Jump to content

ప్రాథమిక కణం

వికీపీడియా నుండి

ప్రాథమిక కణం (ఆంగ్లం: Elementary particle or Fundamental Particle) అనేది పరమాణువు లోపల మరే ఇతర కణాల కలయికతోనూ ఏర్పడని కణం.[1] ప్రస్తుతం ప్రామాణిక నమూనా ఇలాంటి 17 స్పష్టమైన కణాలను గుర్తించింది. అవి 12 ఫెర్మియాన్లు, 5 బోసాన్లు. అన్ని ప్రాథమిక కణాలు బోసన్లు లేదా ఫెర్మియాన్లు.[1] పదార్థాలన్నీ పరమాణువులచే నిర్మితమై ఉంటాయి. పూర్వకాలంలో ఈ పరమాణువులు విభజించడానికి వీలులేనివి అని భావించారు. కొన్ని వేల సంవత్సరాల నుంచీ పరమాణు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నా దాని ఉనికి మాత్రం 1905 దాకా ప్రశ్నార్థకంగానే ఉంది. అదే సంవత్సరంలోనే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ బ్రౌనియన్ చలనాలపై ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించాడు. ఈ పత్రం అణువులు అనేవి కేవలం గణితపరమైన ఊహలు అనే కథనాలను పక్కకు నెట్టింది. ఐన్‌స్టీన్ ఇంకా ముందుకు వెళ్ళి పదార్థం అనేది వివిధ సాంద్రతల్లో ఉన్న శక్తుల రూపం అని ప్రకటించాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 Braibant, Sylvie; Giacomelli, Giorgio; Spurio, Maurizio (2012). Particles and Fundamental Interactions: An introduction to particle physics (2nd ed.). Springer. pp. 1–3. ISBN 978-94-007-2463-1.
  2. Newburgh, Ronald; Peidle, Joseph; Rueckner, Wolfgang (2006). "Einstein, Perrin, and the reality of atoms: 1905 revisited" (PDF). American Journal of Physics. 74 (6): 478–481. Bibcode:2006AmJPh..74..478N. doi:10.1119/1.2188962. the original (PDF) నుండి 3 ఆగస్టు 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 ఆగస్టు 2013.