ప్రసూతి ఇన్ఫెక్షన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసూతి ఇన్ఫెక్షన్లు
Specialtyప్రసూతిశాస్త్రం Edit this on Wikidata

శిశు జననం లేదా గర్భస్రావం తరువాత మహిళా పునరుత్పత్తి మార్గానికి వచ్చే ప్రసవానంతర ఇన్ఫెక్షన్లు అని పిలువబడే ప్రసూతి ఇన్ఫెక్షన్లు, ప్రసావానంతర జ్వరం లేదా చైల్డ్ బెడ్ ఫీవర్ అనేవి ఏదైనా బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్గా ఉన్నాయి. సంకేతాలు మరియు లక్షణాలలో సాధారణంగా 38.0 °C (100.4 °F) కన్నా ఎక్కువగా జ్వరం, వణుకులు, దిగువ పొత్తి కడుపు నొప్పి, మరియు యోని నుండి చెడు వాసనతో విసర్జనాలు వచ్చే అవకాశం ఉంటుంది.[1] ప్రసవం జరిగిన మొదటి 24 గంటల తరువాత మరియు మొదటి పది రోజులలోపు ఇవి సాధారణంగా సంభవిస్తాయి.[2]

గర్భాశయ ఇన్ఫెక్షన్ మరియు దాని చుట్టుపక్కల కణజాల ఇన్ఫెక్షన్ అనేది సర్వ సాధారణం, దీన్ని బాలింత జ్వరము లేదా ప్రసవానంతర గర్భాశయ శోధ అని పిలుస్తారు. ప్రమాద కారణాలలో సిజేరియన్ ఆపరేషన్ , యోనిలో గ్రూప్ B స్ట్రెప్టోకోకస్ వంటి నిర్దిష్టమైన బ్యాక్టీరియా ఉనికి, ప్రసవానికి ముందు పొరలు చీలటం మరియు ఎక్కువ సమయం పట్టే ప్రసవం వంటివి ఉంటాయి. చాలా ఇన్ఫెక్షన్లలో వివిధ రకాలైన బాక్టీరియా ప్రమేయం ఉంటుంది. యోని లేదా రక్తంలో బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల కోసం పరీక్షించటం అనేది అరుదుగా రోగ నిర్ధారణకు సహాయపడుతుంది. మెడికల్ ఇమేజింగ్ మెరుగుపడని వారిలో ఇది అవసరం అవ్వవచ్చు. ప్రసవం తరువాత జ్వరానికి గల ఇతర కారణాలు: ఎక్కువ పాలతో రొమ్ము నొప్పులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌లు, ఉదర కోత ఇన్ఫెక్షన్లు లేదా యోని ప్రాంతాలను కోయటం, శిశువు ఊపిరితిత్తులు తెరుచుకోక పోవటం.[1]

సిజేరియన్తో ప్రసవం తరువాత వచ్చే ప్రమాదవకాశాల కారణంగా, శస్త్రచికిత్స సమయంలో మహిళలందరూ యాంపిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ యొక్క నివారణ మోతాదును తీసుకోవాలని సిఫార్సు చేయటం జరిగింది.గుర్తించబడిన ఇన్పెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ చికిత్స ద్వారా చాలామంది ప్రజలలో రెండు నుండి మూడు రోజులలో మెరుగువుతుంది.తేలికపాటి వ్యాధి ఉన్నవారిలో నోటి ద్వారా వేసుకునే యాంటీబయటిక్స్ వాడవచ్చు, నయం కాకపోతే ఇంట్రావీనస్ యాంటీబయాటిక్సును సిఫార్సు చేస్తారు. యోని ద్వారా ప్రసవం తరువాత సాధారణ-యాంటీబయోటిక్స్‌లో యాంపిసిలిన్ మరియుజెంటామైసిన్ కలయిక ఉంటుంది లేదా సిజేరియన్ ప్రసవం జరిగిన వారికి క్లాన్డమైసిన్ మరియు జెంటామైసిన్ కలయిక ఉంటుంది. తగిన చికిత్స ద్వారా ఇతర సమస్యలను మెరుగుపరుచుకోని వారిలో, చీము గడ్డ వంటి ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి.[1]

అభివృద్ధి చెందిన ప్రపంచంలో,యోని ద్వారా ప్రసవం తరువాత గర్భాశయ వ్యాధులు సుమారు ఒకటి నుండి రెండు శాతం వారిలో పెరిగాయి. నివారక యాంటీబయాటిక్స్ వాడకముందే మరింత క్లిష్టతరమైన ప్రసవాలు సంభవించిన ఐదు నుంచి పదమూడు శాతం మధ్య గల వారిలో మరియు సిజేరియన్-ఆపరేషన్ల వల్ల యాభై శాతం వారిలో ఇవి పెరుగుతాయి.[1] ఈ ఇన్ఫెక్షన్ల వల్ల 1990లో 34,000 మరణాలు సంభవించగా అవి 2013లో 24,000 మరణాలకు తగ్గాయి.[3] ఈ పరిస్థితికి సంబంధించిన తెలిసిన మొదటి వివరణలు చరిత్రలో కనీసం 5వ శతాబ్ధం బిసిఇ నాటి దన్వంతరి వైద్యుల రచనలలో కనిపిస్తాయి.[4] దాదాపు 18వ శతాబ్దంలో శిశుజననాలు ప్రారంభమైనప్పటి నుండి 1930లో యాంటీబయాటిక్స్ ప్రవేశపెట్టబడే వరకు ఈ ఇన్ఫెక్షన్లు మరణానికి చాలా సాధారణమైన కారణంగా ఉన్నాయి.[5] 1847లో, ఆస్ట్రియాలో, ఇగ్నాజ్ సెమ్మెల్విస్ క్లోరిన్ ఉపయోగించి చేతులు కడుక్కోవటం ద్వారా దాదాపు 20 శాతం నుండి రెండు శాతం వరకు వ్యాధితో సంభవించే మరణాలు తగ్గాయి.[6][7]

రిఫరెన్సులు

  1. 1.0 1.1 1.2 "37". Williams obstetrics (24th ed.). McGraw-Hill Professional. 2014. pp. Chapter 37. ISBN 9780071798938.
  2. Hiralal Konar (2014). DC Dutta's Textbook of Obstetrics. JP Medical Ltd. p. 432. ISBN 9789351520672.
  3. GBD 2013 Mortality and Causes of Death, Collaborators (17 December 2014). "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. doi:10.1016/S0140-6736(14)61682-2. PMID 25530442. {{cite journal}}: |first1= has generic name (help)CS1 maint: numeric names: authors list (link)
  4. Walvekar, Vandana (2005). Manual of perinatal infections. New Delhi: Jaypee Bros. p. 153. ISBN 9788180614729.
  5. Magner, Lois N. (1992). A history of medicine. New York: Dekker. pp. 257–258. ISBN 9780824786731.
  6. Anderson, BL (April 2014). "Puerperal group A streptococcal infection: beyond Semmelweis". Obstetrics and gynecology. 123 (4): 874–82. PMID 24785617.
  7. Ataman, AD; Vatanoglu-Lutz, EE; Yildirim, G (2013). "Medicine in stamps-Ignaz Semmelweis and Puerperal Fever". Journal of the Turkish German Gynecological Association. 14 (1): 35–9. PMID 24592068.