Jump to content

ప్రబోధ్ పాండా

వికీపీడియా నుండి
ప్రబోధ్ పాండా
ప్రబోధ్ పాండా


పదవీ కాలం
2001 – 2014
ముందు ఇంద్రజిత్ గుప్తా
తరువాత సంధ్యా రాయ్
నియోజకవర్గం మేదినీపూర్

సిపిఐ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి
పదవీ కాలం
ఫిబ్రవరి 2015 – ఫిబ్రవరి 2018
ముందు మంజు కుమార్ మజుందార్[1]
తరువాత స్వపన్ బెనర్జీ

వ్యక్తిగత వివరాలు

జననం (1946-02-07)1946 ఫిబ్రవరి 7
మిడ్నాపూర్, పశ్చిమ బెంగాల్
మరణం 2018 February 27(2018-02-27) (వయసు: 72)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ
తల్లిదండ్రులు దేబేంద్ర నాథ్ పాండా, నీరద బాల పాండా
నివాసం మిడ్నాపూర్, పశ్చిమ బెంగాల్
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రబోధ్ పాండా (7 ఫిబ్రవరి 1946 - 27 ఫిబ్రవరి 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రబోధ్ పాండా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001లో మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిలోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాహుల్ (బిశ్వజిత్) సిన్హాపై 160760 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

ప్రబోధ్ పాండా 2009 లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దీపక్ కుమార్ ఘోష్ పై 48,017 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మరణం

[మార్చు]

ప్రబోధ్ పాండా కోల్‌కతాలోని ఎంటల్లీ ప్రాంతంలోని భూపేశ్ భవన్‌లోని సీపీఐ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యాలయంలో 2018 ఫిబ్రవరి 27న గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Probodh Panda replaces Manju Kumar Majumdar, becomes new CPI Bengal secretary". The Economic Times. 20 February 2015. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  2. "CPI (M) faces censure from allies" (in Indian English). The Hindu. 19 May 2014. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  3. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  4. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  5. "CPI leader Prabodh Panda passes away". Business Standard. 27 February 2018. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  6. "CPI leader Prabodh Panda passes away" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 February 2018. Retrieved 23 July 2025.
  7. "Kolkata: CPI Bengal secretary Prabodh Panda passes away at 72" (in ఇంగ్లీష్). India Blooms. 27 February 2018. Retrieved 23 July 2025.