Coordinates: 16°31′11″N 80°41′22″E / 16.519602°N 80.689558°E / 16.519602; 80.689558

ప్రసాదంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసాదంపాడు
—  జనగణన పట్టణం  —
హైవే నెం-45లో ప్రసాదంపాడు ప్రధానవీధి
హైవే నెం-45లో ప్రసాదంపాడు ప్రధానవీధి
హైవే నెం-45లో ప్రసాదంపాడు ప్రధానవీధి
ప్రసాదంపాడు is located in Andhra Pradesh
ప్రసాదంపాడు
ప్రసాదంపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°31′11″N 80°41′22″E / 16.519602°N 80.689558°E / 16.519602; 80.689558
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి ఈడ్పుగంటి నళిని
జనాభా (2011)
 - మొత్తం 13,941
 - పురుషుల సంఖ్య 7,051
 - స్త్రీల సంఖ్య 6,890
 - గృహాల సంఖ్య 3,860
పిన్ కోడ్ : 521108
ఎస్.టి.డి కోడ్ 0866

ప్రసాదంపాడు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం.ఇది కృష్ణా జిల్లా, విజయవాడ పరిసర ప్రాంతం. ఇది పూర్తిగా విజయవాడ నగరంలో కలిసిపోయింది.

గణాంకాలు[మార్చు]

ప్రసాదంపాడు ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లాలో ఒక జనాభా లెక్కల పట్టణం. సెన్సస్ ఇండియా 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ప్రసాదంపాడు జనగణన పట్టణ జనాభా 13,941, అందులో 7,051 మంది పురుషులు, 6,890 మంది స్త్రీలు.

0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1509, ఇది ప్రసాదంపాడు పట్టణ మొత్తం జనాభాలో 10.82%. స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 977గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే ప్రసాదంపాడులో పిల్లల లింగ నిష్పత్తి దాదాపు 970. ప్రసాదంపాడు నగరం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 80.73% ఎక్కువ. . ప్రసాదంపాడులో పురుషుల అక్షరాస్యత దాదాపు 83.83% కాగా స్త్రీల అక్షరాస్యత రేటు 77.55%.

ప్రసాదంపాడు పట్టణ పరిధిలో 3,860 గృహాలకు స్థానిక స్వపరిపాలన సంస్థ పరిపాలనను కలిగి ఉంది. వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. పట్టణ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, దాని అధికార పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి కూడా స్థానిక స్వపరిపాలన సంస్థకు అధికారం కలిగి ఉంది.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

మెట్రోపాలిటన్ ప్రాంతం[మార్చు]

2017 మార్చి 23న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ.104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[3][4]

గ్రామ భౌగోళికం[మార్చు]

ప్రసాదంపాడు మెయిన్ రోడ్‌పై దృశ్యం

ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

రామవరప్పాడు 1 కి.మీ, నాగార్జున నగర్ 1 కి.మీ, శ్రీ రామచంద్ర నగర్ 1 కి.మీ, ఎనికేపాడు 2 కి.మీ, శ్రీనివాస నగర్ బ్యాంకు కాలని

రవాణా సౌకర్యాలు[మార్చు]

విజయవాడ, ఎ.పి.ఎస్.ఆర్టీ.సి పెద్ద రోడ్డురవాణా సౌకర్యం గల పెద్ద సంస్థ

రైలు వసతి[మార్చు]

  • విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
  • గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212

విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[5][6] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ప్రసాదంపాడుకు చెందిన కె.భీంకుమార్, 1992 వ సంవత్సరంలో, నిడమానూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, 10వ తరగతి చదివాడు. ఇతనికి ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టరేటు పట్టాను అందజేసారు. ఎస్.పి.పబ్లిక్ పాఠశాల, సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల, వివేకానంద కాన్వెంట్ పాఠశాల, ఎస్.కె.విద్యావాణి, సి.బి.సి.ఎన్.చి.ఎ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రసాదంపాడు

గ్రామపంచాయతీ[మార్చు]

ఈ గ్రామపంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో ఈడ్పుగంటి నళిని సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా కొమ్మా కోటేశ్వరరవు ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • ప్రసాదంపాడు గ్రామంలోని బాలపేరంటాళ్ళు జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో వైభవంగా నిర్వహించెదరు. కార్యక్రమాలలో భాగంగా అమ్మవారికి భక్తులు, గండదీపాలతో మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో భాగంగా అమ్మవారికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో గ్రామోత్సవం నిర్వహించెదరు. రామవరప్పాడుతోపాటు, ప్రసాదంపాడులోని పలు వీధులలో ఈ గ్రామోత్సవం సాగుతుంది.
  • శ్రీ మహాలక్ష్మి, మహా గణపతి, మహా సరస్వతీదేవి ఆలయం.
  • శ్రీ షిర్డీసాయి మందిరం.

గ్రామ విశేషాలు[మార్చు]

ప్రసాదంపాడు గ్రామాన్ని మండల పరిషత్తు అధికారులు, మోడల్ గ్రామంగా ఎంపిక చేసారు. ఈ గ్రామాన్ని సోలార్ గ్రామంగా గూడా ఎంపిక చేసారు. దీనితో కేంద్ర ప్రభుత్వం వారు, ఈ గ్రామస్థులకు సోలార్ పరికరాలను 50% రాయితీతో అందజేసెదరు.

మూలాలు[మార్చు]

  1. "Prasadampadu Census Town City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-05-27.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  3. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.
  4. "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Archived from the original on 7 May 2017. Retrieved 27 March 2017.
  5. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.
  6. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-11-07. Archived from the original on 2016-11-07. Retrieved 2022-08-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]