లు

[మార్చు]

ఈ ర్యాంకింగ్‌లను ప్రతి సంవత్సరం మార్చిలో ప్రచురిస్తారు. ఫోర్బ్స్ జాబితాలో వేలాది మంది బిలియనీర్లు ఉన్నారు, కింద ఇచ్చిన పట్టికలలో ప్రతి సంవత్సరానికి టాప్ 10 కుబేరులను మాత్రమే చూపించాము.

సూచిక
ఐకాన్ వివరణ
Steady గత ర్యాంకింగ్ నుండి ఎలాంటి మార్పు లేదు.
Increase గత ర్యాంకింగ్ నుండి పెరిగింది.
Decrease గత ర్యాంకింగ్ నుండి తగ్గింది.

ప్రపంచ కుబేరుల 40వ వార్షిక ఫోర్బ్స్ జాబితాలో రికార్డు స్థాయిలో 3,428 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం నికర సంపద $20.1 ట్రిలియన్లు. 2025తో పోలిస్తే 309 మంది సభ్యులు, $4 ట్రిలియన్ల పెరుగుదల కనిపించింది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మొదటిసారిగా టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.[1]

స్థానం పేరు నికర ఆస్తులు (USD) వయస్సు జాతీయత సంపద మూలం
&&&&&&&&&&&&&&01.&&&&&01 Increase ఎలాన్ మస్క్ $839 బిలియన్లు Increase 54 అమెరికా టెస్లా, స్పేస్‌ఎక్స్
&&&&&&&&&&&&&&02.&&&&&02 Increase లారీ పేజ్ $269 బిలియన్లు Increase 52 అమెరికా గూగుల్
&&&&&&&&&&&&&&03.&&&&&03 Increase సెర్గీ బ్రిన్ $237 బిలియన్లు Increase 52 అమెరికా గూగుల్
&&&&&&&&&&&&&&04.&&&&&04 Decrease జెఫ్ బెజోస్ $259 బిలియన్లు Increase 62 అమెరికా అమెజాన్
&&&&&&&&&&&&&&05.&&&&&05 Decrease మార్క్ జుకర్‌బర్గ్ $252 బిలియన్లు Increase 41 అమెరికా మెటా ప్లాట్‌ఫామ్స్
&&&&&&&&&&&&&&06.&&&&&06 Decrease లారీ ఎల్లిసన్ $198 బిలియన్లు Decrease 81 అమెరికా ఒరాకిల్ కార్పొరేషన్
&&&&&&&&&&&&&&07.&&&&&07 Decrease బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం $174 బిలియన్లు Decrease 77 ఫ్రాన్స్ ఎల్.వి.ఎం.హెచ్
&&&&&&&&&&&&&&08.&&&&&08 Increase జెన్సన్ హువాంగ్ $154 బిలియన్లు Increase 63 అమెరికా ఎన్విడియా
&&&&&&&&&&&&&&09.&&&&&09 Decrease వారెన్ బఫెట్ $149 బిలియన్లు Decrease 95 అమెరికా బెర్క్‌షైర్ హాత్‌వే
&&&&&&&&&&&&&010.&&&&&010 Decrease అమాన్సియో ఒర్టెగా $148 బిలియన్లు Increase 89 స్పెయిన్ ఇండిటెక్స్

39వ వార్షిక ఫోర్బ్స్ జాబితాలో 3,028 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం నికర సంపద $16.1 ట్రిలియన్లు. 2024తో పోలిస్తే ఇది 247 మంది సభ్యులు, $1.9 ట్రిలియన్ల పెరుగుదలను సూచిస్తుంది. 1992 నుంచి 33 ఏళ్ల పాటు టాప్ 10లో ఉన్న బిల్ గేట్స్ తొలిసారిగా ఆ జాబితా నుంచి తప్పుకున్నారు.

