ప్రవీణ్ కుమార్ నిషాద్
| ప్రవీణ్ కుమార్ నిషాద్ | |||
| పదవీ కాలం 2019 మే 23 – 2024 జూన్ 4 | |||
| ముందు | శరద్ త్రిపాఠి | ||
|---|---|---|---|
| తరువాత | లక్ష్మీకాంత్ నిషాద్ | ||
| నియోజకవర్గం | సంత్ కబీర్ నగర్ | ||
| పదవీ కాలం 2018 మార్చి 14 – 2019 మే 23 | |||
| ముందు | యోగి ఆదిత్యనాథ్ | ||
| తరువాత | రవి కిషన్ | ||
| నియోజకవర్గం | గోరఖ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1989 ఫిబ్రవరి 19 కాంపియర్‌గంజ్, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ , నిషాద్ పార్టీ (రెండూ) (2019–ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | సమాజ్ వాదీ పార్టీ (2018-2019) | ||
| పూర్వ విద్యార్థి | గౌతమ్ బుద్ధ సాంకేతిక విశ్వవిద్యాలయం, లక్నో | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ప్రవీణ్ కుమార్ నిషాద్ (జననం 19 ఫిబ్రవరి 1989) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంత్ కబీర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]ప్రవీణ్ కుమార్ నిషాద్ తన తండ్రి సంజయ్ నిషాద్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2018లో గోరఖ్‌పూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాను 21,961 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన ఆ తరువాత 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి,[6] సంత్ కబీర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి భీష్మ శంకర్ తివారీపై 35,749 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ప్రవీణ్ కుమార్ నిషాద్ 2024 లోక్‌సభ ఎన్నికలలో సంత్ కబీర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి లక్ష్మీకాంత్ నిషాద్ చేతిలో 92,170 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Praveen Kumar Nishad" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. the original నుండి 25 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2025.
- ↑ "Sant Kabir Nagar Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 25 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Sant Kabir Nagar". Election Commission of India. 4 June 2024. the original నుండి 25 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2025.
- ↑ "UP, Bihar bypoll results 2018 highlights: SP wins Gorakhpur, Phulpur; Akhilesh says results herald bad days for BJP". Hindustan Times. 15 March 2018. the original నుండి 25 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2025.
- ↑ "SP-BSP combine, RJD stun BJP in UP, Bihar Lok Sabha bypolls: 10 big takeaways" (in ఇంగ్లీష్). India Today. 14 March 2018. the original నుండి 25 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2025.
- ↑ "Gorakhpur MP Praveen Kumar Nishad joins BJP". The Times of India. 4 April 2019. the original నుండి 25 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2025.