ప్రఫుల్ల కుమార్ మహంత
| ప్రఫుల్ల కుమార్ మహంత | |||
| |||
| పదవీ కాలం 1996 మే 15 – 2001 మే 17 | |||
| గవర్నరు | లోకనాథ్ మిశ్రా శ్రీనివాస్ కుమార్ సిన్హా | ||
|---|---|---|---|
| ముందు | భూమిధర్ బర్మన్ | ||
| తరువాత | తరుణ్ గొగోయ్ | ||
| పదవీ కాలం 1985 డిసెంబర్ 24 – 1990 నవంబర్ 28 | |||
| గవర్నరు | భీష్మ నారాయణ్ సింగ్ హరి దేవ్ జోషి అనిసెట్టి రఘువీర్ దేవి దాస్ ఠాకూర్ | ||
| ముందు | హితేశ్వర్ సైకియా | ||
| తరువాత | రాష్ట్రపతి పాలన | ||
అస్సాం శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
| |||
| పదవీ కాలం 2010 సెప్టెంబర్ 4- 2014 జూలై 14 | |||
| ముందు | చంద్ర మోహన్ పటోవరీ | ||
| తరువాత | ఖాళీ | ||
| పదవీ కాలం 1991 - 1996 | |||
| పదవీ కాలం 1991 - 2021 | |||
| ముందు | గిరీంద్ర కుమార్ బారువా | ||
| తరువాత | జితు గోస్వామి | ||
| నియోజకవర్గం | బర్హంపూర్ | ||
| పదవీ కాలం 1985 - 1991 | |||
| ముందు | ముకుత్ శర్మ | ||
| తరువాత | ముకుత్ శర్మ | ||
| నియోజకవర్గం | నౌగాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1952 డిసెంబరు 23 నాగావ్ , అస్సాం , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | అసోం గణ పరిషత్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ | ||
| తల్లిదండ్రులు | దేబా కాంత మహంత, లక్ష్మి ప్రోవా మహంత | ||
| జీవిత భాగస్వామి | జోయశ్రీ గోస్వామి మహంత | ||
| సంతానం | 3 (2 కుమారులు, 1 కుమార్తె) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ప్రఫుల్ల కుమార్ మహంత (జననం 23 డిసెంబర్ 1952)రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన అసోం గణ పరిషత్ పార్టీ వ్యవస్థాపకుడు, 1985 నుండి 1990 వరకు & మళ్ళీ 1996 నుండి 2001 వరకు అస్సాం 11వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ప్రఫుల్ల కుమార్ మహంత విద్యార్థిగా దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని 1979లో రాష్ట్రంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ 1979లో బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనను ప్రారంభించింది, 1985 వరకు కొనసాగింది. మహంత నేతృత్వంలోని ఈ ఉద్యమం ఆయనను విద్యార్థి సంస్థ నాయకుడి నుండి ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా మార్చింది. 1985 అక్టోబర్‌లో అసోం గణ పరిషత్ పార్టీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించి పార్టీ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ప్రఫుల్ల కుమార్ మహంత 1985 అసోం శాసనసభ ఎన్నికలలో నౌగాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1991 ఎన్నికలలో బర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. మహంత ఆ తరువాత 1996, 2001, 2006, 2011 ఎన్నికలలో, 2016 శాసనసభ ఎన్నికలలో బర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 1985 నుండి 1990 వరకు & 1996 నుండి 2001 వరకు అస్సాం 11వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
ప్రఫుల్ల కుమార్ మహంత 2010 సెప్టెంబర్ 4న ఆయన అస్సాం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .
21 అక్టోబర్ 2013న ఈశాన్య ప్రాంతానికి చెందిన పదకొండు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమై ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి ఈశాన్య ప్రాంతీయ రాజకీయ ఫ్రంట్ (NERPF) అనే కొత్త రాజకీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాడు. మహంతను ఆ ఫ్రంట్‌కు ప్రధాన సలహాదారుగా నియమించారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో జూలై 14న అసోం గణ పరిషత్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు.
తన పార్టీతో విభేదాల తర్వాత అతను 2021 అస్సాం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]మహంత 1988 ఏప్రిల్ 29న జోయశ్రీ గోస్వామి మహంతను వివాహం చేసుకున్నారు. ఆయన భార్య రచయిత్రి & రాజ్యసభ ఎంపీగా పని చేసింది.[3] వారికి ఇద్దరు కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు షువం కశ్యప్ 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.[4]
ఆయన సెప్టెంబర్ 2020లో ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పి & అధిక రక్తపోటు గురించి ఫిర్యాదు చేయడంతో 2021 జనవరి 1న గౌహతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన భార్య & కుమారుడిని కలిసి మహంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Prafulla Mahanta?" (in Indian English). The Hindu. 16 June 2018. Archived from the original on 31 July 2025. Retrieved 31 July 2025.
- ↑ "Assam Assembly Election 2021: Prafulla Kumar Mahanta, a mediocre politician, but student leader par excellence" (in ఇంగ్లీష్). CNBCTV18. 12 March 2021. Archived from the original on 31 July 2025. Retrieved 31 July 2025.
- ↑ "2019 Sahitya Akademi awardee Jayashree Goswami Mahanta to distribute prize money among families who lost lives during CAA protests in Assam" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 18 December 2019. Archived from the original on 31 July 2025. Retrieved 31 July 2025.
- ↑ "Mahanta, son hurt in road accident". Retrieved 2021-08-27 – via PressReader.
- ↑ "PM Modi meets family of ailing Assam ex-CM Prafulla Kumar Mahanta, wishes for his speedy recovery". The Economic Times. Retrieved 2021-08-27.