స్థానం పేరు నికర ఆస్తులు (USD) వయస్సు జాతీయత సంపద మూలం
&&&&&&&&&&&&&&01.&&&&&01 Increase ఎలాన్ మస్క్ $342 బిలియన్లు Increase 53 అమెరికా టెస్లా, స్పేస్‌ఎక్స్
&&&&&&&&&&&&&&02.&&&&&02 Increase మార్క్ జుకర్‌బర్గ్ $216 బిలియన్లు Increase 40 అమెరికా మెటా ప్లాట్‌ఫామ్స్
&&&&&&&&&&&&&&03.&&&&&03 Steady జెఫ్ బెజోస్ $215 బిలియన్లు Increase 61 అమెరికా అమెజాన్
&&&&&&&&&&&&&&04.&&&&&04 Increase లారీ ఎల్లిసన్ $192 బిలియన్లు Increase 80 అమెరికా ఒరాకిల్ కార్పొరేషన్
&&&&&&&&&&&&&&05.&&&&&05 Decrease బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం $178 బిలియన్లు Decrease 76 ఫ్రాన్స్ ఎల్.వి.ఎం.హెచ్
&&&&&&&&&&&&&&06.&&&&&06 Steady వారెన్ బఫెట్ $154 బిలియన్లు Increase 94 అమెరికా బెర్క్‌షైర్ హాత్‌వే
&&&&&&&&&&&&&&07.&&&&&07 Increase లారీ పేజ్ $144 బిలియన్లు Increase 52 అమెరికా గూగుల్
&&&&&&&&&&&&&&08.&&&&&08 Increase సెర్గీ బ్రిన్ $138 బిలియన్లు Increase 51 అమెరికా గూగుల్
&&&&&&&&&&&&&&09.&&&&&09 Increase అమాన్సియో ఒర్టెగా $124 బిలియన్లు Increase 89 స్పెయిన్ ఇండిటెక్స్
&&&&&&&&&&&&&010.&&&&&010 Decrease స్టీవ్ బాల్మర్ $118 బిలియన్లు Decrease 69 అమెరికా మైక్రోసాఫ్ట్

38వ వార్షిక ఫోర్బ్స్ జాబితాలో 2,781 మంది బిలియనీర్లు, $14.2 ట్రిలియన్ల సంపదతో నిలిచారు. మునుపటి ఏడాదితో పోలిస్తే మూడింట రెండొంతుల మంది సంపద పెరిగింది.

స్థానం పేరు నికర ఆస్తులు (USD) వయస్సు జాతీయత సంపద మూలం
&&&&&&&&&&&&&&01.&&&&&01 Steady బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం $233 బిలియన్లు Increase 75 ఫ్రాన్స్ ఎల్.వి.ఎం.హెచ్
&&&&&&&&&&&&&&02.&&&&&02 Steady ఎలన్ మస్క్ $195 బిలియన్లు Increase 52 అమెరికా టెస్లా, స్పేస్‌ఎక్స్
&&&&&&&&&&&&&&03.&&&&&03 Steady జెఫ్ బెజోస్ $194 బిలియన్లు Increase 60 అమెరికా అమెజాన్
&&&&&&&&&&&&&&04.&&&&&04 Increase మార్క్ జుకర్‌బర్గ్ $177 బిలియన్లు Increase 39 అమెరికా మెటా ప్లాట్‌ఫామ్స్
&&&&&&&&&&&&&&05.&&&&&05 Decrease లారీ ఎల్లిసన్ $141 బిలియన్లు Increase 79 అమెరికా ఒరాకిల్ కార్పొరేషన్
&&&&&&&&&&&&&&06.&&&&&06 Decrease వారెన్ బఫెట్ $133 బిలియన్లు Increase 93 అమెరికా బెర్క్‌షైర్ హాత్‌వే
&&&&&&&&&&&&&&07.&&&&&07 Decrease బిల్ గేట్స్ $128 బిలియన్లు Increase 68 అమెరికా మైక్రోసాఫ్ట్
&&&&&&&&&&&&&&08.&&&&&08 Increase స్టీవ్ బాల్మర్ $121 బిలియన్లు Increase 68 అమెరికా మైక్రోసాఫ్ట్
&&&&&&&&&&&&&&09.&&&&&09 Steady ముఖేష్ అంబానీ $116 బిలియన్లు Increase 66 భారతదేశం రిలయన్స్ ఇండస్ట్రీస్
&&&&&&&&&&&&&010.&&&&&010 Increase లారీ పేజ్ $114 బిలియన్లు Increase 51 అమెరికా గూగుల్

37వ వార్షిక ఫోర్బ్స్ జాబితాలో 2,640 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద $12.2 ట్రిలియన్లు.

