ప్రశాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రశాంత్
జననంప్రశాంత్ త్యాగరాజన్
1973
చెన్నై, తమిళనాడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1990 – 2006, 2011 - ప్రస్తుతం
తల్లిదండ్రులుత్యాగరాజన్
బంధువులుపేకేటి శివరాం
విక్రమ్

ప్రశాంత్ ఒక దక్షిణ భారత సినీ నటుడు. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు. 17 సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ వైగాసి పోరంతచ్చు అనే తమిళ సినిమాతో నటుగా తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత బాలు మహేంద్ర దర్శకత్వంలో వాణ్ణ వాణ్ణ పూక్కళ్, ఆర్. కె. సెల్వమణి దర్శకత్వంలో చెంబరుతి, మణిరత్నం దర్శకత్వంలో తిరుడా తిరుడా సినిమాల్లో నటించాడు.

1998లో ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ చిత్రంతో ప్రశాంత్ కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో అతను ఐశ్వర్యా రాయ్ సరసన ద్విపాత్రాభినయం చేశాడు. ప్రశాంత్ కు చెన్నైలోని పానగల్ పార్క్ ప్రాంతంలో ఒక బంగారు నగల దుకాణం ఉంది.[1]

కెరీర్[మార్చు]

ప్రశాంత్ 1990 లో వైగాసి పోరంతచ్చు సినిమాతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తరువాత మలయాళ దర్శకుడు వాసుదేవన్ నాయర్ రూపొందించిన పేరుంతచ్చన్ సినిమాలో నటించాడు. హిందీ సినిమా దిల్కు రీమేక్ అయిన తొలి ముద్దు అనే సినిమాలో దివ్య భారతి సరసన నటించాడు.

2000 దశకంలో ప్రశాంత్ కథానాయకుడిగా చాలా సినిమాలు ప్రారంభమయ్యాయి కానీ వాటిలో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి.[2]

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Tamil Movie News prashanth thiagarajan usman road tower of gold t nagar tamil cinema picture gallery. Behindwoods.com. Retrieved on 2011-09-06.
  2. "Prashanth on a signing spree!!". Sify.com. 2005-12-16. మూలం నుండి 2015-06-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-07-27. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రశాంత్&oldid=2840332" నుండి వెలికితీశారు