ప్రబాత్ నిస్సాంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రబాత్ నిస్సాంక
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జయవర్ధనే రత్నాయకే అరాచ్చిగే ప్రబాత్ నిస్సాంక
పుట్టిన తేదీ (1980-10-25) 1980 అక్టోబరు 25 (వయసు 43)
అంబలంతోట, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 95)2003 ఏప్రిల్ 25 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2003 జూన్ 27 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 109)2001 అక్టోబరు 27 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2003 జూన్ 8 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 4 23
చేసిన పరుగులు 18 53
బ్యాటింగు సగటు 6.00 6.62
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 12* 11
వేసిన బంతులు 587 997
వికెట్లు 10 27
బౌలింగు సగటు 36.60 31.74
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/64 4/12
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9

జయవర్ధనే రత్నాయకే అరాచ్చిగే ప్రబాత్ నిస్సాంక, శ్రీలంక మాజీ క్రికెటర్. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు తరపున టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు, శ్రీలంకకు చెందిన వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.[1]

జననం, విద్య

[మార్చు]

జయవర్ధనే రత్నాయకే అరాచ్చిగే ప్రబాత్ నిస్సాంక 1980, అక్టోబరు 25న శ్రీలంకలోని అంబలంతోటలో జన్మించాడు. మాతరలోని సెయింట్ థామస్ కళాశాలలో చదువుకున్నాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

2001 అక్టోబరులో షార్జాలో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసి, రెండు వికెట్లు తీశాడు. 1998 - 2003 మధ్య లిస్ట్ ఎ క్రికెట్ కూడా ఆడాడు. పేస్ బౌలర్ల కోసం ఎంఆర్ఎప్ ఫౌండేషన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2003లో శ్రీలంక ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జట్టులో భాగమయ్యాడు. తన అత్యుత్తమ బౌలింగ్ తో (4/12) కెనడా జట్టును 36 పరుగులకు పరిమితం చేయడంలో శ్రీలంకకు సహాయపడడ్డాడు, ఇది ప్రపంచ కప్ రికార్డుగా నిలిచింది.

తన చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 5/64 తీసుకున్నాడు.[2] మోకాళ్ళ వ్యాధితో కారణంగా చివరి మ్యాచ్ తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఆ సమయంలో తన జీవితంలో మళ్ళీ పోటీ క్రికెట్‌ను ఆడే అవకాశం తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు.

క్రికెట్ తర్వాత

[మార్చు]

అండర్-19 శ్రీలంక జాతీయ జట్టుకు కండిషనింగ్ కోచ్‌గా ఉన్నాడు. స్థాయి 3 హై పెర్ఫామెన్స్ కోచ్‌గా అర్హత సాధించాడు. శ్రీలంక క్రికెట్‌కు అసిస్టెంట్ నేషనల్ బౌలింగ్ కోచ్ అయ్యాడు. 2013లో శ్రీలంక క్రికెట్‌కు రాజీనామా చేసి, ఫిట్‌నెస్‌లో 3, 4 స్థాయిలను పూర్తి చేయడానికి ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. ప్రస్తుతం క్రికెట్ కోచ్‌గా, వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Prabath Nissanka". ESPNcricinfo. Retrieved 2023-08-18.
  2. "Nissanka fires but Test on knife-edge". The Wisden Bulletin. 28 June 2003. Retrieved 2023-08-18 – via ESPNcricinfo.

బాహ్య లింకులు

[మార్చు]