ప్రమోద్ సావంత్
| ప్రమోద్ సావంత్ | |||
ప్రమోద్ సావంత్ | |||
13వ గోవా ముఖ్యమంత్రి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 మార్చి 19 | |||
| గవర్నరు | భగత్ సింగ్ కొష్యరి | ||
|---|---|---|---|
| డిప్యూటీ | మనోహర్ అఙ్గాఒంకర్ | ||
| ముందు | మనోహర్ పారికర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1973 ఏప్రిల్ 24 గోవా, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | ఎన్డీఎ | ||
| జీవిత భాగస్వామి | సులక్షణ సావంత్ | ||
ప్రమోద్ సావంత్ (జననం 1973 ఏప్రిల్ 24) భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం గోవా 11వ ముఖ్యమంత్రిగా 2019 మార్చి 19 నుండి అధికార బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
తొలినాళ్ల జీవితం
[మార్చు]సావంత్ 1973 ఏప్రిల్ 24న పాండురంగ్ పద్మిని సావంత్ దంపతులకు జన్మించాడు.[3] కొల్లాపూర్‌లోని గంగా ఎడ్యుకేషన్ సొసైటీ ఆయుర్వేద వైద్య కళాశాల నుండి ఆయుర్వేదం, మెడిసిన్ ఇంకా సర్జరీ విభాగాలలో పట్టా పొందాడు. ఆ తరువాత పూణేలోని తిలక్ మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసాడు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]సావంత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ టిక్కెట్‌పై 2008 పాలె నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ ప్రభాకర్ గౌన్స్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2012 అసెంబ్లీ ఎన్నికలలో సాంక్వెలిమ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ ప్రభాకర్ గౌన్స్‌పై 14,255 (66.02%) ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2017లో రెండోసారి ఎమ్మెల్యేగా గోవా శాసనసభకు తిరిగి ఎన్నికై 22 మార్చి 2017న గోవా శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[5][6]
ప్రమోద్ సావంత్ 2019లో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించిన తరువాత 19 మార్చి 2019న గోవా 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ Mar 19, Murari Shetye / TNN / Updated:; 2019; Ist, 08:38. "Pramod Sawant: Goa speaker Pramod Sawant succeeds Parrikar as Goa CM | India News - Times of India". The Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-14.
{{cite web}}:|first=has generic name (help);|last2=has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Pramod Sawant, Goa's New Chief Minister, Is An Ayurveda Practitioner". NDTV.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-14.
- ↑ Times, Navhind (2015-04-23). "CM to lay corner stone for Sankhali bus stand today". The Navhind Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-14.
- ↑ "Pramod Pandurang Sawant(Bharatiya Janata Party(BJP)):Constituency- SANQUELIM(NORTH GOA) - Affidavit Information of Candidate:". myneta.info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-14.
- ↑ Prakash Kamat (22 March 2017). "Pramod Sawant elected as Speaker of Goa Assembly". thehindu.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 September 2020.
- ↑ The Indian Express (23 March 2017). "BJP's Pramod Sawant elected Goa Speaker". the original నుండి 11 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2024.
- ↑ "From Ayurveda practioner [sic] to Goa CM: All you need to know about Pramod Sawant". India Today. March 19, 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 5, 2020.
- ↑ "जानिए गोवा के नए CM प्रमोद सावंत के बारे में 5 बड़ी बातें". Economic Times. the original నుండి 9 June 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-03-19.
- ↑ "प्रमोद सावंत बने गोवा के नए CM, दो उप-मुख्यमंत्रियों ने भी ली शपथ". Hindustan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-03-19.