Jump to content

ప్రవేశ్ రాణా

వికీపీడియా నుండి
ప్రవేశ్ రాణా
ప్రవేశ్ రాణా

(1983-02-26) 1983 ఫిబ్రవరి 26 (వయసు: 43)
బరౌత్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
విద్యాలయాలుఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తి
  • నటుడు
  • టెలివిజన్ హోస్ట్
  • మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2008–ప్రస్తుతం
Spouse
స్కార్లెట్ విల్సన్
(m. 2016)
గౌరవాలుమిస్టర్ ఇండియా (2008)
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైట్

ప్రవేశ్ రాణా (జననం 26 ఫిబ్రవరి 1983) భారతదేశానికి చెందిన నటుడు, టెలివిజన్ హోస్ట్ & మోడల్. ఆయన 2008లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి ఆ తరువాత రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్‌లో పాల్గొన్నాడు.[1][1]

ప్రవేశ్ రాణా రియాలిటీ షో ఎమోషనల్ అట్యాచార్‌తో పాటు స్క్రీన్ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అవార్డ్స్ వంటి అవార్డు షోలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆయన 2013లో సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి, 2014 అప్సర అవార్డులలో ఉత్తమ పురుష అరంగేట్రం కోసం నామినేట్ అయ్యాడు.

ప్రవేశ్ రాణా బ్రిటిష్ టెలివిజన్ సీరియల్ ది సర్పెంట్ (2021), అమెరికన్ టెలివిజన్ సిరీస్ ఫౌండేషన్ (2021)లలో నటించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రవేశ్ రాణా భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని బరౌట్‌లో జన్మించాడు. ఆయన మీరట్‌లోని సెయింట్ మేరీస్ అకాడమీ నుండి పాఠశాల విద్యను తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రాంజాస్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పూర్తి చేసి[2] లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామాటిక్ ఆర్ట్ నుండి తన మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ను పూర్తి చేశాడు.[3][4] ప్రవేశ్ రాణా 2016లో బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్‌ను వివాహం చేసుకున్నాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2013 సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్ పరంబీర్ సింగ్
2016 సాన్' 75 పచత్తర్ ప్రకాష్
2020 లండన్ కాన్ఫిడెన్షియల్ ఆజాద్
2021 రాధే హీరా లాల్
2022 రామ సేతు ప్రాజెక్ట్ మేనేజర్ బాలి
2025 దేవా ఫర్హాన్ ఖాన్ [5]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2009 బిగ్ బాస్ పోటీదారు రన్నరప్
2010-2013 ఎమోషనల్ అత్యాచార్ హోస్ట్
2021 ది సర్పెంట్ థాపా బ్రిటిష్ టెలివిజన్ సిరీస్[6]
ఫౌండేషన్ రోవాన్ అమెరికన్ టెలివిజన్ సిరీస్[7]
2023 గార్మి డిక్కీ సింగ్ [8]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డుల ప్రదర్శన అవార్డు సినిమా ఫలితం
2014 అప్సర అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్ నామినేట్ అయ్యారు

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Mr India Pravesh Rana in Bigg Boss". The Times of India. 2009-11-05. ISSN 0971-8257. Retrieved 2025-01-30.
  2. "Pravesh Rana Mr. India 2008". Retrieved 2010-06-25.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  3. "2018 graduates London academy of music & dramatic art". www.lamda.ac.uk. Retrieved 2021-01-25.
  4. "Parvesh Rana weds Scarlett Wilson: A love story from Meerut to London". The Indian Express (in ఇంగ్లీష్). 2016-08-29. Retrieved 2025-01-30.
  5. "'What is this Madness?' Fans React to Shahid Kapoor's Massy Avatar in Deva Teaser". MensXP (in Indian English). 2025-01-05. Retrieved 2025-01-30.
  6. Scroll Staff (17 January 2021). "British TV series 'The Serpent' revisits Charles Sobhraj's deadly crime spree in Thailand". Scroll.in. Retrieved 2021-01-25.
  7. "Foundation: The 'unfilmable' sci-fi epic now on our screens". www.bbc.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-09-21. Retrieved 2025-01-30.
  8. "Garmi Review: Tigmanshu Dhulia's Series Generates Tempered Heat Rather Than Scorching Highs". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2025-01-30.

బయటి లింకులు

[మార్చు]