ప్రమాణవార్తిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జ్ఞానమీమాంసకు సంబంధించి 'ప్రమాణం'లపై అత్యంత సాధికారికంగా రాయబడిన బౌద్ధ గ్రంథం ప్రమాణవార్తిక. ఇది సా.శ 7 వ శతాబ్దానికి చెందిన బౌద్ధ తర్కవేత్త ధర్మకీర్తి యొక్క మహత్తర రచనగా (Magnum Opus) భావించబడుతుంది.[1][2]

గ్రంధంలోని అంశాలు[మార్చు]

ఈ గ్రంథం దిజ్ఞాగుని విరచితమైన ప్రమాణసముచ్చయం అనే ప్రామాణిక గ్రంథానికి వ్యాఖ్య.[3] ప్రమాణవార్తిక సుమారు 2000 శ్లోకాలతో సంస్కృతంలో విరచితమైంది.దీనిలో 4 పరిచ్చేదాలు (chapters) ఉన్నాయి. అవి

 1. స్వార్దానుమానం (inference for oneself)
 2. ప్రమాణసిద్ధి (valid knowledge)
 3. ప్రత్యక్ష ప్రమాణం (sense perception)
 4. పరార్దానుమానం (inference for others)

మొదటి అధ్యాయం అనుమితి, అపోహ (మినహాయింపు) యొక్క సిద్ధాంతం యొక్క నిర్మాణం, రకాలను చర్చిస్తుంది. ఈ అధ్యాయం చివరిభాగంలో ధర్మకీర్తి బ్రాహ్మణవాదంపై, వేదాల ప్రామాణికతపై, బ్రాహ్మణుల మంత్రాలపై, కుల వ్యవస్థపై, తీవ్రమైన దాడి చేస్తాడు. ఈ గ్రంథంలో ఆయన బాహాటంగా ఇలా అన్నాడు.

వేద ప్రామాణ్యం కస్యచిత్ కర్తృవాదః స్నానే ధర్మేచ్చా జాతి వాదావలేపః |
సంతాపారంభంః పాపహానాయ చేతి ధ్వస్తప్రజ్ఞానాం పంచ లింగాని జాడ్యే ||[4] - (ప్రమాణవార్తిక నుండి)
వేదం ప్రమాణమని నమ్మడం, ఎవరో సృష్టికర్త (భగవంతుడు) ఉన్నాడని నమ్మడం, స్నానాదులు చేయడంలోనే ధర్మం వుందని నమ్మడం, జాతివాదం పైన గర్వించడం, పాపం తొలగించుకోవడానికి శరీరాన్ని (ఉపవాసాల ద్వారా, కఠోర తపస్సు ద్వారా) కష్టపెట్టడం ఈ ఐదు, మతిభ్రష్టులైన మూర్ఖుల లక్షణాలు.[4]

"The unquestioned authority of the Vedas;
the belief in a world-creator;
the quest for purification through ritual bathing;
the arrogant division into castes;
the practice of mortification to atone for sin—
these five are the marks of the crass stupidity of witless men." [5]

వేదంతమొక్కటే భారతీయ తాత్వికతకు, ఆలోచనాపద్ధతికి ప్రాతినిధ్యం వహిస్తుందని అభిప్రాయపడేవారికి, బ్రహ్మవాదమే అంటే ఆస్తికవాదమే భారతదేశానికి స్వంతం అని అభిప్రాయపడేవారికి దిమ్మ తిరిగేలా ధర్మకీర్తి లాంటి ప్రబల సంప్రదాయ వ్యతిరేకులు సైతం ఇక్కడ జన్మించారు అన్న విషయం ఈ అధ్యాయం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

ప్రభావం[మార్చు]

ప్రమాణవార్తిక చాలా ప్రభావశీలమైన తార్కిక గ్రంథం. ఇది బౌద్ధ, బౌద్ధేతర తత్వవేత్తలలో కూడా చాలా ప్రభావం కలిగించింది. జ్ఞానమీమాంసకులు అయిన జ్ఞానగర్భ, శాంతరక్షిత, కమలశీల వంటి బౌద్ధ తత్వవేత్తలను, టిబెట్ కు చెందిన శాక్య పండిత, చోంగ్ ఖాపా (Tsong Khapa) వంటి ఆలోచనాపరులనే కాకుండా అకళంక, ఆది శంకరాచార్యుడు వంటి బౌద్ధేతర ఆలోచనాశీలురను కూడా ప్రభావితం చేసింది.[6][7]