స్థానం పేరు నికర ఆస్తులు (USD) వయస్సు జాతీయత సంపద మూలం
&&&&&&&&&&&&&&01.&&&&&01 Increase బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం $211 బిలియన్లు Increase 74 ఫ్రాన్స్ ఎల్.వి.ఎం.హెచ్
&&&&&&&&&&&&&&02.&&&&&02 Decrease ఎలన్ మస్క్ $180 బిలియన్లు Decrease 51 అమెరికా టెస్లా, స్పేస్‌ఎక్స్
&&&&&&&&&&&&&&03.&&&&&03 Decrease జెఫ్ బెజోస్ $114 బిలియన్లు Decrease 59 అమెరికా అమెజాన్
&&&&&&&&&&&&&&04.&&&&&04 Increase లారీ ఎల్లిసన్ $107 బిలియన్లు Increase 78 అమెరికా ఒరాకిల్ కార్పొరేషన్
&&&&&&&&&&&&&&05.&&&&&05 Steady వారెన్ బఫెట్ $106 బిలియన్లు Decrease 92 అమెరికా బెర్క్‌షైర్ హాత్‌వే
&&&&&&&&&&&&&&06.&&&&&06 Decrease బిల్ గేట్స్ $104 బిలియన్లు Decrease 67 అమెరికా మైక్రోసాఫ్ట్
&&&&&&&&&&&&&&07.&&&&&07 Increase మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ $94.5 బిలియన్లు Increase 81 అమెరికా బ్లూమ్‌బెర్గ్ ఎల్.పి.
&&&&&&&&&&&&&&08.&&&&&08 Increase కార్లోస్ స్లిమ్ కుటుంబం $93 బిలియన్లు Increase 83 మెక్సికో గ్రూపో కార్సో
&&&&&&&&&&&&&&09.&&&&&09 Increase ముఖేష్ అంబానీ $83.4 బిలియన్లు Decrease 65 భారతదేశం రిలయన్స్ ఇండస్ట్రీస్
&&&&&&&&&&&&&010.&&&&&010 Decrease స్టీవ్ బాల్మర్ $80.7 బిలియన్లు Decrease 67 అమెరికా మైక్రోసాఫ్ట్

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్
  • సెంటిబిలియనీర్ల జాబితా
  • బిలియనీర్ల సంఖ్య ఆధారంగా నగరాల జాబితా
  • బిలియనీర్ల సంఖ్య ఆధారంగా దేశాల జాబితా
  • అత్యంత సంపన్న కుటుంబాల జాబితా

మూలాలు

[మార్చు]

నిర్దిష్ట మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Peterson-Withorn, Chase (11 మార్చి 2026) [March 10, 2026]. "Forbes World's Billionaires List 2026: The Top 200". Forbes (in ఇంగ్లీష్). Retrieved 5 ఏప్రిల్ 2026.
  2. "Why Putin Isn't on 'Forbes' Billionaires List". Forbes. 2 మార్చి 2015. Archived from the original on 20 అక్టోబరు 2017. Retrieved 17 నవంబరు 2017.
  3. Kroll, Luisa. "Forbes 2017 billionaires list: Meet the richest people on the planet". Forbes. Archived from the original on 21 మార్చి 2017. Retrieved 21 మార్చి 2017.
  4. "Bill Gates Was The 'World's Richest Man' For A Record 18 Years". Yahoo Finance. 4 జూలై 2024. Retrieved 9 ఏప్రిల్ 2025.
  5. "Forbes World's Billionaires List 2025: The Top 200". Forbes (in ఇంగ్లీష్). Archived from the original on 1 ఏప్రిల్ 2025.
  6. 6.0 6.1 6.2 Dolan, Kerry A. (7 మార్చి 2012). "Methodology: How We Crunch The Numbers". Forbes. Archived from the original on 3 జనవరి 2013. Retrieved 4 జనవరి 2013.
  7. Fortunes Of Kings, Queens And Dictators Archived 19 ఫిబ్రవరి 2011 at the Wayback Machine Forbes, 5 May 2006

బాహ్య లింకులు

[మార్చు]