ప్రమోథెస్ ముఖర్జీ
| ప్రమోథెస్ ముఖర్జీ | |||
| పదవీ కాలం 1994 – 1999 | |||
| ముందు | నాని భట్టాచార్య | ||
|---|---|---|---|
| తరువాత | అధీర్ రంజన్ చౌదరి | ||
| నియోజకవర్గం | బహరంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1946 January 17 సింఘారి, ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ప్రోమోథెస్ ముఖర్జీ (జననం 17 జనవరి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రమోథెస్ ముఖర్జీ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆర్‌ఎస్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సిద్ధార్థ శంకర్ రేపై 44357 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ప్రమోథెస్ ముఖర్జీ 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆర్‌ఎస్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సబ్యసాచి బాగ్చిపై 123369 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999 2004 & 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Baharampur Lok Sabha constituency: Candidates for 2019 LS poll, past results, all updates" (in ఇంగ్లీష్). DNA India. 28 April 2019. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "Baharampur (West Bengal) Lok Sabha Election Results 2019 -Baharampur Parliamentary Constituency, Winning MP and Party Name". Elections.in. 2019. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "Berhampore Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.