జార్జ్ డ్రేఫస్ (Georges Dreyfus) మాటలలో చెప్పాలంటే టిబెటిన్ పాండిత్య సంప్రదాయంలో ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది తర్కం, భాషా తాత్వికత, జ్ఞానమీమాంస లాంటి ముఖ్య విషయాలనే కాక సాధారణంగా చర్చలకు అవసరమయ్యే తాత్విక పదజాలాన్ని, పాండిత్య అధ్యయనాలకు కావలిసిన తాత్విక పద్ధతిని సమకూరుస్తుంది.[8]

వ్యాఖ్యలు[మార్చు]

ప్రమాణవార్తిక లోని మొదటి అధ్యయనానికి ధర్మకీర్తి ఒక స్వీయ వ్యాఖ్యనం సుదీర్ఘంగా రాసాడు. దీనికి స్వోపాజనార్తి లేదా స్వవృత్తి అని పేరు. ప్రమాణ శాస్త్రంలో నిష్ణాతుడైన ధర్మకీర్తి రచించిన ప్రమాణవార్తికకు తదనంతర కాలంలో భారత, టిబెటిన్ భాషలలో అనేకమంది తర్కవేత్తలు వ్యాఖ్యలు రాసారు. వాటిలో ముఖ్యమైనవి.[9]

 • దేవేంద్రబుద్ధి - ప్రమాణవార్తికపంజిక
 • ప్రజ్ఞాకరగుప్త - ప్రమాణవార్తికాలంకార
 • శాక్యబుద్ధి - ప్రమాణవార్తికాటీకా
 • కర్ణకాగోమిన్ - ప్రమాణవార్తికవృత్తికా
 • మనోరథనందిని - ప్రమాణవార్తికవృత్తికా
 • రవిగుప్త - రవిగుప్తారమణవార్తికావృత్తి
 • శంకరానందన - ప్రమాణవార్తికాటీకా/ప్రమాణవార్తికానుసార
 • ఖేద్రుప్ జీ (Khedrup Je) - Ocean of Reasoning
 • గ్యాల్‌చాబ్ జీ (Gyaltsab Je) - Elucidation of the Path to Liberation
 • జుమిఫాం రింపోచి (Ju Mipham Rinpoche) యొక్క వ్యాఖ్య

ఇవి కూడా చూడండి[మార్చు]

రిఫరెన్సులు[మార్చు]

 • Jackson, Roger R. ; Is Enlightenment Possible?: Dharmakirti and Rgyal Tshab Rje on Knowledge, Rebirth, No-Self and Liberation, 1993
 • Tilleman's, Tom JF; Dharmakirti's Pramanavarttika: An annotated Translation of the fourth chapter (parathanumana), Volum (Bilingual), 2000.
 • Dunne, John D., 2004, Foundations of Dharmakīrti's Philosophy (Studies in Indian and Tibetan Buddhism), Cambridge MA: Wisdom Publications.
 • Franco, Eli, 1997, Dharmakīrti on Compassion and Rebirth (Wiener Studien zur Tibetologie und Buddhismuskunde 38), Vienna: Arbeitskreis für Tibetische und Buddhistische Studien Universität Wien.

మూలాలు[మార్చు]

 1. Jackson, Roger R. ; Is Enlightenment Possible?: Dharmakirti and Rgyal Tshab Rje on Knowledge, Rebirth, No-Self and Liberation, 1993, page 109
 2. Tilleman's, Tom JF; Dharmakirti's Pramanavarttika: An annotated Translation of the fourth chapter (parathanumana), Volum (Bilingual)
 3. Tilleman's, Tom JF; Dharmakirti's Pramanavarttika, page xvii
 4. 4.0 4.1 Rahul Sankrutyayan. Mahamanava Buddha (Telugu). Hyderabad: Dharmadeepam Foundation. p. 106.
 5. Padmanabh Jaini in "Sramanas: Their Conflict with Brahmanical Society" from "Chapters in Indian Civilization: Volume One" (Joseph Elder, ed., 1970)
 6. Akalanka's criticism of Dharmakirti's philosophy : a study L.D. Institute of Indology, 1967.
 7. Isaeva, N. V.; Shankara and Indian Philosophy, p 178.
 8. Dreyfus, Georges; The Sound of Two Hands Clapping The Education of a Tibetan Buddhist Monk, page 234.
 9. University of Heidelberg, EPISTEMOLOGY AND ARGUMENTATION IN SOUTH ASIA AND TIBET, http://east.uni-hd.de/buddh/ind/7/16/ Archived 2017-07-08 at the Wayback Machine