ప్రాణమిత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాణమిత్రులు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం వెంకటేశ్వర్లు
రచన ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

ప్రాణమిత్రులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నాయికా నాయకులుగా, పి.పుల్లయ్య దర్శకత్వం వహించి తీసిన 1967 నాటి తెలుగు సినిమా. సినిమాకి ముళ్లపూడి వెంకటరమణ కథ, మాటలు సమకూర్చారు.

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావుతో తేడాలు వచ్చి రచయిత ముళ్ళపూడి వెంకటరమణ మద్రాసునూ చలనచిత్ర పరిశ్రమనీ వదిలేసి మళ్ళీ పత్రికారచయితగా విజయవాడ వెళ్ళిపోయారు. అయితే ముళ్ళపూడి వెంకటరమణ రచనా శైలి, పనిచేసే పద్ధతి నచ్చిన పి.పుల్లయ్య విజయవాడ ట్రంకాల్ చేసి మాట్లాడి రమణ మనసు మార్చుకుని పరిశ్రమకు వచ్చేట్టుగా, ఈ సినిమాకు రచన చేసేట్టుగా ఒప్పించారు. అయితే ఆదుర్తితో గొడవపడి సినిమాలు వదులుకున్నాడన్న జాలితో ఈ అవకాశం ఇస్తున్నారేమోనన్న అనుమానంతో రమణ తాను విజయవాడలో ఉండి మద్రాసుకు వస్తూపోతూ రాస్తానని, తన పారితోషికం 15వేలు చేయమని కండిషన్లు పెట్టారు. (అలా అయితే జాలో, నిజంగానే ప్రతిభపై గౌరవమో తేలుతుందని) అన్నిటికీ ఆనందంగా పుల్లయ్య ఒప్పుకొని ఈ సినిమా స్క్రిప్ట్ పని ప్రారంభింపజేశారు.[1]

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఈ పాపం ఫలితం ఎవ్వరిది ఓ భగవాన్ నీది - పి.సుశీల, ఘంటసాల, జె.వి.రాఘవులు - రచన: ఆత్రేయ
  2. కలకల నవ్వే వయసుంది కావాలన్నా దొరకంది - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె
  3. గుండె ఝల్లుమన్నది అందె ఘల్లుమన్నద మూగమనసు పరవశించి - పి.సుశీల - రచన: దాశరథి
  4. తలుపు తెరు తలుపు తెరు పిలుపు విను తలుపు తెరు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  5. తెల్లవారెను కోడికూసెను దిక్కులన్ని తెలివిమీరెను చందురుడా - ఘంటసాల - రచన: ఆత్రేయ
  6. నువ్వు కావాలి నువ్వే కావాలి - ఎల్. ఆర్. ఈశ్వరి
  7. వయసు పెరిగినా మనిషి ఎదిగినా మనసు ముదరనంతవరకు - పి. శాంతకుమారి - రచన: ఆత్రేయ

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ముళ్ళపూడి, వెంకటరమణ (జూలై 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.