Jump to content

ప్రమీలా బిసోయి

వికీపీడియా నుండి
ప్రమీలా బిసోయి
ప్రమీలా బిసోయి


పదవీ కాలం
2019 మే 23 – 2024 జూన్ 4
ముందు లడు కిషోర్ స్వైన్
తరువాత అనితా శుభదర్శిని
నియోజకవర్గం అస్కా[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1948-09-15) 1948 సెప్టెంబరు 15 (age 76)
కర్నోలి, గంజాం జిల్లా, ఒడిశా
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు సిబా స్వైని, బౌరి స్వైని
జీవిత భాగస్వామి బంచనిధి బిసోయి
సంతానం 4 (2 కుమార్తెలు, 2 కుమారులు)
నివాసం చెరమానియా, అస్కా, గంజాం జిల్లా, ఒడిశా
మూలం [1]

ప్రమీలా బిసోయి (జననం 15 సెప్టెంబర్ 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అస్కా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3]

ప్రమీలా బిసోయి 3వ తరగతి వరకు చదువుకుంది, ఆమెకు ఐదు సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. ప్రమీలా బిసోయి అంగన్‌వాడీ సహాయిగా పనిచేయడం ప్రారంభించి ఆ తరువాత 18 సంవత్సరాలకు పైగా స్వయం సహాయక బృందం (SHG)లో చురుకైన నాయకురాలిగా పని చేస్తుంది.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రమీలా బిసోయి ఒడిశాలోని మహిళా స్వయం సహాయక సంఘ ఉద్యమమైన మిషన్ శక్తికి ప్రతినిధిగా పని చేస్తుంది. 2019 మార్చి 10న కేంద్రపారాలో మిషన్ శక్తి నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రంలో పార్లమెంటరీ సీట్లలో 33% మహిళా అభ్యర్థులను నామినేట్ చేస్తుందని ప్రకటించి అనంతరం ఏప్రిల్ 18న జరిగిన లోక్‌సభ ఎన్నికలకు అస్కా లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజు జనతాదళ్ అభ్యర్థిగా ఆమెను ప్రకటించారు.

ప్రమీలా బిసోయి బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అస్కా నియోజకవర్గం నుండి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనితా శుభదర్శినిపై 2,04,707 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Pramila Bisoyi: Bio, Political life, Family & Top stories". The Times of India. Retrieved 2019-06-24.
  2. "Trolled, mocked, even stoned... How these female lawmakers made it". The Times of India. 3 June 2019. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. "From Leading a Women's Movement to Electoral Politics, the Journey of Pramila Bisoi" (in ఇంగ్లీష్). The Wire. 16 April 2019. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  5. "Pramila Bisoyi: Mission Shakti's poster girl from Odisha" (in ఇంగ్లీష్). The Week. 15 June 2019. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  6. "Aska Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.