ప్రవీణ మెహతా
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ప్రవీణ మెహతా | |
---|---|
జననం | 1923 or 1925 |
మరణం | 1992 or 1988 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | అర్చిటెక్ట్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నవీ ముంబై నిర్మాణకర్త |
ప్రవీణ మెహతా (1923-1992 లేదా 1925-1988) భారాతదేశానికి చెందిన ఆర్కిటెక్ట్, ప్లానర్ ఇంకా రాజకీయ కార్యకర్త . భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, సరోజిని నాయుడు నుండి ప్రేరణ పొందిన ఈమె తాను చదువుకునే రోజుల్లో బ్రిటీష్ రాజ్‌కి వ్యతిరేకంగా వీధి నిరసనలలో పాల్గొంది. [1] [2] ఈమె 1964 లో చార్లెస్ కొరియా, శిరీష్ పటేల్ ల సహకారంతో నయా ముంబై ప్రణాళిక, భావన, ప్రతిపాదనలో పాలుపంచుకుంది, ఈ ప్రాజెక్టులో భాగంగా ముంబై ప్రధాన భూభాగంలో తూర్పున ఉన్న ద్వీపం వరకు నగరాన్ని విస్తరించడం జరిగింది. [1]
తొలినాళ్లలో
[మార్చు]మెహతా 1940 లలో సర్ జెజె కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసింది. భారత స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆసక్తితో తన చదువును మధ్యలోనే ఆపివేసి, ఆ తరువాత అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లి తన ఆర్కిటెక్చర్ విద్యను పునః ప్రారంభించింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆమె జైలు శిక్ష కూడా అనుభవించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో చదువుకుంది, ఈ కళాశాల నుండి ఆమె ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆ తరువాత ఆమె చికాగో విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. చదువు పూర్తయిన తరువాత రెండు సంవత్సరాలు వాషింగ్టన్ డిసి లో ఆర్కిటెక్టు వృత్తి చేపట్టి, 1956లో భారత్ కు తిరిగి వచ్చింది.[3]
వృత్తి జీవితం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Woods, Mary N. "The Legacies of Architect Pravina Mehta for Feminism and Indian Modernity". Cornell University. Archived from the original on 22 నవంబరు 2022. Retrieved 16 September 2015.
- ↑ Basu, Sudipta (1 June 2008). "Building Blocks". Mumbai Mirror. Retrieved 16 September 2015.
- ↑ Basu, Sudipta (1 June 2008). "Building Blocks". Mumbai Mirror. Retrieved 16 September 2015.