ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య సభ్య దేశాలు |
జరుపుకొనే రోజు | అక్టోబరు 10 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదేరోజు |
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.[1][2] మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. 150కిపైగా దేశాలకు చెందిన సభ్యులున్న ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దీనిని మొదటిసారిగా 1992లో జరుపుకున్నారు.[3] మానసిక అనారోగ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై చూపించే ప్రభావాలను దృష్టికి తీసుకురావడానికి వేలాదిమంది స్వచ్ఛంద కార్యకర్తలు ఈ వార్షిక అవగాహన కార్యక్రమాన్ని జరుపుకుంటారు.[4]
చరిత్ర
[మార్చు]1992, అక్టోబరు 10న డిప్యూటీ సెక్రటరీ జనరల్ రిచర్డ్ హంటర్ సహకారంతో తొలిసారిగా ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపబడింది. 1994వ సంవత్సరం వరకు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడం మినహా ఈ రోజుకు ప్రత్యేకత ఏమిలేదు.
అప్పటి మానసిక కార్యదర్శి యూజీన్ బ్రాడీ సూచన మేరకు 1994లో తొలిసారిగా "ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం"[5] అనే నేపథ్యంతో ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ప్రపంచ దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, పౌర సమాజ సంస్థలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ నిర్వాహణకు సహకారం లభిస్తోంది. సాంకేతిక, ప్రచార సామగ్రిని అభివృద్ధి చేయడానికి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు ఇస్తోంది.[6]
నేపథ్యాలు
[మార్చు]సంవత్సరం | నేపథ్యాలు [7][8] |
---|---|
2023 | మానసిక ఆరోగ్యం అనేది సార్వత్రిక మానవ హక్కు [9] |
2022 | అందరి మానసిక ఆరోగ్యం, స్వస్థతకు ప్రపంచ ప్రాధాన్యత కల్పించడం[10] |
2021 | అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం |
2020 | మానసిక ఆరోగ్యం కోసం తరలించండి: మానసిక ఆరోగ్యంలో పెరిగిన పెట్టుబడి[11] |
2019 | మానసిక ఆరోగ్య ప్రచారం - ఆత్మహత్యల నివారణ |
2018 | మారుతున్న ప్రపంచంలో యువకులు, మానసిక ఆరోగ్యం |
2017 | పనిస్థానాల్లో మానసిక ఆరోగ్యం |
2016 | మానసిక ప్రథమ చికిత్స |
2015 | మానసిక ఆరోగ్యంలో గౌరవం |
2014 | స్కిజోఫ్రెనియాతో నివసిస్తున్నవారు |
2013 | మానసిక ఆరోగ్యం - పెద్దలు |
2012 | డిప్రెషన్: ఎ గ్లోబల్ క్రైసిస్ |
2011 | గ్రేట్ పుష్: మానసిక ఆరోగ్యంలో పెట్టుబడి |
2010 | మానసిక ఆరోగ్యం - దీర్ఘకాలిక శారీరక అనారోగ్యాలు |
2009 | ప్రాథమిక సంరక్షణలో మానసిక ఆరోగ్యం: చికిత్సను మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం |
2008 | మానసిక ఆరోగ్యాన్ని ప్రపంచ ప్రాధాన్యతగా మార్చడం: చర్యల ద్వారా పౌరులకు సేవలను పెంచడం |
2007 | మారుతున్న ప్రపంచంలో మానసిక ఆరోగ్యం: సంస్కృతి, వైవిధ్యం యొక్క ప్రభావం |
2006 | అవగాహన పెంచడం - ప్రమాదాన్ని తగ్గించడం: మానసిక అనారోగ్యం & ఆత్మహత్య |
2005 | జీవిత కాలం అంతటా మానసిక, శారీరక ఆరోగ్యం |
2004 | శారీరక, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధం: సహ-సంభవించే రుగ్మతలు |
2003 | పిల్లలు & కౌమారదశల భావోద్వేగ, ప్రవర్తనా లోపాలు |
2002 | పిల్లలు, కౌమారదశలో గాయం, హింస ప్రభావాలు |
2000-01 | మానసిక ఆరోగ్యం - పని |
1999 | మానసిక ఆరోగ్యం - వృద్ధాప్యం |
1998 | మానసిక ఆరోగ్యం - మానవ హక్కులు |
1997 | పిల్లలు - మానసిక ఆరోగ్యం |
1996 | మహిళలు - మానసిక ఆరోగ్యం |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (10 October 2020). "మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!". Sakshi. Archived from the original on 10 October 2020. Retrieved 10 October 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 October 2019). "మానసిక ఆరోగ్యమే.. మహాభాగ్యం". www.andhrajyothy.com. Archived from the original on 10 October 2020. Retrieved 10 October 2020.
- ↑ Watson, Robert W. (2006). White House Studies Compendium, Volume 5. Nova Science Publishers. p. 69. ISBN 978-1-60021-542-1.
- ↑ "World Mental Health Day". Mental Health in Family Medicine. 7 (1): 59–60. 2010.
- ↑ "World Mental Health Day History". World Federation for Mental Health (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2020-10-10.
- ↑ "WHO | World Mental Health Day". WHO. Retrieved 2019-08-21.
- ↑ "WHO | Previous World Mental Health Days".
- ↑ "World Mental Health Day History - World Federation for Mental Health". World Federation for Mental Health (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2018-10-04.
- ↑ "World Mental Health Day 2023". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2023-10-10.
- ↑ "World Mental Health Day 2022". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
- ↑ Lancet, The (2020-10-10). "Mental health: time to invest in quality". The Lancet (in English). 396 (10257): 1045. doi:10.1016/S0140-6736(20)32110-3. ISSN 0140-6736.
{{cite journal}}
: CS1 maint: unrecognized language (link)