ప్రపంచ మధుమేహ దినోత్సవం
ప్రపంచ మధుమేహ దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | 14 నవంబరు |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 14న నిర్వహించబడుతుంది.[1] మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి నియంత్రణకోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.[2]
చరిత్ర
[మార్చు]ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో మధుమేహ (డయాబెటిస్) వ్యాధి తొమ్మిదవ స్థానంలో ఉంది. మానవ రక్తంలో అధిక మోతాదులో చక్కెర నేరుగా కలవడంవల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. ఈ వ్యాధి అరికాళ్లు, కంటి నరాలు, హృదయం, మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి నియంత్రణకు కావలసిన కృత్రిమ ఇన్సులిన్‌ను 1922లో కెనడా దేశానికి చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే వైద్య శాస్త్రవేత్త కనుగొన్నాడు.[3] 1991లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెడరిక్ పుట్టిన రోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించింది.[4][5]
కార్యక్రమాలు
[మార్చు]ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ దినోత్సవం నిర్వహించబడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని 160 దేశాల్లో, అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య సారథ్యంలోని 230 సంస్థలు ఈ దినోత్సవంరోజున ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ us, Contact; Federation, International Diabetes. "World Diabetes Day | Diabetes: protect your family".
- ↑ "The history of the discovery of insulin". Portsmouth Daily Times. Archived from the original on 8 నవంబరు 2017. Retrieved 14 November 2019.
- ↑ ఆంధ్రభూమి, ఈ వారం స్పెషల్ (11 November 2017). "తేనె పూసిన కత్తి". www.andhrabhoomi.net. కృష్ణతేజ. Archived from the original on 15 జనవరి 2018. Retrieved 14 November 2019.
- ↑ World Health Organization. Promoting health through the life-course: World Diabetes Day 2016. Geneva, accessed 14 November 2019.
- ↑ "Previous campaigns". World Diabetes Day. International Diabetes Federation. Archived from the original on 23 July 2010. Retrieved 14 November 2019.