ప్రఫుల్ ఖోడా పటేల్
ప్రఫుల్ ఖోడా పటేల్ | |
|---|---|
జనవరి 2024లో ప్రఫుల్ ఖోడా పటేల్ | |
| మొదటి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ నిర్వాహకుడు | |
| Assumed office 2020 జనవరి 26 | |
| అధ్యక్షుడు | |
| అంతకు ముందు వారు | - |
| లక్షద్వీప్ నిర్వాహకుడు | |
| Assumed office 2020 డిసెంబరు 5 | |
| Appointed by | రామ్‌నాథ్ కోవింద్ |
| అంతకు ముందు వారు | దినేశ్వర్ శర్మ |
| 16వ డామన్ డయ్యు నిర్వాహకుడు | |
| In office 2016 ఆగస్టు 29 – 2020 జనవరి 26 | |
| అధ్యక్షుడు | |
| అంతకు ముందు వారు | విక్రమ్ దేవ్ దత్ |
| తరువాత వారు | పదవి రద్దు చేయబడింది |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1957 ఆగస్టు 28 ఉనవా, గుజరాత్, భారతదేశం |
| జాతీయత | భారతీయుడు |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| నివాసం | డామన్ |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రఫుల్ ఖోడాబాయ్ పటేల్ (జననం 1957 ఆగస్టు 28) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఆయన దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకుడిగా ఉన్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రఫుల్ ఖోడా పటేల్ 2007 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో గుజరాత్ లోని హిమత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి 12వ శాసనసభకు గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన తండ్రి ఖోడాబాయి రాంచోద్భాయ్ పటేల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడు.[1] 2010 ఆగస్టు 21 నుండి ఆయన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసాడు.
ప్రఫుల్ పటేల్ 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారు, గుజరాత్ లో తన రాజకీయ జీవితాన్ని తగ్గించుకున్నారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత, 2016లో ప్రఫుల్ ఖోడా పటేల్ ను డామన్ డయ్యూ పరిపాలకుడిగా నియమించాడు, ఆ తరువాత, దాద్రా నగర్ హవేలీ నిర్వాహకుడిగా కూడా నియమించాడు.[2]
కేంద్రపాలిత ప్రాంతాల చరిత్రలో రాజకీయంగా నియమించబడిన పాలకులలో ప్రఫుల్ పటేల్ ఒకరు. ఇటువంటి పదవులను సాధారణంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు నిర్వహిస్తారు.[3]
2020 జనవరి 26న, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ విలీనం తరువాత కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు మొదటి నిర్వాహకుడిగా గుర్తింపు పొందాడు.[4][5] లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ శర్మ మరణించిన కారణంగా, ప్రఫుల్ పటేల్ 2020 డిసెంబరు 5 నుండి కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ నిర్వాహకుడిగా అదనపు బాధ్యతలు స్వీకరించాడు.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Patel Prafulbhai Khodabhai(Bharatiya Janata Party(BJP)):Constituency- HIMATNAGAR(SABARKANTHA) - Affidavit Information of Candidate". myneta.info.
- ↑ Arnimesh, Shanker (11 March 2021). "Who is Praful Khoda Patel? Minister in CM Modi's Gujarat cabinet now booked for MP 'suicide'". The Print (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-03-12.
- ↑ Sreerag, P. S. (18 April 2019). "EC issued notice to Modi aide Praful K Patel for "coercive action" against election officers". The Caravan (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-27.
- ↑ "Twelfth Gujarat Legislative Assembly". Gujarat Assembly. the original నుండి 24 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2012.
- ↑ Siddharth Dholakia (News18) [@SiddharthNews18] (24 January 2020). "કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના વિલીનીકરણ બાદ @prafulkpatel બન્યા પ્રથમ પ્રશાસક ગૃહ મંત્રાલયે ફરી પ્રથમ પ્રશાસક તરીકે કરી નિમણુક અભિનંદન" [Following the merger of Union Territories of Diu, Daman and Dadarnagar Haveli @prafulkpatel Congratulations to Prafulbhai Patel for being re-appointed as the first administrator of the newly merged Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu.] (Tweet) – via Twitter.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Administrator's Profile | Lakshadweep | India".