ప్రియ దావిదర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియ దావిదర
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ప్రియ దావిదర స్త్రీఎకాలజిస్టులలో ప్రొఫెసర్ బాధ్యతలను స్వీకరిచించిన వారిలో ప్రథమ మహిళ. ఆధునిక కాలంలో మహిళా ఎకాలజిస్టుల మారిన స్థితిగతులకు ఆమె ఒక చక్కని కానుక. ఆమె ఎకాలజిస్ట్‌మారడానికి పలు కారణాలు ఉన్నాయి. అమే తండ్రి ఉత్సాహవంతుడైన ప్రకృతిఆరాధకుడు, వన్యమృగాల ఛాయాచిత్రకారుడు. అందువలన ప్రియ దావిదరకు చిన్న వయసు నుండి ప్రకృతితో అనుబంధం ఉంది. ఈ అనుబంధం వలన ఆమెకు చుట్టూ ప్రపంచాన్ని సాహసంతో, ఆసక్తితో చూసే స్ఫూర్తిని కలిగించింది. ఆమె ప్రఖ్యాత పక్షిశాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ మార్గదర్శకంలో పి.హెడ్ అధ్యనం కొనసాగించింది. ఆమె సహాధ్యాయులు ఆమె ఎకాలజీ ఆసక్తికి ముఖ్యత్వం ఇవ్వనప్పటికీ డాక్టర్ సలీం ఆమెకు అద్వితీయ ప్రోత్సాహం, మద్దతును ఇచ్చింది. ఆమె చిన్నవయసులో స్త్రీలు అంతగా ప్రవేశించని పరిశోధనా ప్రపంచంలో అడుగుపెట్టింది. ఒకప్పుడు ఇలాంటి ఫీల్డ్ వర్క్‌ సంబంధిత పరిశోధనలకు స్త్రీలు తగరన్న అభిప్రాయం ఉంటూ వచ్చిందన్నది ఒకవిదమైన పురుషాధిక్య ప్రపంచంలో అడుగుపెట్టినట్లుగా అమే అభిప్రాయపడింది. ఈ ప్రయికూల పరిస్థులు ధైర్యం సాధించాలన్న పట్టుదలను ఆమెలో నింపాయి.

పోస్ట్ డాక్టరల్ అధ్యయనం[మార్చు]

రీసెర్చి తరువాత ప్రయాదావిదరకు అమెరికాలో ఏడు సంవత్సరాల కాలం పోస్ట్ డాక్టరల్ అధ్యయనం కొనసాగించడానికి అవకాశం లభించింది. " స్మింసన్ ఇంస్టిట్యూషన్, హార్వర్డ్ యూనివర్శిటీ, ఇతర సంస్థల నుండి అవకాశం లభించింది. ఉత్తర, మద్య అమెరికాలో ఫీల్డ్ వర్క్ చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాలు సైన్సు ప్రపంచంలో ఎదగడానికి ఎంతగానో సహకరించాయి.

భారతదేశానికి రాక[మార్చు]

7 సంవత్సరాల విదేశీయానం తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత పాండిచేరీ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ బాధ్యతను చేపట్టింది. అత్యంత సుందరమైన విద్యాసంబధిత జీవితంలోకి ప్రవేశించినట్లు ఆమె అభిప్రాయపడింది. ఆసక్తి, అత్యుత్సాహంతో పరిశోధన, విద్యాబోధ చేయడానికి అనుకూలమైన వాతావరణంలో ఆమె వృత్తిజీవితం కొనసాగింది. అమే ఎదుర్కొన్న సమస్యలలో ఒకటి భారతదేశంలో ఇంకా సజీవంగా ఉన్న కులవ్యవస్థ. ఉన్నతమైన సంస్థలలో అధికభాగం ఫార్వార్డ్ జాతుల ఆధిక్యతలో నడుస్తున్నాయని ఆమె అభిప్రాయం వెలిబుచ్చిది. యూనివర్శిటీలలో రిజర్వేషన్ల రూపంలో వివిధ జాతులకు అవకాశం ఇస్తున్నాయని కూడా అభిప్రాయపడింది. అలాగే స్త్రీపురుష భేదంకూడా సమాజంలో ఉన్నట్లే వృత్తిఉద్యోగాలలో ప్రధానపాత్ర వహిస్తున్నట్లు ఆమె అభిప్ర్రయపడింది. ప్రత్యేకంగా సంప్రదాయానికి అధికంగా ప్రాముఖ్యం ఇస్తున్న దక్షిణ భారతదేశంలో వస్త్రధారణలో, శిరోజాలంకరణలో, బాడీ లాగ్వేజులో స్త్రీపురుష భేదం అత్యధికంగా ఉన్నదని ఆమె అభిప్రాయపడింది. అందువలన స్త్రీలు పశ్చిమదేశాలలో ఉన్నట్లు విద్యలలో వెనుకబడి ఉన్నారనన్నది ఆమె అభిప్రాయం. సమాజికంగా స్త్రీలు దిగువస్థితిలో ఉన్నారని అభిప్రాయపడింది.

వృత్తిజీవితం[మార్చు]

ప్రతికూల పరిస్థితితులు ఎదుర్కొన్నప్పటికీ ప్రయాదావిదర వృత్తిపరంగా సంతృప్తికరమైన ప్రగతి సాధించింది. అత్యంత వైరుధ్యాలున్న భారతభూమిలో ఆమె పొందిన అనుభవాలు ఆమెలో ధైర్యం, పౌరుషం, పట్టుదల పెపొందించాయి. ప్రత్యేకంగా సైన్సు రంగంలో అవసరమైన ప్రయోగశాలలు, మౌలిక వసతుల కొరత అధికంగా ఉంది. ఆమె స్నేహితులు కూడా ఇలాగే ప్రయోగశాలలు, నిర్వహణా పరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆమె కథనాలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఆమెకు కుటుంబ మద్దతు బలంగా ఉన్నందున అనుకున్న ప్రగతి సాధించడానికి సాధ్యపడింది.ఆమె పలువిద్యార్థులకు అధ్యయనంలో సహకరించింది. ఆస్చర్యంగా గ్రామాలలో మహిళాశాస్త్రవేత్తలకు చక్కని ఆదరణ లభిస్తున్నాయన్నది ఆమె అభిప్రాయం. ఆమె 20 సంవత్సరాల వృత్తిజీవితంలో అరయాలలో ఉన్న గ్రామీణ ప్రలనుండి ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదుర్కోలేదు. భారతీయజీవన నాణ్యతను అభివృద్ధిచేయడానికి ఎకాలజిస్టులు అవసరమని ఆమె అభిప్రాయపడింది. కలుషిత పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటూ అలాగే జీవవైరుధ్యం క్షీణిస్తున్న భారతభూమిలో ఎకాలజిస్టులు తమ శ్రద్ధను, మేధస్సును ఉపయోగించి మార్పులు తీసుకురావాలన్నది ఆమె అభిప్రాయం.


వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.