Jump to content

ప్రవస్తి ఆరాధ్య

వికీపీడియా నుండి

అత్తలూరి ప్రవస్తి ఆరాధ్య (జననం 2006 డిసెంబరు 9) భారతీయ గాయని. తెలుగుతో పాటు తమిళ భాషా టెలివిజన్ సింగింగ్ రియాలిటీ షోల్లో పాల్గొని ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీ నిర్వహించే పాడుతా తీయగా ప్రోగ్రాంలో చిన్నతంలోనే పాల్గొన్న ఆమె తెలుగులో సూపర్ సింగర్ 2024 పాటల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది.[1]

కెరీర్

[మార్చు]

ప్రవస్తి 2006 డిసెంబరు 9న హైదరాబాదులో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే సంగీతం పట్ల ఉన్న మక్కువ తల్లిదండ్రులు గుర్తించారు. ఆమె గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్‌లో చదువుకుంది. తన 5వ యేట, 2011లో జీ తెలుగు స రే గ మ ప లిటిల్ చాంప్స్‌ టైటిల్ ను గెలుచుకుంది. 2014లో, ఆమె ఎయిర్‌టెల్ సూపర్ సింగర్ జూనియర్ 4 అనే తమిళ పాటల పోటీలో పాల్గొంది, అక్కడ ఆమె ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. ఆ సంవత్సరం ఆమెను రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డుతో అభినందించింది. ఆమె వివిధ సంగీతకారులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా పలు స్టేజ్ షోలలో కూడా ప్రదర్శన ఇచ్చింది.

వివాదం

[మార్చు]

2025లో, ప్రవస్తి తెలుగు మ్యూజిక్ రియాలిటీ షో పాడుతా తీయగా సిల్వర్‌ జూబ్లీ షోలో పాల్గొన్నది. ఆ షో నుండి ఎలిమినేట్ అయిన తర్వాత, ఆమె షో న్యాయమూర్తులు పక్షపాతం వహించారని ఆరోపించింది. న్యాయమూర్తి ఉపద్రష్ట సునీత తనను మానసికంగా వేధించిందని, అదనంగా, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన కంపోజిషన్లను, గేయ రచయిత చంద్రబోస్ తన పాటలు పాడిన పోటీదారుల పట్ల పక్షపాతం చూపారని వివరించింది. అంతేకాకుండా, ఈ కార్యక్రమం సెట్‌లో తాను అవమానం, బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని వ్యక్తం చేసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Who is Pravasthi Aradhya Singer Accuses Oscar-Winning MM Keeravani And Other Padutha Teeyaga Judges 19 year old Pravasthi beautiful photos | Pravasthi Aradhya : ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా.. సింగర్ ప్రవస్తి ఆరాధ్య బ్యాగ్రౌండ్ ఇదే!". web.archive.org. 2025-04-28. Archived from the original on 2025-04-28. Retrieved 2025-04-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. BBC News Telugu (2025-04-27), M.M.Keeravani, Sunitha గురించి Singer Pravasthi ఏమన్నారు? ఆ Reality Showలో ఏం జరిగింది, వివాదమేంటి?, retrieved 2025-04-28